ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

AAP Swati Maliwal: బిభవ్‌ 8 సార్లు చెంపపై కొట్టాడు

ABN, Publish Date - May 18 , 2024 | 05:49 AM

ఆమ్‌ ఆద్మీ పార్టీ చీఫ్‌, ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌ వ్యక్తిగత సహాయకుడు బిభవ్‌కుమార్‌ 7-8 సార్లు తనను చెంపపై బలంగా కొట్టాడని ఆప్‌ రాజ్యసభ సభ్యురాలు స్వాతి మాలివాల్‌ ఆరోపించారు. అకారణంగా తనపై దాడి చేశారని తెలిపారు. ‘

ఛాతి, కడుపులో బలంగా తన్నాడు.. బొక్కలు విరగొడతానన్నాడు

ఫిర్యాదులో స్వాతి మాలివాల్‌ ఆరోపణలు

న్యూఢిల్లీ, మే 17: ఆమ్‌ ఆద్మీ పార్టీ చీఫ్‌, ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌ వ్యక్తిగత సహాయకుడు బిభవ్‌కుమార్‌ 7-8 సార్లు తనను చెంపపై బలంగా కొట్టాడని ఆప్‌ రాజ్యసభ సభ్యురాలు స్వాతి మాలివాల్‌ ఆరోపించారు. అకారణంగా తనపై దాడి చేశారని తెలిపారు. ‘‘సీఎం కేజ్రీవాల్‌ను కలిసేందుకు ఆయన ఇంటికి వెళ్లి కూర్చున్న నా దగ్గరకొచ్చిన బిభవ్‌.. ఒక్కసారిగా దాడికి దిగాడు. 7-8 సార్లు చెంపపై కొట్టాడు. ఛాతి, కడుపుపై కాలితో తన్నాడు. ఏం జరుగుతుందో అర్థం కాక నేను షాక్‌కు గురయ్యా. సాయం కోసం అరిచా. కానీ, ఎవ్వరూ రాలేదు.

పరిగెడుతుంటే నా చొక్కా పట్టుకొని వెనక్కి లాగాడు. తల వెళ్లి టేబుల్‌కి తగిలింది. సున్నితమైన శరీర భాగాలపై పలుమార్లు కొట్టాడు. ఛాతీ, పొట్టపైనా కొట్టాడు. నెలసరి సమయమని, వదిలిపెట్టమని వేడుకున్నా వినిపించుకోలేదు’’ అని ఢిల్లీ మహిళా కమిషన్‌ మాజీ చీఫ్‌ కూడా అయిన స్వాతి మాలివాల్‌ పోలీసులకు చేసిన ఫిర్యాదులో వివరించారు. ‘‘నీ ఇష్టం వచ్చింది చేసుకో. మాకేం కాదు. నీ బొక్కలు విరగ్గొట్టి, పాతిపెడతాం. ఆ ప్రాంతాన్ని ఎవ్వరూ కనిపెట్టలేరు’’ అని బిభవ్‌కుమార్‌ బెదిరించినట్లు ఫిర్యాదులో ఆరోపించారు. ఆమె ఫిర్యాదు తీసుకున్న పోలీసులు.. బిభవ్‌పై కేసు నమోదు చేశారు. ఈ ఘటన ఈ నెల 13న జరగ్గా.. ఆప్‌ కూడా ధ్రువీకరించింది.

  • స్వాతి ముఖంపై గాయాలు..

దాడి ఆరోపణల నేపథ్యంలో ఆప్‌ ఎంపీ స్వాతికి శుక్రవారం వైద్య పరీక్షలు నిర్వహించారు. ఆమె ముఖంపై అంతర్గత గాయాలైనట్లు ఈ పరీక్షలో తేలిందని వైద్య వర్గాలు వెల్లడించాయి. కాగా, దాడి ఘటనపై తొలిసారి స్పందించిన స్వాతి.. అది చాలా దురదృష్టకరమన్నారు. ఈ విషయాన్ని రాజకీయం చేయొద్దని విజ్ఞప్తి చేశారు.


ఇదిలా ఉండగా, స్వాతిపై దాడి ఘటనలో జాతీయ మహిళా కమిషన్‌ (ఎన్‌సీడబ్ల్యూ) నోటీసులు ఇచ్చినప్పటికీ బిభవ్‌ కుమార్‌ విచారణకు హాజరవలేదు. దీంతో శుక్రవారం ఎన్‌సీడబ్ల్యూ అధికారులు మరోసారి ఆయన ఇంటికి వెళ్లారు. అయితే ఆయన భార్య నోటీసులు తీసుకునేందుకు నిరాకరించడంతో గేటుకు అతికించి వచ్చారు. శనివారం బిభవ్‌ విచారణకు రాకపోతే తానే స్వయంగా వెళతానని ఎన్‌సీడబ్ల్యూ చీఫ్‌ రేఖా శర్మ తెలిపారు.

ఈ ఘటన పట్ల కేజ్రీవాల్‌ మౌనంగా ఉండడంపై స్పందిస్తూ.. ఆయన మహిళకు అన్యాయం జరిగినా పట్టించుకోరన్న విషయం అర్థమైందన్నారు. కాగా, గతంలో తనకూ ఇలాంటి అనుభవాలు ఎదురైనట్లు ఆప్‌ మాజీ నాయకురాలు షాజియా సంచలన ఆరోపణలు చేశారు.

  • అంతా బీజేపీ కుట్ర: ఆప్‌

స్వాతి బీజేపీతో చేతులు కలిపిందని ఆప్‌ ఆరోపించింది. కేజ్రీవాల్‌ను లక్ష్యంగా చేసుకున్న బీజేపీయే ఈ కుట్రలు చేస్తోందని ఆప్‌ నేత అతిషి ఆరోపించారు. కేజ్రీవాల్‌కు ప్రజల్లో వస్తున్న ఆదరణను చూసి ఓర్వలేకే స్వాతితో ఈ డ్రామాలు ఆడిస్తోందని ధ్వజమెత్తారు. కేజ్రీవాల్‌ ఇంట్లో స్వాతి మాలివాల్‌ సెక్యూరిటీ గార్డులతో ఘర్షణ పడుతున్నట్లుగా ఉన్న వీడియో విడుదల చేశారు. ఆమె దుస్తులేమీ చినిగిపోలేదని, తలకూ ఎలాంటి గాయం కాలేదని అతిషి తెలిపారు.

Updated Date - May 18 , 2024 | 05:49 AM

Advertising
Advertising