ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Cyber Crime: హలో నేను సీజేఐని రూ.500 పంపగలరా

ABN, Publish Date - Aug 28 , 2024 | 07:10 AM

సోషల్ మీడియాను(Social Media) ఆసరాగా చేసుకుని సైబర్ నేరగాళ్లు(Cyber Criminals) రెచ్చిపోతున్నారు. ఇన్నాళ్లు ముఖ్యమంత్రులు, మంత్రుల పేర్లతో తమను తాము పరిచయం చేసుకున్న వారు ఇప్పుడు ఏకంగా దేశ అత్యున్నత న్యాయస్థానం ప్రధాన న్యాయమూర్తిని టార్గెట్ చేశారు.

ఢిల్లీ: సోషల్ మీడియాను(Social Media) ఆసరాగా చేసుకుని సైబర్ నేరగాళ్లు(Cyber Criminals) రెచ్చిపోతున్నారు. ఇన్నాళ్లు ముఖ్యమంత్రులు, మంత్రుల పేర్లతో తమను తాము పరిచయం చేసుకున్న వారు ఇప్పుడు ఏకంగా దేశ అత్యున్నత న్యాయస్థానం ప్రధాన న్యాయమూర్తిని టార్గెట్ చేశారు. తమను తాము సీజేఐగా పరిచయం చేసుకుంటూ డబ్బులు అడగిన ఉదంతం చర్చనీయాంశం అవుతోంది. సుప్రీం కోర్టు చీఫ్ జస్టిస్ డీవై చంద్రచూడ్‌లా(Chief Justice DY Chandrachud) తనను తాను పరిచయం చేసుకుంటూ క్యాబ్ ఛార్జీల కోసం డబ్బులు అడిగిన ఓ సైబర్ నేరగాడిపై సుప్రీంకోర్టు మంగళవారం ఢిల్లీ సైబర్ క్రైమ్ విభాగానికి ఫిర్యాదు చేసింది. సోషల్ మీడియాలో వైరల్ అయిన మెసేజ్ స్క్రీన్‌షాట్‌ను సీజేఐ జస్టిస్ చంద్రచూడ్ నోట్ చూసి అవాక్కయ్యారు. సీజేఐ ఫిర్యాదును పరిగణనలోకి తీసుకున్న సుప్రీంకోర్టు భద్రతా విభాగం సైబర్ క్రైమ్ విభాగంలో ఎఫ్ఐఆర్‌(FIR)ను నమోదు చేసింది.


పోస్ట్‌లో ఏముందంటే..

వైరల్ అవుతున్న ఆ పోస్ట్‌లో, CJI పేరును దాని హ్యాండిల్‌గా, డిస్‌ప్లే ఇమేజ్‌కి ఆయన చిత్రాన్ని ఉపయోగించిన స్కామర్, కొలీజియం సమావేశానికి హాజరయ్యేందుకు క్యాబ్‌ కోసం రూ.500 కావాలని కైలాష్ మేఘ్‌వాల్‌ అనే ఎక్స్ వినియోగదారుడిని కోరాడు. ఆ డబ్బు సుప్రీంకోర్టుకు చేరిన తర్వాత తిరిగి ఇస్తానని హామీ ఇచ్చాడు. "హలో, నేను CJIని. ఇవాళ కొలీజియం అత్యవసర సమావేశాన్ని నిర్వహిస్తున్నాం. నేను కనాట్‌లో చిక్కుకున్నాను. మీరు క్యాబ్ కోసం 500 రూపాయలు నాకు పంపగలరా?" అని సైబర్ నేరగాడు తన చాట్‌లో రాశాడు.


మార్చిలో మరోటి..

ఈ ఏడాది మార్చిలో జరిగిన మరో సంఘటనలో ఢిల్లీ పోలీసు క్రైమ్ బ్రాంచ్ ఇన్‌స్పెక్టర్‌గా నటించి, విలాసవంతమైన కార్లు, ఖరీదైన సెల్‌ఫోన్‌లను విక్రయిస్తామనే సాకుతో ఓ సైబర్ నేరగాడు ఇద్దరి నుంచి రూ.4 లక్షలు దోచుకున్నాడు. తరువాత పోలీసులు అతన్ని అరెస్టు చేశారు. సైబర్ నేరాలపట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సూచిస్తున్నారు.

Updated Date - Aug 28 , 2024 | 07:10 AM

Advertising
Advertising
<