Ayodhya: ఆరుగురు ఉన్నతాధికారులపై సస్పెన్షన్ వేటు
ABN, Publish Date - Jun 29 , 2024 | 02:00 PM
ఇటీవల కురిసిన భారీ వర్షం కారణంగా అయోధ్యలో పలు ప్రాంతాల్లో భారీగా నీరు నిలిచిపోవడంతోపాటు రహదారులపై భారీ గుంతులు ఏర్పాడ్డాయి. ఈ నేపథ్యంలో సీఎం యోగి ఆదిత్యనాథ్ అధ్యక్షతన ఉన్నతస్థాయి సమీక్ష సమావేశం నిర్వహించారు.
పట్నా, జూన్ 29: ఇటీవల కురిసిన భారీ వర్షం కారణంగా అయోధ్యలో పలు ప్రాంతాల్లో భారీగా నీరు నిలిచిపోవడంతోపాటు రహదారులపై భారీ గుంతులు ఏర్పాడ్డాయి. ఈ నేపథ్యంలో సీఎం యోగి ఆదిత్యనాథ్ అధ్యక్షతన ఉన్నతస్థాయి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఆ క్రమంలో ఆరుగురు ఉన్నతాధికారులపై ఆయన సస్పెన్షన్ వేటు వేశారు. అలాగే అయోధ్యలో రహదారులను వెంటనే బాగు చేయాలని ఆదేశించారు. ఇక పట్టణంలో ఎక్కడ వర్షపు నీరు నిలవకుండా తక్షణం చర్యలు చేపట్టాలని ఉన్నతాధికారులను ఈ సందర్భంగా సీఎం యోగి సూచించారు.
అయితే సస్పెన్షన్‌కు గురైన వారిలో.. పబ్లిక్ వర్క్స్ డిపార్ట్‌మెంట్‌కు చెందిన ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ దృవ్ అగర్వాల్, అసిస్టెంట్ ఇంజినీర్ అంజు దేశ్‌వాల్, జూనియర్ ఇంజినీర్ ప్రభాత్ పాండే ఉన్నారు. అలాగే జల్ నిగమ్‌కు చెందిన ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ అనంద్ కుమార్ దుబే, అసిస్టెంట్ ఇంజినీర్ రాజేంద్ర కుమార్ యాదవ్, జూనియర్ ఇంజినీర్ మహమ్మద్ షాహిద్ ఉన్నారు.
ఇక రామమందిరంకు వెళ్లే మార్గంలోని రహదారులపై 10 ప్రాంతాల్లో భారీ గుంతులు ఏర్పడ్డాయి. మరోవైపు ఈ ఏడాది జనవరి 22వ తేదీన అయోధ్యలోని బాల రాముడి ఆలయన్ని ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించారు. ఇక ఇటీవల కురిసిన భారీ వర్షాలకు నూతనంగా నిర్మించిన ఆలయంలో లీకేజీ ద్వారా వర్షపు నీరు వచ్చి చేరినట్లు అటు మీడియాలో ఇటు సోషల్ మీడియాలో సైతం వార్తలు వైరల్ అయ్యాయి. అయితే అటువంటిదేమీ లేదని ఆలయ అధికారులు ఇప్పటికే ఓ ప్రకటన చేశారు. మరోవైపు అయోధ్యలోని రామాలయంలో వర్షపు నీరు లీక్ కారణంగానే ఈ ఉన్నతాధికారులపై సస్పెన్షన్ వేటు పడిందనే ఓ ప్రచారం సైతం నడుస్తుంది.
Latest Telugu News And National News
Updated Date - Jun 29 , 2024 | 02:24 PM