ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

అమెరికాలో స్మగ్లర్‌ సునీల్‌ యాదవ్‌ కాల్చివేత

ABN, Publish Date - Dec 25 , 2024 | 04:32 AM

కరుడుగట్టిన మాదక ద్రవ్యాల స్మగ్లర్‌ సునీల్‌ యాదవ్‌ అమెరికాలో హత్యకు గురయ్యాడు. గ్యాంగ్‌స్టర్‌ లారెన్స్‌ బిష్ణోయ్‌కి అనుచరుడిగా ఉన్న రోహిత్‌ గొదారా అతడిపై తుపాకీతో కాల్పులు జరిపాడు. ప్రతీకారంతోనే ఈ హత్య చేసినట్టు తెలిపాడు.

న్యూఢిల్లీ, డిసెంబరు 24: కరుడుగట్టిన మాదక ద్రవ్యాల స్మగ్లర్‌ సునీల్‌ యాదవ్‌ అమెరికాలో హత్యకు గురయ్యాడు. గ్యాంగ్‌స్టర్‌ లారెన్స్‌ బిష్ణోయ్‌కి అనుచరుడిగా ఉన్న రోహిత్‌ గొదారా అతడిపై తుపాకీతో కాల్పులు జరిపాడు. ప్రతీకారంతోనే ఈ హత్య చేసినట్టు తెలిపాడు. కాలిఫోర్నియో రాష్ట్రంలోని స్టాక్‌టన్‌ సిటీలో ఈ సంఘటన చోటుచేసుకుంది. పంజాబ్‌లోని ఫజిల్కా జిల్లాకు చెందిన సునీల్‌పై స్మగ్లింగ్‌కు సంబంధించి రాజస్థాన్‌లో పలు కేసులు నమోదయ్యాయి. రెండేళ్ల క్రితం అతడు అమెరికా వెళ్లాడు. లారెస్స్‌ ముఠాలో పనిచేసినప్పుడు సునీల్‌, రోహిత్‌ మధ్య మంచి స్నేహం ఉండేది. అయితే పంజాబ్‌ పోలీసులతో కలిసి తనకు సోదరుడులాంటి అంకిత్‌ భాదును ఎన్‌కౌంటర్‌ చేయించాడన్న కారణంతో సునీల్‌పై రోహిత్‌ కక్ష పెట్టుకున్నాడు.

Updated Date - Dec 25 , 2024 | 04:32 AM