ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Supreme Court: నెలసరి సెలవులపై సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు.. వాటిని కోల్పోతారన్న ధర్మాసనం

ABN, Publish Date - Jul 08 , 2024 | 03:06 PM

మహిళా ఉద్యోగులకు నెలసరి సెలవులు(Menstrual Leave) కోరుతూ దాఖలైన ప్రజా ప్రయోజన వ్యాజ్యాన్ని (PIL) సుప్రీం కోర్టు కొట్టివేసింది. ఈ సమస్యపై పాలసీని రూపొందించడానికి రాష్ట్ర ప్రభుత్వాలతో చర్చించాలని కేంద్రానికి సూచించింది.

ఢిల్లీ: మహిళా ఉద్యోగులకు నెలసరి సెలవులు(Menstrual Leave) కోరుతూ దాఖలైన ప్రజా ప్రయోజన వ్యాజ్యాన్ని (PIL) సుప్రీం కోర్టు కొట్టివేసింది. ఈ సమస్యపై పాలసీని రూపొందించడానికి రాష్ట్ర ప్రభుత్వాలతో చర్చించాలని కేంద్రానికి సూచించింది. రుతుక్రమ సెలవులు మంజూరు చేయడం వల్ల మహిళలు ఉద్యోగ అవకాశాలు కోల్పోయే అవకాశం ఉందని కోర్టు అభిప్రాయపడింది.

వారి శ్రామిక శక్తి కూడా తగ్గిపోతుందని పేర్కొంది. "కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి తీసుకోవాల్సిన విధాన నిర్ణయం ఇది. మహిళల కోసం తెచ్చిన విధానాలు అనుకోకుండా వారికి ప్రతికూలంగా మారడం మాకు ఇష్టం లేదు. పిటిషనర్ తమ అభ్యర్థనతో మహిళా, శిశు అభివృద్ధి మంత్రిత్వ శాఖను సంప్రదించాలి. విధానపర నిర్ణయాల్లో మేం జోక్యం చేసుకోలేం" ధర్మాసనం పేర్కొంది.


పిటిషన్ ఏంటంటే..

దేశంలో బిహార్ 1992 నుంచే అక్కడి ప్రభుత్వ మహిళ ఉద్యోగులకు రెండు రోజుల నెలసరి సెలవును ఇస్తోంది. ఈ మధ్యే కేరళ ప్రభుత్వం కూడా పాఠశాల, కళాశాల విద్యార్థినులకు మూడు రోజుల సెలవులు ప్రకటించింది. ఈ విధానాన్ని దేశమంతా అమలు చేసేలా ఆదేశాలు జారీ చేయాలని కొందరు సుప్రీం కోర్టులో పిటిషన్ వేశారు. ఈ పిటిషన్‌పై సుప్రీం కోర్టు చీఫ్ జస్టిస్‌ డీవై చంద్రచూడ్‌ నేతృత్వంలోని ధర్మాసనం సోమవారం విచారణ జరిపి తీర్పు వెలువరించింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి ఫ్రేమ్ వర్క్ రూపొందించి నిర్ణయం తీసుకోవాలని సూచించింది.

For Latest News and National News click here

Updated Date - Jul 08 , 2024 | 03:06 PM

Advertising
Advertising
<