India-China: నాలుగేళ్ల తర్వాత తొలిసారి.. చైనా సరిహద్దులో..
ABN, Publish Date - Nov 05 , 2024 | 07:47 AM
దాదాపు నాలుగు సంవత్సరాలకు పైగా ప్రతిష్ఠంభన తర్వాత తొలిసారి భారత్ - చైనా సరిహద్దులో పెట్రోలింగ్ ప్రారంభమైంది. భారత్, చైనా బలగాలను ఉపయోగించుకోవడంతో వాస్తవ నియంత్రణ రేఖ (LAC) వెంబడి కీలకమైన పాయింట్లలో ఒకటైన డెప్సాంగ్ వద్ద భారత సైన్యం సోమవారం తిరిగి పెట్రోలింగ్ ప్రారంభించింది.
దాదాపు నాలుగు సంవత్సరాలకు పైగా ప్రతిష్ఠంభన తర్వాత తొలిసారి భారత్ - చైనా సరిహద్దులో పెట్రోలింగ్ ప్రారంభమైంది. భారత్, చైనా బలగాలను ఉపయోగించుకోవడంతో వాస్తవ నియంత్రణ రేఖ (LAC) వెంబడి కీలకమైన పాయింట్లలో ఒకటైన డెప్సాంగ్ వద్ద భారత సైన్యం సోమవారం తిరిగి పెట్రోలింగ్ ప్రారంభించింది. డెప్సాంగ్‌లోని పెట్రోలింగ్ పాయింట్ 10 (PP10) వద్ద భారత బలగాలు గస్తీ నిర్వహించాయని, వివాదాస్పద సరిహద్దు వెంబడి శాంతి, స్థిరత్వాన్ని కొనసాగించే దిశగా మరో ముఖ్యమైన ముందడుగు పడిందని భారత ఆర్మీ వర్గాలు తెలిపాయి. తూర్పు లడఖ్‌లోని డెమ్‌చోక్, డెప్సాంగ్ ఈ రెండు పాయింట్‌ల వద్ద భారత్, చైనా సైన్యాలు ఉపసంహరణ ప్రక్రియను పూర్తి చేసుకున్న తర్వాత కీలకమైన ఈ పరిణామం చోటుచేసుకుందని పేర్కొన్నాయి.
డెప్సాంగ్ మైదానాలో మొత్తం 5 కీలకమైన పెట్రోలింగ్ పాయింట్లు ఉన్నాయి. పీపీ10, పీపీ11, పీపీ11ఏ, పీపీ12, పీపీ13 ఉన్నాయి. ఈ పాయింట్లు అన్నీ భారత సరిహద్దు భద్రతా ప్రయోజనాలకు ఎంతో ముఖ్యమైనవి. గాల్వాన్ లోయ ఘర్షణ తర్వాత కొన్నేళ్లుగా ఈ ప్రాంతాలలో భారత్ సరిగా పెట్రోలింగ్ నిర్వహించలేకపోతోంది. చాలా పరిమితంగా కొనసాగుతోంది. ఇప్పుడు పీపీ10 పాయింట్ల వద్ద పెట్రోలింగ్ పునఃప్రారంభం కావడం సానుకూల పరిణామంగా ఉంది. ‘‘ఈ పాయింట్ వద్ద పెట్రోలింగ్‌ను పునఃప్రారంభించడం ఎల్ఏసీ వెంబడి శాంతి, స్థిరత్వాన్ని కొనసాగించడానికి మరో సానుకూల అడుగు పడినట్టు అయింది’’ అని రక్షణశాఖకు చెందిన అధికారి ఒకరు అభిప్రాయపడ్డారు.
అక్టోబర్ 21న కీలక ఒప్పందం
కాగా ఎల్ఏసీ వెంబడి బలగాల ఉపసంహరణ కోసం భారత్-చైనా మధ్య అక్టోబర్ 21న కీలకమైన అంగీకార ఒప్పందం కుదిరిన విషయం తెలిసిందే. సుధీర్ఘ చర్చల అనంరతం సైనిక, దౌత్య స్థాయిలలో ఈ అంగీకారం కుదిరింది. ఆ మరుసటి రోజే చైనా ప్రభుత్వం కూడా ఒప్పందాన్ని ఖరారు చేస్తూ ప్రకటన విడుదల చేసింది. దీంతో ఇరు దేశాలకు చెందిన సైన్యాలు గాల్వాన్ లోయ ఘర్షణకు ముందు ఉన్న స్థానాలకు తిరిగి వెళ్లిపోయాయి. ప్రతిష్ఠంభన సమయంలో ఏర్పాటు చేసిన గుడారాలు, తాత్కాలిక సైనిక నిర్మాణాలను భారత్, చైనా బలగాలు కూల్చివేశాయి. దీపావళి రోజున సరిహద్దు వెంబడి పలు పాయింట్ల వద్ద భారత్, చైనా సైనికులు పరస్పరం స్వీట్లు కూడా పంచుకున్నారు.
ఇవి కూడా చదవండి
విమానాల్లో ప్రయాణిస్తుంటారా.. కీలక మార్గదర్శకాలు జారీ చేసిన కేంద్రం
అమెరికాలో ఇవాళే అధ్యక్ష ఎన్నికలు.. ఓటర్ల సంఖ్య ఎంతో తెలుసా
ఇవాళ విరాట్ కోహ్లీ బర్త్‌డే.. ఎన్నేళ్లు నిండాయో తెలుసా
రోహిత్ శర్మను ఉద్దేశించి సునీల్ గవాస్కర్ సంచలన వ్యాఖ్యలు
For more Sports News and Telugu News
Updated Date - Nov 05 , 2024 | 11:06 AM