ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Ramdev Baba: మీరంత అమాయకులేం కాదు.. రాందేవ్‌పై సుప్రీం ఫైర్

ABN, Publish Date - Apr 16 , 2024 | 01:58 PM

పతంజలి ఆయుర్వేద సంస్థ వ్యవస్థాపకులు రాందేవ్‌ బాబా, ఆ సంస్థ ఎండీ ఆచార్య బాలకృష్ణపై సుప్రీంకోర్టు తీవ్ర స్థాయిలో ఫైర్ అయ్యింది. గతంలో న్యాయస్థానం ఏం ఉత్తర్వులిచ్చిందో కూడా తెలుసుకోలేనంత అమాయకులు కాదంటూ ఫైర్ అయ్యింది. ఈ వ్యవహారంలో తప్పును అంగీకరిస్తూ వారం రోజుల్లోగా బహిరంగ క్షమాపణ చెప్పాలని రాందేవ్ బాబాతో పాటు బాలకృష్ణను సుప్రీంకోర్టు ఆదేశించింది.

ఢిల్లీ: పతంజలి ఆయుర్వేద సంస్థ వ్యవస్థాపకులు రాందేవ్‌ బాబా (Ramdev Baba), ఆ సంస్థ ఎండీ ఆచార్య బాలకృష్ణపై సుప్రీంకోర్టు (Supreme Court) తీవ్ర స్థాయిలో ఫైర్ అయ్యింది. గతంలో న్యాయస్థానం ఏం ఉత్తర్వులిచ్చిందో కూడా తెలుసుకోలేనంత అమాయకులు కాదంటూ ఫైర్ అయ్యింది. ఈ వ్యవహారంలో తప్పును అంగీకరిస్తూ వారం రోజుల్లోగా బహిరంగ క్షమాపణ చెప్పాలని రాందేవ్ బాబాతో పాటు బాలకృష్ణను సుప్రీంకోర్టు ఆదేశించింది. గత వారం విచారణ సందర్భంగా కోర్టు పతంజలి వ్యవస్థాపకులపై తీవ్ర స్థాయిలో ఫైర్ అయ్యింది.

TS News: స్నేహితులతో క్రికెట్‌ ఆడేందుకు వెళ్లిన బాలుడు.. అంతలోనే విషాదం!


పతంజలి ఆయుర్వేద సంస్థ తయారు చేసిన ఉత్పత్తులపై రాందేవ్ బాబా తప్పుడు వ్యాపార ప్రకటనలు ఇచ్చిన విషయం తెలిసిందే. దీనికి సంబంధించి కోర్టు ధిక్కరణ కేసులో సుప్రీంకోర్టు మంగళవారం విచారణ చేపట్టింది. ఈ విచారణకు రాందేవ్ బాబా, బాలకృష్ణలు హాజరయ్యారు. తప్పుడు ప్రకటనలు ఇవ్వడం తప్పేనని.. భవిష్యత్తులో అలా జరగకుండా చూసుకుంటామని కోర్టుకు తెలిపారు. సుప్రీంకోర్టు ప్రతిష్టను దిగజార్చడం తన ఉద్దేశం కాదని రాందేవ్ అన్నారు. అయితే రాందేవ్ బాబా, బాలకృష్ణలు ఇచ్చిన వివరణపై ధర్మాసనం సంతృప్తి చెందలేదు. గత ఉత్తర్వుల్లో తామేం చెప్పామో తెలుసుకోలేనంత అమాయకులు మీరు కాదని.. తమ ఉత్పత్తులు వివిధ రకాల వ్యాధులను నయం చేస్తామంటూ తప్పుడు ప్రకటనలు ఇవ్వకూడదని మీకు తెలియకపోవడం బాధ్యతారాహిత్యమేనని సుప్రీంకోర్టు మండిపడింది.

Bangalore: దుమారం రేపిన మాజీ సీఎం కుమారస్వామి వ్యాఖ్యలు..


అల్లోపతిని తగ్గించి చూపడంపై ఆగ్రహం వ్యక్తం చేసింది. అయితే వారి క్షమాపణలను మాత్రం పరిశీలిస్తామని సుప్రీంకోర్టు తెలిపింది. దీంతో అయిపోదని.. వారం రోజుల్లోగా దీనిపై బహిరంగ క్షమాపణలు చెప్పాలని.. దానికి సంబంధించిన ప్రకటన ఇవ్వాలంటూ సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. కోర్టు విచారణను ఏప్రిల్ 23వ తేదీకి వాయిదా వేసింది. నిజానికి తమ ఉత్పత్తులు వివిధ రకాల వ్యాదులను నయం చేస్తాయంటూ అసత్య ప్రకటనలు ఇవ్వొద్దంటూ గతేడాది నవంబర్‌లోనే పతంజలి సంస్థను సుప్రీంకోర్టు మందలించింది. దీన్ని ఉల్లంఘిస్తే తీవ్ర పరిణామాలుంటాయని హెచ్చరించింది. అయినా కూడా రాందేవ్ బాబా ఆ ఆదేశాలను పట్టించుకోలేదు. దీంతో సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేస్తూ నోటీసులు జారీ చేసింది. ఈ క్రమంలోనే తాజాగా విచారణ నిర్వహించింది.

ఇవి కూడా చదవండి..

Telangana ACB: తెలంగాణలో ఏసీబీ దూకుడు.. 100 రోజుల్లో ఏకంగా...

మిస్టర్‌ కుమారస్వామి.. నువ్వు అక్కడ గెలవలేవు.. అసెంబ్లీకి రా చర్చిద్దాం

మరిన్ని తెలంగాణ వార్తల కోసం..

Updated Date - Apr 16 , 2024 | 02:20 PM

Advertising
Advertising