ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

June : అందరి కళ్లూ జూన్‌ పైనే!

ABN, Publish Date - May 30 , 2024 | 05:57 AM

సాధారణంగా ప్రతి నెల క్యాలెండర్‌లో నెల మారుతుంది..! ఈసారీ అంతే.. మే ముగిసి జూన్‌ వస్తోంది..! కానీ, ప్రస్తుతం ప్రజలందరూ ఇంకా ఎప్పుడు వస్తుంది..? అని కళ్లు కాయలు కాచేలా ఎదురుచూస్తున్నారు..! పిల్లల స్కూల్‌, బస్‌ ఫీజులను తలచుకుని, పెరగనున్న ఇంటి అద్దె లను

అత్యంత ఆసక్తిగా ప్రజల ఎదురుచూపులు..

1న పూర్తి కానున్న తుది దశ ఎన్నికల పోలింగ్‌

ఎగ్జిట్‌పోల్స్‌ వెల్లడికి తొలగనున్న అడ్డంకి

2 నుంచి టీ20 ప్రపంచకప్

4న లోక్‌సభ ఎన్నికల ఫలితాలు

9న పాకిస్థాన్‌తో టీమిండియా మ్యాచ్‌

సాధారణంగా ప్రతి నెల క్యాలెండర్‌లో నెల మారుతుంది..! ఈసారీ అంతే.. మే ముగిసి జూన్‌ వస్తోంది..! కానీ, ప్రస్తుతం ప్రజలందరూ ఇంకా ఎప్పుడు వస్తుంది..? అని కళ్లు కాయలు కాచేలా ఎదురుచూస్తున్నారు..! పిల్లల స్కూల్‌, బస్‌ ఫీజులను తలచుకుని, పెరగనున్న ఇంటి అద్దె లను చూసుకుని అమ్మో ‘‘జూన్‌’’ అని భయపడే సగటు జీవి కూడా ఈసారి అత్యంత ఆసక్తితో ఉన్నాడు. ఉర్రూతలూగించిన ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ (ఐపీఎల్‌) అప్పుడే అయిపోయిందా? అని నిట్టూరుస్తున్న క్రికెట్‌ అభిమాని మరో ధనాధన్‌ సమరం కోసం వచ్చే నెల పైనే చూపు నిలిపాడు. అబ్బా ఇంకెన్నాళ్లీ ఎండలు? అంటూ చెమటలు కక్కుతున్నవారు ఉక్కపోత నుంచి ఉపశమనం కోసం.. తొలకరి చినుకులు పడే జూన్‌ ను రావమ్మా చల్లని తల్లి అని ఆహ్వానిస్తున్నారు. ఇక తీవ్ర ఉత్కంఠతో ఉన్న రాజకీయ నాయకులు ఇంకా తెలవారదేమి.. జూన్‌ రాదేమి? అని కలవరిస్తున్నారు. అసలు ఒకరేమిటి.. దేశవ్యాప్తంగా అన్ని వర్గాలు ఇలానే పలవరిస్తున్నాయి. దీనికి కారణం.. అత్యంత సుదీర్ఘంగా సాగిన సార్వత్రిక ఎన్నికల ఫలితాలు.. విశేష ఆదరణ ఉన్న టీ20 ప్రపంచకప్‌.. వాతావరణాన్ని ఆహ్లాదం చేసే రుతుపవనాల రాక.. ఇలా వరుసపెట్టి విశేషాలు ఉండడమే.

ఒకటో తేదీతో మొదలు..

స్వాతంత్య్రం వచ్చిన మొదట్లో ఎప్పుడో 70 ఏళ్ల కిందట.. నాలుగు నెలల పాటు సాగాయి సార్వత్రిక ఎన్నికలు. ఆ తర్వాత అత్యధికంగా ఈ సారి 44 రోజుల పాటు నిర్వహించారు. మార్చి 16న షెడ్యూల్‌ వెలువడింది. అప్పటినుంచి ఫలితాల వరకు చూస్తే మొత్తం 82 రోజుల పాటు ప్రక్రియ జరిగింది. ఇక ఏప్రిల్‌ 19న తొలి దశ పోలింగ్‌ జరిగింది. జూన్‌ 1తో చివరి, ఏడో విడత పోలింగ్‌ ముగియనుంది. అదే రోజు సాయంత్రం ఎగ్జిట్‌ పోల్స్‌ వెలువడనున్నాయి. దీంతో ఎన్నికల సమరంలో ఎవరు విజేతనో ఓ అంచనా ఏర్పడనుంది. కాగా, జూన్‌ 4న ఓట్ల లెక్కింపుతో ఉత్కంఠ పూర్తిగా వీడనుంది. కేంద్రంలో అధికారం ఎవరిదో తేలిపోనుంది. సార్వత్రిక ఎన్నికలతో పాటే అత్యంత కీలకమైన ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీకీ ఎన్నికలు జరిగాయి. ఒడిసా, సిక్కిం, అరుణాచల్‌ప్రదేశ్‌లో కొత్తగా పగ్గాలు చేపట్టేది ఎవరనేది కూడా జూన్‌ 4న స్పష్టమవుతుంది.

- సెంట్రల్‌ డెస్క్‌


రుతు పవనాలు వచ్చేస్తున్నాయి..

దేశవ్యాప్తంగా ప్రజలను పిండేస్తున్న ఎండలకు వీడ్కోలు పలుకుతూ రుతుపవనాలు వచ్చేది జూన్‌లోనే. రేపోమాపో కేరళను తాకుతాయని భారత వాతావరణ శాఖ ఇప్పటికే చెప్పింది. గతంలో కంటే ముందే వచ్చిన రుతు పవనాలు.. జూన్‌ 5 నాటికి ఏపీకి, 10 నాటికి తెలంగాణకు చేరతాయని పేర్కొంది. అధిక ఉష్ణోగ్రతలకు తోడు భరించలేనంత ఉక్కపోతతో సతమతం అవుతున్న ప్రజలకు ఊరట దక్కనుంది.

తెలంగాణ పట్టభద్రుల తీర్పు 5న మొదలు

తెలంగాణలో గత సోమవారం జరిగిన పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక ఓట్ల లెక్కింపు జూన్‌ 5న మొదలు కానుంది. పోలైన ప్రాధాన్యత ఓట్ల ప్రకారం.. జూన్‌ 6న విజేతను ప్రకటించనున్నారు.

మరో ధనాధన్‌కు సిద్ధం కండి

మొన్నటివరకు క్రికెట్‌ ప్రేమికులను ఉర్రూతలూగించింది ఐపీఎల్‌. రెండు నెలలకు పైగా సాగిన టోర్నీ అనంతరం ఒక్కసారిగా మ్యాచ్‌లు లేకపోవడంతో నిరాశగా ఉన్నారు. వారిని అలరించేందుకు వచ్చేస్తోంది టి20 ప్రపంచ కప్‌. ఈసారి టోర్నీ జరగబోతోంది అమెరికాలో కావడం మరో విశేషం. దీంతోపాటు కరీబియన్‌ దీవులు కూడా ఆతిథ్యం ఇస్తున్నాయి. జూన్‌ 1న బంగ్లాదేశ్‌తో భారత జట్టు ప్రాక్టీస్‌ మ్యాచ్‌ ఆడుతుంది. 2వ తేదీన ఆతిథ్య అమెరికా - కెనడా మధ్య మ్యాచ్‌తో టోర్నీ మొదలుకానుంది. ఈ రెండు జట్లలో 16 మంది వరకు భారత సంతతి క్రికెటర్లు ఉండడం గమనార్హం. అమెరికా జట్టుకు భారతీయుడైన మోనాక్‌ పటేల్‌ కెప్టెన్‌. తెలుగు మూలాలున్న శ్రేయాస్‌ మొవ్వా కెనడా కీపర్‌. మెగా టోర్నీకే హైలైట్‌ అనదగ్గ చిరకాల ప్రత్యర్థులు భారత్‌-పాకిస్థాన్‌ మ్యాచ్‌ జూన్‌ 9న న్యూయార్క్‌లో జరగనుంది. టికెట్‌ ధర రూ.లక్ష నుంచి రూ.45 లక్షల వరకు ఉంది. దీనికిముందే జూన్‌ 5న చిన్న జట్టైన ఐర్లాండ్‌తో మన జట్టు తలపడనుంది.

Updated Date - May 30 , 2024 | 05:58 AM

Advertising
Advertising