ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Supreme Court : అదానీ గ్రూప్‌పై తీర్పును సమీక్షించం

ABN, Publish Date - Jul 16 , 2024 | 03:46 AM

అదానీ గ్రూప్‌ స్టాక్‌ మార్కెట్‌లో అవకతవకలకు పాల్పడిందంటూ వచ్చిన ఆరోపణలపై సెబీ చేస్తున్న విచారణను ప్రత్యేక విచారణ బృందం (సిట్‌) లేదా సీబీఐకి అప్పగించాలంటూ ...

  • పిల్‌ను కొట్టివేసిన సుప్రీం కోర్టు

న్యూఢిల్లీ, జూలై 15: అదానీ గ్రూప్‌ స్టాక్‌ మార్కెట్‌లో అవకతవకలకు పాల్పడిందంటూ వచ్చిన ఆరోపణలపై సెబీ చేస్తున్న విచారణను ప్రత్యేక విచారణ బృందం (సిట్‌) లేదా సీబీఐకి అప్పగించాలంటూ దాఖలైన పిటిషన్‌ను కొట్టివేస్తూ జనవరి 3న ఇచ్చిన తీర్పును సమీక్షించేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది.

అనామిక మిశ్రా తదితరులు దాఖలు చేసిన పిల్‌ను సోమవారం ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ డీవై చంద్రచూడ్‌, న్యాయమూర్తులు జస్టిస్‌ జేబీ పార్ధీవాలా, జస్టిస్‌ మనోజ్‌ మిశ్రాలతో కూడిన ధర్మాసనం కొట్టివేసింది. పిల్‌ను పరిశీలించిన తర్వాత ఎలాంటి సమీక్షకు అవకాశం లేదని స్పష్టం చేసింది. కాగా, జనవరి 3న ఇచ్చిన తీర్పులో.. అదానీ గ్రూప్‌పై వచ్చిన ఆరోపణల మీద సెబీ సమగ్ర విచారణ జరుపుతున్నదని, ఆ విచారణ నమ్మకం కలిగిస్తున్నదని సుప్రీం పేర్కొంది.

Updated Date - Jul 16 , 2024 | 03:47 AM

Advertising
Advertising
<