Sukhbir Singh Badal: సుఖ్‌బీర్‌పై కాల్పులు జరిపిందెవరంటే
ABN, Publish Date - Dec 04 , 2024 | 02:46 PM
శిరోమణి అకాలీ దళ్ అధికారంలో ఉన్న సమయంలో మతపరమైన తప్పదాలకు పాల్పడినందున సుఖ్‌బీర్ సింగ్ మంగళవారం నుంచి 'సేవాదార్'గా శిక్ష అనుభవిస్తున్నారు. సుఖ్‌బీర్ తప్పిదాలకు స్వర్ణదేవాలయంలో పాత్రలు, బూట్లు శుభ్రం చేయాలని అఖల్ తఖ్త్ ఆయనకు శిక్ష విధించింది.
అమృత్‌సర్: పంజాబ్ మాజీ ఉప ముఖ్యమంత్రి, అకాలీదళ్ పార్టీ నేత సుఖ్‌బీర్ సింగ్ బాదల్ (Sukhabir Singh Badal)పై బుధవారంనాడు హత్యాయత్నం జరిగింది. స్వర్ణ దేవాలయం ప్రవేశ ద్వారం వద్ద సుఖ్‌బీర్ చక్రాల కుర్చీపై కూర్చుని 'సేవాదార్'గా ఉండగా సమీపానికి వచ్చిన ఒక వృద్ధుడు జేబులోంచి తుపాకీ తీసి కాల్పులు జరిపాడు. ఇది గమనించిన సుఖ్‌బీర్ వ్యక్తిగత సిబ్బంది ఆ వ్యక్తిని పక్కకు తీసుకువెళ్లి పోలీసులకు అప్పగించారు. ఈ ఘటనలో సుఖ్‌బీర్‌కు ఎలాంటి హాని జరగలేదు. కాల్పులు జరిపిన వ్యక్తిని మాజీ మిలిటెంట్ నారాయణ్ సింగ్ చౌరాగా గుర్తించారు.
Amritsar Golden Temple Incident: గోల్డెన్ టెంపుల్ దగ్గర సుఖ్‌బీర్ సింగ్ బాదల్‌పై కాల్పులు..
కీలక ఖలిస్థాన్ నేత చౌరా
మాజీ మిలిటెంట్ అయిన నారాయణ్ సింగ్ చౌరా గతంలో వేర్పాటువాద మిలిటెంట్ సంస్థ ఖలిస్థాన్ లిబరేషన్ ఆర్మీని స్థాపించి, అకల్ ఫెడరేషన్‌తో అసోసియేషన్ సాగించారని చెబుతారు. ఖలిస్థాన్ ఉద్యమంలో కీలక నేతగా ఆయన వ్యవహరించారు. బబ్బర్ ఖల్సా ఇంటర్నేషనల్ అనే ఉగ్రముఠాలో పనిచేశారు. గురుదాస్‌పూర్ జిల్లాకు చెందిన చౌరా పంజాబ్‌లో పలు ఉగ్రదాడులకు పాల్పడ్డారనే ఆరోపణలు ఉన్నాయి. 1984లో పాకిస్థాన్ వెళ్లి పంజాబ్‌లోకి అక్రమంగా ఆయుధాలు, పేలుడు పదార్ధాలను తేవడం, వాటి రవాణాలో కీలక పాత్ర వహించినట్టు తెలుస్తోంది. ఆ తర్వాత పంజాబ్ వచ్చిన ఆయనను 2013లో అరెస్టు చేసె పెద్దఎత్తున ఆయుధాలు, పేలుడు పదార్ధాలను స్వాధీనం చేసుకున్నారు.
శిక్షాకాలంలో సుఖ్‌బీర్ సింగ్
శిరోమణి అకాలీ దళ్ అధికారంలో ఉన్న సమయంలో మతపరమైన తప్పదాలకు పాల్పడినందున సుఖ్‌బీర్ సింగ్ మంగళవారం నుంచి 'సేవాదార్'గా శిక్ష అనుభవిస్తున్నారు. సుఖ్‌బీర్ తప్పిదాలకు స్వర్ణదేవాలయంలో పాత్రలు, బూట్లు శుభ్రం చేయాలని అఖల్ తఖ్త్ ఆయనకు శిక్ష విధించింది. చేసిన తప్పులను అంగీకరిస్తూ ఒక బోర్డును మెడలో వేసుకుని, చేతిలో ఈటెతో ఆయన సేవాదార్‌గా పనిచేస్తున్నారు. ఈ క్రమంలోనే ఆయనపై కాల్పులు జరగడం సంచలనమైంది.
ఇవి కూడా చదవండి
Uttarakhand: ఆ గంగాజలం స్నానానికి తప్ప తాగడానికి పనికిరాదు: పీసీబీ
Rahul Gandhi: ఘాజీపూర్ సరిహద్దుకు చేరుకున్న రాహుల్, ప్రియాంక గాంధీ
మరిన్ని జాతీయ వార్తలు కోసం క్లిక్ చేయండి.
Updated Date - Dec 04 , 2024 | 02:46 PM