ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Shivraj Singh Chouhan: రైల్లో ప్రయాణించిన కేంద్ర మంత్రి

ABN, Publish Date - Jun 16 , 2024 | 02:46 PM

కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ఆదివారం శతాబ్ది ఎక్స్‌ప్రెస్‌‌లో ప్రయాణించారు. న్యూఢిల్లీ నుంచి భోపాల్ వరకు ఆయన తన భార్యతో కలిసి ఈ రైలులో ప్రయాణించారు. ఈ సందర్బంగా ఆయన ప్రయాణికులతో మాటలు కలిపారు.

భోపాల్‌/న్యూఢిల్లీ, జూన్ 16: కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ఆదివారం శతాబ్ది ఎక్స్‌ప్రెస్‌‌లో ప్రయాణించారు. న్యూఢిల్లీ నుంచి భోపాల్ వరకు ఆయన తన భార్యతో కలిసి ఈ రైలులో ప్రయాణించారు. ఈ సందర్బంగా ఆయన ప్రయాణికులతో మాటలు కలిపారు. ఆ క్రమంలో ఆయనతో పలువురు ప్రయాణికులు సెల్పీ దిగారు. అందుకు సంబంధించిన ఫొటోలను కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ తన ఎక్స్ వేదికగా పోస్ట్ చేశారు.


భారతీయ రైల్వేలో విప్లవాత్మకమైన మార్పులు వచ్చాయన్నారు. ఆ మార్పునకు ప్రధాని నరేంద్ర మోదీ సలహాలు సూచనలతోపాటు కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ దార్శనికతే కారణమని పేర్కొన్నారు. ఆ క్రమంలో వారిద్దరిపై శివరాజ్ సింగ్ చౌహాన్ ఎక్స్ వేదికగా ప్రశంసలు కురిపించారు.

Also Read: Amit Shah:జమ్ము కాశ్మీర్‌‌‌లో శాంతి భద్రతలపై సమీక్ష


మధ్యప్రదేశ్‌లో వరుసగా అధికారాన్ని నిలుపుకోవడమే కాదు.. ఇటీవల జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో సైతం ఆ రాష్ట్రంలో బీజేపీ ఘన విజయం సాధించడంలో శివరాజ్ సింగ్ చౌహాన్ కీలకంగా వ్యవహరించారు. ఈ ఎన్నికల్లో విదిశ లోక్‌సభ స్థానం నుంచి బరిలో దిగిన చౌహాన్.. 8 లక్షల ఓట్ల ఆధిక్యంతో గెలుపొందారు.

తాజాగా మోదీ కేబినెట్‌లో కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రిగా శివరాజ్ సింగ్ చౌహాన్ బాధ్యతలు చేపట్టారు. గతంలో మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రిగా కూడా ఆయన పని చేశారు. అయితే బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా శివరాజ్ సింగ్ చౌహాన్‌ను నియమిస్తారనే ఓ ప్రచారం అయితే నిన్న మొన్నటి వరకు జరిగిన సంగతి తెలిసిందే.

Read Latest National News and Telugu News

Updated Date - Jun 16 , 2024 | 06:34 PM

Advertising
Advertising