Supreme Court: బెయిల్ వచ్చిన వెంటనే మంత్రి పదవి ఇవ్వడం భయంకరమైన తప్పు
ABN, Publish Date - Dec 21 , 2024 | 03:56 AM
బెయిల్ లభించిన మరుక్షణమే డీఎంకే నాయకుడు వి.సెంథిల్ బాలాజీని మళ్లీ తమిళనాడు మంత్రిగా తీసుకోవడం భయంకరమైన తప్పు అని శుక్రవారం సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది.
తమిళనాడు మంత్రి బాలాజీ కేసులో సుప్రీం వ్యాఖ్య
న్యూఢిల్లీ, డిసెంబరు 20: బెయిల్ లభించిన మరుక్షణమే డీఎంకే నాయకుడు వి.సెంథిల్ బాలాజీని మళ్లీ తమిళనాడు మంత్రిగా తీసుకోవడం భయంకరమైన తప్పు అని శుక్రవారం సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. రవాణా మంత్రిగా పనిచేసినప్పుడు డబ్బులు తీసుకొని ఉద్యోగాలు ఇచ్చారన్న ఆరోపణలతో ఆయనపై మనీలాండరింగ్ కేసు నమోదయింది. ఇందులో సాక్షులుగా ప్రభుత్వ ఉద్యోగులే ఉన్నారని, అందువల్ల మంత్రి పదవి ఇవ్వడం ప్రశ్నించదగ్గ అంశమని ధర్మాసనం తెలిపింది. ఆయనపై ఉన్న పెండింగ్ కేసుల వివరాలను, విచారించాల్సిన సాక్షుల సమాచారాన్ని సమర్పించాలని తమిళనాడు ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఆయన బెయిల్‌ను రద్దు చేయాలని కోరుతూ ఈడీ దాఖలు చేసిన పిటిషన్‌పై ఈ ఆదేశాలు ఇచ్చింది. ఈడీ తరఫున సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా వాదనలు వినిపిస్తూ సెంథిల్ బాలాజీ జైల్లో ఉన్నప్పుడు కూడా శాఖలేని మంత్రిగా కొనసాగారని చెప్పారు. ఆయన ప్రభావం చూపే వ్యక్తి అని, ఈ కారణంగా విచారణలో జాప్యం జరుగుతోందని తెలిపారు.
Updated Date - Dec 21 , 2024 | 03:56 AM