ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Crisil: ధర పెరుగుదలతో మాడిపోతున్న ‘తాళింపు’

ABN, Publish Date - Jul 05 , 2024 | 07:40 PM

మే మాసం వెళ్లింది. జూన్ మాసం వచ్చింది. ఇంకా క్లారిటీగా చెప్పాలంటే.. వేసవి వెళ్లింది. భానుడి భగభగలు తగ్గియి. వర్షాకాలం వచ్చింది. దీంతో నాలుగు చినుకులతో చల్లదనాన్ని తీసుకు వస్తుందనుకుంటే.. ధరల వేడిని తీసుకు వచ్చింది. దీంతో పప్పు, ఉప్పులే కాదు.. కాయగూరలు, బాయిలర్ చికెన్ ధరలు అమాంతంగా పెరిగాయి.

మే మాసం వెళ్లింది. జూన్ మాసం వచ్చింది. ఇంకా క్లారిటీగా చెప్పాలంటే.. వేసవి వెళ్లింది. భానుడి భగభగలు తగ్గియి. వర్షాకాలం వచ్చింది. దీంతో నాలుగు చినుకులతో చల్లదనాన్ని తీసుకు వస్తుందనుకుంటే.. ధరల వేడిని తీసుకు వచ్చింది. దీంతో పప్పు, ఉప్పులే కాదు.. కూరగాయలు, బాయిలర్ చికెన్ ధరలు అమాంతంగా పెరిగాయి. ఈ ధరల పెరుగుదలతో ప్రతీ ఇంట.. పొయ్యి మీద తాళింపు మాడిపోయే పరిస్థితి దాపురించింది. దీంతో ఇంటిలో వంట కోసం నిధుల కేటాయిస్తున్న బడ్జెట్‌లో మరికొంత అదనంగా జోడించాల్సి వస్తుంది.

Also Read: AP Ministers: జగన్ వైఖరిపై మంత్రులు మండిపాటు


Also Read: Viral Video: రీల్స్ కోసం.. ‘పిల్ల చేష్టలు’

ఈ ఒక్క జూన్ మాసంలోనే ఒక్కో ప్లేట్‌ ధర రూ. 29.4 పెరిగింది. అది కూడా ఒక్క ప్లేట్ శాఖహార భోజనానికి ఇంత పెరిగింది. ఇది జూన్ మాసానికి ముందు మే మాసంతో పోలిస్తే.. 6 శాతం మేర ధర పెరిగింది. ఈ మేరకు క్రిసెల్ శుక్రవారం వెల్లడించింది. ఇక మాంసాహర భోజనమైతే.. ప్లేట్‌ రూ.58 మేర పెరిగింది. అంటే అంతకుముందు మాసంతో పోలిస్తే.. 4 శాతం అదనమని స్పష్టం చేసింది.

Also Read: Lalu Prasad Yadav: త్వరలో మళ్లీ లోక్‌సభ ఎన్నికలు.. సిద్దంకండి


Also Read: Amit Shah: ఆ తర్వాతే.. అసెంబ్లీ ఎన్నికలు..!

ఏడాదికేడాదికి శాఖహార భోజనం ధర 10 శాతం మేర పెరుగుతుంటే.. మాంసాహార భోజనం మాత్రం 4 శాతం మేర తగ్గుతుందని పేర్కొంది. ఒక సాధారణ శాఖాహార భోజనంలో రోటీ, కూరగాయలు (ఉల్లిపాయ, టొమాటో, బంగాళదుంప), అన్నం, పప్పు, పెరుగు, సలాడ్ ఉంటాయి. ఇక మాంసహారంలో పప్పు స్థానంలో బ్రాయిలర్ చికెన్ ఉంటుంది. దీంతో నిత్యవసర వస్తువుల ధరల్లో హెచ్చు తగ్గులకు లోనవుతున్నప్పటికీ, ఈ ధరలను లెక్కించేందుకు ఉపయోగించే పదార్థాల నిష్పత్తి మాత్రం స్థిరంగా ఉంటుందంది. కూరగాయల ధరలు..చాలా వేగంగా పెరుగుతున్నాయని క్రిసెల్ స్పష్టం చేసింది.

Also Read: LokSabha: ఎంపీలుగా ప్రమాణం చేసిన.. రషీద్, అమృత్ పాల్


Also Read: Bihar: 11 మంది ఇంజినీర్లపై సస్పెన్షన్ వేటు

బంగాళదుంప, ఉల్లిపాయ, టమాటో దరలు 9 శాతం, 15 శాతం, 29 శాతం మేర పెరిగాయని తెలిపింది. ఇక కూరగాయల ధరలు ఇలా పెరగడానికి చాలా కారణాలున్నాయి. అయితే పంట సాగు విస్తీర్ణం బాగా తగ్గడం, అలాగే వైరస్‌లు సోకడం, కాలం కానీ కాలంలో భారీ వర్షాలు కారణంగా పంటలు దెబ్బతినడంతో.. కూరగాయల ధరల పెరుగుదలకు ఆస్కారం ఏర్పడిందని క్రిసెల్ వివరించింది.

Read Latest Telangana News and National News

Read Latest AP News and Telugu News

Updated Date - Jul 05 , 2024 | 07:59 PM

Advertising
Advertising