ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Srinagar : ఇంటికి తీసుకెళ్లి లైంగికదాడి

ABN, Publish Date - Sep 11 , 2024 | 05:31 AM

తన పై అధికారి తన మీద లైంగిక దాడికి పాల్పడ్డాడని వాయుసేనకు చెందిన ఒక మహిళాధికారి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు జమ్ము కశ్మీర్‌లోని బుద్గాం పోలీస్‌ స్టేషన్‌లో నిందితుడిపై ఎఫ్‌ఐఆర్‌ నమోదైంది.

  • వాయుసేనలో తన సీనియర్‌పై ఓ మహిళ ఫిర్యాదు.. ఉన్నతాధికారులకు చెబితే తననే వేధించారని వెల్లడి

  • శ్రీనగర్‌లో ఘటన.. పోలీసులకు ఫిర్యాదు.. ఎఫ్‌ఐఆర్‌ నమోదు

  • నిందితుడు వింగ్‌ కమాండర్‌.. బాధితురాలు ఫ్లైయింగ్‌ ఆఫీసర్‌

శ్రీనగర్‌, సెప్టెంబరు 10: తన పై అధికారి తన మీద లైంగిక దాడికి పాల్పడ్డాడని వాయుసేనకు చెందిన ఒక మహిళాధికారి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు జమ్ము కశ్మీర్‌లోని బుద్గాం పోలీస్‌ స్టేషన్‌లో నిందితుడిపై ఎఫ్‌ఐఆర్‌ నమోదైంది. దర్యాప్తు జరుపుతున్న పోలీసులకు సహకరిస్తున్నామని వాయుసేన అధికార వర్గాలు మంగళవారం వెల్లడించాయి. నిందితుడు వాయుసేనలో వింగ్‌ కమాండర్‌ కాగా, బాధితురాలు ఫ్లైయింగ్‌ ఆఫీసర్‌.. ఇద్దరూ కశ్మీర్‌లోనే పని చేస్తున్నారు. గత ఏడాది డిసెంబరు 31వ తేదీన శ్రీనగర్‌లోని ఆఫీసర్స్‌ మెస్‌లో కొత్త సంవత్సరం వేడుకల సందర్భంగా.. తన సీనియర్‌ అయిన వింగ్‌ కమాండర్‌.. న్యూ ఇయర్‌ బహుమతులు తమ ఇంట్లో ఉన్నాయని చెప్పి అక్కడికి తనను తీసుకెళ్లాడని బాధితురాలు తన ఫిర్యాదులో పేర్కొన్నారు.

అక్కడ తాను అడ్డుకుంటున్నా వినిపించుకోకుండా తనపై లైంగికదాడికి పాల్పడ్డాడని, ముఖరతి జరిపాడని తెలిపారు. కొన్ని రోజులపాటు తీవ్రమైన మానసిక వేదనకు గురైన అనంతరం ఇద్దరు మహిళా అధికారుల సహకారంతో తమ విభాగంలో ఫిర్యాదు చేశానని, ఒక కర్నల్‌ స్థాయి అధికారి దీనిపై దర్యాప్తునకు నియమితులయ్యారని పేర్కొన్నారు. దర్యాప్తు సమయంలో నిందితుడిని తన పక్కన కూర్చోబెట్టి తనను ప్రశ్నించేవారని, ఈ విధంగా జరిగిన దర్యాప్తు ఏమీ తేల్చకుండానే ముగిసిందన్నారు. దీంతో తాను అంతర్గత కమిటీకి ఫిర్యాదు చేశానని, ఆ కమిటీ కూడా నిందితుడికి సహకరిస్తున్నట్లుగానే వ్యవహరించింది తప్ప బాధితురాలినైన తనకు అండగా నిలవలేదని వాపోయారు.


పలుమార్లు తాను ఒత్తిడి చేస్తేగానీ తనకు వైద్యపరీక్షలు నిర్వహించలేదన్నారు. ‘ఈ దారుణ పరిస్థితుల ఉపశమనం కోసం సెలవు అడిగితే ఇచ్చేవారు కాదు. కనీసం వేరే విభాగానికిగానీ, వేరే ప్రాంతానికిగానీ బదిలీ చేయమన్న విజ్ఞప్తిని కూడా పట్టించుకోలేదు. దీంతో, నాపై లైంగికదాడికి పాల్పడిన వ్యక్తితో కలిసి, అతడికి సహకరిస్తున్న అధికారులతో కలిసి రోజూ పని చేయాల్సి వచ్చింది’ అని సదరు మహిళా అధికారి తన ఫిర్యాదులో వివరించారు. తనను సామాజికంగా వెలివేసినట్లుగా వ్యవహరించారని, తనతో ఎవరైనా మాట్లాడితే వారిని ఉన్నతాధికారులు వేధించేవారని, దీంతో తనను ఆత్మహత్య ఆలోచనలు చుట్టుముట్టాయని, దైనందిన కార్యకలాపాలన కూడా చేయలేని పరిస్థితికి చేరుకున్నానని బాధితురాలు వెల్లడించారు.

Updated Date - Sep 11 , 2024 | 05:31 AM

Advertising
Advertising