ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Supreme Court: మంత్రిగా సెంథిల్‌ బాలాజీ ఎలా కొనసాగుతున్నారు...

ABN, Publish Date - Dec 14 , 2024 | 11:01 AM

సెంథిల్‌ బాలాజీ(Senthil Balaji) మంత్రిగా ఎలా కొనసాగుతున్నారంటూ సుప్రీంకోర్టు(Supreme Court) మళ్లీ నిలదీసింది. చట్టవ్యతిరేక నగదు బదిలీ కేసులో ఈడీ అరెస్ట్‌ చేయగా, సెంథిల్‌ బాలాజి 461 రోజులు జైలులో ఉండి, బెయిలుపై విడుదలయ్యారు.

- మళ్లీ ప్రశ్నించిన సుప్రీంకోర్టు

చెన్నై: సెంథిల్‌ బాలాజీ(Senthil Balaji) మంత్రిగా ఎలా కొనసాగుతున్నారంటూ సుప్రీంకోర్టు(Supreme Court) మళ్లీ నిలదీసింది. చట్టవ్యతిరేక నగదు బదిలీ కేసులో ఈడీ అరెస్ట్‌ చేయగా, సెంథిల్‌ బాలాజి 461 రోజులు జైలులో ఉండి, బెయిలుపై విడుదలయ్యారు. అనంతరం మరుసటిరోజే ఆయన మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన విషయం తెలిసిందే. మంత్రిగా ఆయన బాధ్యతలు చేపట్టడాన్ని వ్యతిరేకిస్తూ నగరానికి చెందిన విద్యాకుమార్‌ సుప్రీం కోర్టులో పిటిషన్‌ వేశారు.

ఈ వార్తను కూడా చదవండి: Chennai: వర్షం ఆగినా.. తగ్గని వరదనీరు


మంత్రి పదవిలో లేరంటూ కారణం చూపించి, బెయిలు పొందిన ఆయన, మరుసటిరోజే మంత్రిగా బాధ్యతలు చేపట్టారని, దిగువ కోర్టులో కేసు విచారణ జరుగుతున్న నేపథ్యంలో కేసు ప్రభావితం చేసే అవకాశముందని పిటిషన్‌లో పేర్కొన్నారు. దీనిని పరిగణనలోకి తీసుకొని ఆయన బెయిలు రద్దు చేయాలని పిటిషన్‌లో కోరారు. ఈ కేసును ఇటీవల విచారించిన సుప్రీంకోర్టు.. సెంథిల్‌ బాలాజీ(Supreme Court) బెయిలు పొందిన మరుసటిరోజే మంత్రి అవడాన్ని తప్పుబట్టింది.


ఈ నేపథ్యంలో, ఈ కేసు మరోమారు శుక్రవారం విచారణకు రాగా.. సుప్రీంకోర్టు మరోమారు సెంథిల్‌ బాలాజీ వ్యవహారాన్ని తప్పుబట్టింది. ఈ వ్యవహారంపై తగిన వివరణ ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని, సెంథిల్‌ బాలాజీని ఆదేశించింది. ఈ కేసులో ఈడీ తన వాదనలు రాతపూర్వకంగా సమర్పించేందుకు అనుమతించింది. తదుపరి విచారణను ఈ నెల 18వ తేదీకి వాయిదా వేసింది.


ఈవార్తను కూడా చదవండి: Nelakondapalli : కిరాయికి దిగి కిరాతకానికి ఒడిగట్టారు

ఈవార్తను కూడా చదవండి: High Court: మోహన్‌బాబుకు హైకోర్టులో ఎదురుదెబ్బ

ఈవార్తను కూడా చదవండి: కుల గణన సర్వేలో ఎస్సీ, ఎస్టీ, బీసీ సంఘాలు భాగస్వాములు కావాలి

ఈవార్తను కూడా చదవండి: K. Kavitha: ప్రజలను అవమానించేలా తెలంగాణ తల్లి విగ్రహంపై జీవో

Read Latest Telangana News and National News

Updated Date - Dec 14 , 2024 | 11:01 AM