Viral News: టేబుల్ మీద కాలేసి, ఊగుతూ..
ABN, Publish Date - Jul 29 , 2024 | 01:02 PM
టీచర్ మద్యం తాగిన ఘటన మధ్యప్రదేశ్ షాబ్దుల్ జిల్లాలో జరిగింది. షార్గాఢ్ గ్రామంలో గల బహ్రియల్ తోలా ప్రాథమిక పాఠశాలలో ఉదయ్ భాను సింగ్ అనే టీచర్ పనిచేస్తున్నాడు. ఎప్పటిలాగే శనివారం కూడా పాఠశాలకు వచ్చాడు. కాసేపు అయ్యిందో లేదో ఊగుతూ కనిపించాడు.
భోపాల్: సమాజంలో గురువులకు ఉన్నత స్థానం ఉంది. తల్లిదండ్రుల తర్వాత ప్లేస్ వారిదే. విద్యార్థులకు విద్యాబుద్దులు చెప్పి, ప్రయోజకులను చేస్తారని గౌరవిస్తారు. కొందరు టీచర్లు (Teacher) మాత్రం తమ స్థాయిని దిగజార్చుకుంటున్నారు. బడిలో పాఠాలు చెప్పకుండా టైమ్ పాస్ చేస్తున్నారు. మరికొందరు పవిత్రమైన పాఠశాలకు మద్యం తాగి వస్తున్నారు. మధ్యప్రదేశ్‌లో ఓ టీచర్ ఏకంగా క్లాస్ రూమ్‌లో మందేసి కనిపించారు. ఆ వీడియో తీసి సోషల్ మీడియాలో షేర్ చేయడంతో తెగ వైరల్ అవుతోంది.
ఇదీ విషయం
టీచర్ మద్యం తాగిన ఘటన షాబ్దుల్ జిల్లాలో జరిగింది. షార్గాఢ్ గ్రామంలో గల బహ్రియల్ తోలా ప్రాథమిక పాఠశాలలో ఉదయ్ భాను సింగ్ అనే టీచర్ పనిచేస్తున్నాడు. ఎప్పటిలాగే శనివారం కూడా పాఠశాలకు వచ్చాడు. కాసేపు అయ్యిందో లేదో ఊగుతూ కనిపించాడు. ఏంటి అని క్షుణ్ణంగా పరిశీలిస్తే మద్యం సేవించాడని తెలిసింది. అతను కుర్చీ మీద కూర్చొని, ఓ కాలును రాజసంగా టేబుల్ మీద పెట్టాడు. మొహం మీద చేయి పెట్టుకొని, ఊగుతూ కనిపించాడు. మద్యం మత్తులో పాఠశాల గదిలో పడుకొని ఉన్నాడు. అతని చుట్టూ కొందరు విద్యార్థులు ఉన్నారు. టీచర్ నుంచి వాసన రావడంతో మరికొందరు విద్యార్థులు ముక్కు పట్టుకొని కనిపించారు.
విచారణ.. చర్యలు
టీచర్ మద్యం సేవించిన ఘటనకు సంబంధించిన వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేయడంతో తెగ వైరల్ అయ్యింది. ఆదివారం నాడు పై అధికారుల దృష్టికి వచ్చింది. ఘటన గురించి షార్దుల్ జిల్లా కలెక్టర్ తరుణ్ భట్నాగర్‌ను మీడియా ప్రతినిధులు ఆరా తీశారు. ఆ వీడియో ఆదివారం తమ దృష్టికి వచ్చిందని కలెక్టర్ వివరించారు. ఘటనపై విచారణకు ఆదేశించామని పేర్కొన్నారు. ఆ అంశంపై విచారణ జరుగుతుందని, విద్యాశాఖ ఇచ్చే నివేదిక ఆధారంగా సదరు టీచర్‌పై చర్యలు తీసుకుంటామని కలెక్టర్ తరుణ్ భట్నాగర్ పేర్కొన్నారు.
Updated Date - Jul 29 , 2024 | 01:02 PM