ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Maharastra Assembly Elections : బాస్ అనుమతి ఇవ్వలేదు.. అందుకే

ABN, Publish Date - Aug 16 , 2024 | 07:06 PM

మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల వాయిదాపై శివసేన (యూబీటీ) నేత, మాజీ మంత్రి ఆదిత్య ఠాక్రే స్పందించారు. మహారాష్ట్ర అసెంబ్లీకి ఎన్నికల నిర్వహించేందుకు ఎన్నికల సంఘానికి ‘బాస్’ అనుమతి ఇవ్వలేదంటూ పరోక్షంగా ప్రధాని మోదీని విమర్శించారు. జమ్మూ కశ్మీర్‌లో పరిస్థితులు మెరుగు పడ్డాయంటూ మోదీ ప్రభుత్వం గత కొంత కాలంగా ప్రచారం చేస్తుందని గుర్తు చేశారు.

ముంబయి, ఆగస్ట్ 16: జమ్మూ కశ్మీర్‌తోపాటు హరియాణ అసెంబ్లీ ఎన్నికల నిర్వహణ తేదీలను కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్ రాజీవ్ కుమార్ శుక్రవారం వెల్లడించారు. అయితే మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ ప్రకటించకపోవడంపై ఈ సందర్భంగా సీఈసీ రాజీవ్ కుమార్ వివరణ ఇచ్చారు.

స్పందించిన ఆదిత్య ఠాక్రే..

దీనిపై ఆ రాష్ట్రంలోని శివసేన (యూబీటీ) నేత, మాజీ మంత్రి ఆదిత్య ఠాక్రే స్పందించారు. మహారాష్ట్ర అసెంబ్లీకి ఎన్నికల నిర్వహించేందుకు ఎన్నికల సంఘానికి ‘బాస్’ అనుమతి ఇవ్వలేదంటూ పరోక్షంగా ప్రధాని మోదీని విమర్శించారు. జమ్మూ కశ్మీర్‌లో పరిస్థితులు మెరుగు పడ్డాయంటూ మోదీ ప్రభుత్వం గత కొంత కాలంగా ప్రచారం చేస్తుందని గుర్తు చేశారు. కానీ ఇటీవల కాలంలో జమ్మూ కశ్మీర్‌లో ఉగ్రవాద దాడులు పెచ్చురిల్లాయాన్నారు. దీంతో ఆ రాష్ట్రంలో సామాన్య మానవుడికి రక్షణ లేకుండా పోయిందని విమర్శించారు.

Hyderabad City: పురపాలక శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ దానకిశోర్ ఆకస్మిక తనిఖీలు


ఇదే విషయాన్ని కేంద్ర ఎన్నికల సంఘం పునరుద్ఘాటించిందని ఆదిత్య ఠాక్రే స్పష్టం చేశారు. జమ్మూ కశ్మీర్‌లో పరిస్థితులు మెరుగు పడ్డాయంటూ మోదీ ప్రభుత్వం చేసుకుంటున్న ప్రచారానికి కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించిన షెడ్యూల్ ద్వారా ఫుల్ స్టాప్ పడినట్లు అయిందన్నారు.

Also Read: Kolkata doctor case: మమతా బెనర్జీ ప్రభుత్వంపై మండిపడ్డ కోల్‌కతా హైకోర్టు


బీజేపీపై ఫైర్..

ఈ సందర్భంగా కేంద్రంలోని బీజేపీ వ్యవహరిస్తున్న తీరు పట్ల ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మహారాష్ట్ర ప్రజలు ఇప్పటికే ఆ పార్టీని ఒకసారి తిరస్కరించారని గుర్తు చేశారు. రానున్న రోజుల్లో ఆ పార్టీని మరోసారి ప్రజలు తిరస్కరిస్తారని ఆదిత్య ఠాక్రే జోస్యం చెప్పారు. రాష్ట్రాన్ని దోచుకునే విధంగా ‘వాళ్ల కాంట్రాక్టర్లు’కు కేంద్ర ఎన్నికల సంఘం అవకాశం కల్పించినట్లుగా ఉందని ఆదిత్య ఠాక్రే అభిప్రాయపడ్డారు.

Also Read: Kolkata Medical student murder: ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డా ఎదుట వైద్యుల ‘ఆరు డిమాండ్లు’


అందుకే ఆలస్యం..

మరోవైపు.. జమ్మూ కశ్మీర్‌లో శాంతి భద్రతల దృష్ట్యా ముందుగా ఆ రాష్ట్రంతోపాటు హరియాణా అసెంబ్లీ ఎన్నికలు నిర్వహిస్తామని కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్ రాజీవ్ కుమార్ స్పష్టం చేశారు. అదీకాక మహారాష్ట్రలో ప్రస్తుతం భారీ వర్షాలు కురుస్తున్నాయన్నారు. అలాగే ప్రాంతీయ, సాంస్కృతిక కార్యక్రమాలు జరుగుతున్నాయని తెలిపారు.

Also Read: Jammu Kashmir: ఎన్నికల ప్రకటనకు ముందు రాష్ట్రంలో కీలక పరిణామాలు


అదే విధంగా వరుసగా పితృపక్షాలు, దీపావళీ, వినాయక చవితి పర్వదినాలు వచ్చాయన్నారు. ఈ నేపథ్యంలో మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు తర్వాత ప్రకటిస్తామని తెలిపారు. అదీకాక.. సెప్టెంబర్ 30వ తేదీ లోపు జమ్మూ కశ్మీర్ అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించాలని సుప్రీంకోర్టు ఇప్పటికే ఆదేశాలు జారీ చేసింది. అలాగే హరియాణా, మహారాష్ట్రతోపాటు జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికలు ఈ ఏడాది లోపు నిర్వహించాల్సి ఉందన్న సంగతి అందరికి తెలిసిందే.

Also Read:Raksha Bandhan 2024: రాఖీ పౌర్ణమి.. శుభ ముహూర్తం ఎప్పుడంటే..? ఏ రాశి వారికి ఏ రంగు రాఖీ కట్టాలంటే..?

Read More National News and Latest Telugu News

Updated Date - Aug 16 , 2024 | 07:19 PM

Advertising
Advertising
<