Ram Mandir: అయోధ్య కార్యక్రమం ప్రత్యక్ష ప్రసారం నిషేధంపై తమిళనాడుకు సుప్రీంకోర్టు నోటీస్...స్పందించిన ప్రభుత్వం
ABN, Publish Date - Jan 22 , 2024 | 12:50 PM
అయోధ్య రామమందిర్ ప్రతిష్ఠాపన వేడుక సందర్భంగా ప్రత్యక్ష ప్రసారం చేయడంపై ఎలాంటి మౌఖిక సూచనల ఆధారంగా కాకుండా చట్ట ప్రకారం నడుచుకోవాలని తమిళనాడు అధికారులను సుప్రీంకోర్టు సోమవారం ఆదేశించింది. ఈ అంశంపై తమిళనాడు ప్రభుత్వం స్పందించి క్లారిటీ ఇచ్చింది.
అయోధ్య(Ayodhya) రామమందిర్ ప్రతిష్ఠాపన వేడుక సందర్భంగా ప్రత్యక్ష ప్రసారం చేయడంపై ఎలాంటి మౌఖిక సూచనల ఆధారంగా కాకుండా చట్ట ప్రకారం నడుచుకోవాలని తమిళనాడు(TamilNadu) అధికారులను సుప్రీంకోర్టు సోమవారం ఆదేశించింది. అయోధ్యలో జరిగే పవిత్రోత్సవాలను తమిళనాడులోని దేవాలయాలలో ప్రత్యక్ష ప్రసారం చేయడాన్ని నిషేధిస్తూ జనవరి 20 నాటి మౌఖిక ఉత్తర్వును రద్దు చేయాలని కోరుతూ దాఖలైన పిటిషన్‌ను సుప్రీంకోర్టు విచారించింది.
మరిన్ని తాజా వార్తల కోసం క్లిక్ చేయండి: Ram Mandir: అయోధ్య ప్రత్యేక ఆహ్వానితులకు ప్రసాదం బాక్స్..అందులో ఏమున్నాయంటే
దీనిపై స్పందించిన తమిళనాడు ప్రభుత్వం ఆలయాల్లో పూజలపై ఎలాంటి ఆంక్షలు లేవని తెలిపింది. అయోధ్యలో జరిగే పవిత్రోత్సవాలను ప్రత్యక్ష ప్రసారం చేయడంపై నిషేధం విధించలేదని చెప్పారు. అది కేవలం రాజకీయ ప్రేరేపితమని తమిళనాడు తరపు సీనియర్ న్యాయవాది అమిత్ ఆనంద్ తివారీ అన్నారు. ఈ క్రమంలో జనవరి 29లోగా ఈ పిటిషన్‌పై తమిళనాడు ప్రభుత్వం స్పందనను కూడా ధర్మాసనం కోరింది. డీఎంకె ఆధ్వర్యంలోని తమిళనాడు ప్రభుత్వం ప్రాణ ప్రతిష్ట ప్రత్యక్ష ప్రసారాన్ని నిషేధించిందని వినోజ్ అనే వ్యక్తి ఈ పిటిషన్‌ను దాఖలు చేశారు.
ఈ సందర్భంగా అన్ని రకాల ప్రార్థనలు, అన్నదానం, భజనలను కూడా ప్రభుత్వం నిషేధించిందని ఆరోపణలు వస్తున్నాయి. అయితే శ్రీరాముడికి పూజలు నిర్వహించడంపై హెచ్‌ఆర్ అండ్ సీఈ శాఖ ఎలాంటి నిషేధం విధించలేదని తమిళనాడు హిందూ మత, ధర్మాదాయ శాఖ మంత్రి పీకే శేఖర్‌బాబు ఆదివారం తెలిపారు. అలాగే అన్నదానం, ప్రసాదం పంపిణీకి ఎలాంటి అడ్డంకి లేదన్నారు.
Updated Date - Jan 22 , 2024 | 12:50 PM