ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Supreme Court : బిల్కిస్‌ కేసు ముద్దాయిల పిటిషన్‌ తిరస్కరణ

ABN, Publish Date - Jul 20 , 2024 | 04:46 AM

గుజరాత్‌ అల్లర్ల సందర్భంగా బిల్కిస్‌ బానోపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డ ఇద్దరు ముద్దాయిలు దాఖలు చేసిన పిటిషన్‌ను శుక్రవారం సుప్రీంకోర్టు తిరస్కరించింది. తమను మళ్లీ గోధ్రా జైలుకు పంపడాన్ని వారు సవాలు చేశారు.

న్యూఢిల్లీ, జూలై 19: గుజరాత్‌ అల్లర్ల సందర్భంగా బిల్కిస్‌ బానోపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డ ఇద్దరు ముద్దాయిలు దాఖలు చేసిన పిటిషన్‌ను శుక్రవారం సుప్రీంకోర్టు తిరస్కరించింది. తమను మళ్లీ గోధ్రా జైలుకు పంపడాన్ని వారు సవాలు చేశారు. ఈ కేసులో 11 మందికి యావజ్జీవ కారాగార శిక్ష పడగా గుజరాత్‌ ప్రభుత్వం దాన్ని మాఫీ చేసింది.

దీనిపై బాధితురాలు సుప్రీంకోర్టును ఆశ్రయించగా గుజరాత్‌ ప్రభుత్వ ఉత్తర్వులను రద్దు చేస్తూ జనవరి 8న ద్విసభ్య ధర్మాసనం తీర్పు చెప్పింది. ఈ తీర్పును సవాలు చేస్తూ రాధేశ్యాం భగవాన్‌దా్‌స షా, రాజుభాయ్‌ బాబూలాల్‌ సోనీ అనే ఇద్దరు ముద్దాయిలు పిటిషన్‌ వేశారు.

పరిశీలించిన జస్టిస్‌ సంజీవ్‌ ఖన్నా, జస్టిస్‌ సంజయ్‌ కుమార్‌ల ధర్మాసనం.. ఒక ద్విసభ్య ధర్మాసనం ఇచ్చిన తీర్పును మరో ద్విసభ్య ధర్మాసనం ఎలా రద్దు చేస్తుందని ప్రశ్నిస్తూ వారి పిటిషన్‌ను తిరస్కరించింది. దాంతో వారు మధ్యంతర బెయిల్‌ కావాలంటూ మరో పిటిషన్‌ వేశారు.

Updated Date - Jul 20 , 2024 | 04:46 AM

Advertising
Advertising
<