పార్లమెంట్ భద్రత సీఐఎ్‌సఎఫ్ చేతికి
ABN, Publish Date - May 20 , 2024 | 04:49 AM
ఢిల్లీలోని పార్లమెంటు భద్రత బాధ్యతలను సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (సీఐఎ్‌సఎఫ్) చేపట్టనుంది. మొత్తం 3,317 మంది సీఐఎ్‌సఎఫ్ సిబ్బంది సోమవారం నుంచి పార్లమెంటు ఆవరణలో ఉగ్రవాద వ్యతిరేక...,..
న్యూఢిల్లీ, మే 19: ఢిల్లీలోని పార్లమెంటు భద్రత బాధ్యతలను సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (సీఐఎ్‌సఎఫ్) చేపట్టనుంది. మొత్తం 3,317 మంది సీఐఎ్‌సఎఫ్ సిబ్బంది సోమవారం నుంచి పార్లమెంటు ఆవరణలో ఉగ్రవాద వ్యతిరేక, విధ్వంస నిరోధక భద్రత విధులు నిర్వహిస్తారని అధికార వర్గాలు వెల్లడించాయి. ఇప్పటి వరకూ సీఆర్‌పీఎ్‌ఫకు చెందిన 1,400 మందికి పైగా సిబ్బంది పార్లమెంటు భద్రతను పర్యవేక్షించారు.
సీఆర్‌పీఎ్‌ఫకు (CISF) చెందిన పార్లమెంట్ డ్యూటీ గ్రూప్(పీడీజీ) గత శుక్రవారం తన కమాండోలను ఉపసంహరించుకుందని, డీఐజీ ర్యాంకు స్థాయి అధికారి పార్లమెంట్ కాంప్లెక్స్‌లోని అన్ని సెక్యూరిటీ పాయింట్లను సీఐఎ్‌సఎ్‌ఫకు అప్పగించారని అధికారులు తెలిపారు. గతేడాది డిసెంబరు 13న పార్లమెంట్‌లో భద్రతా ఉల్లంఘన ఘటన తర్వాత పాత, కొత్త పార్లమెంట్ భవనాలు, అనుబంధ నిర్మాణాల భద్రతా బాధ్యతలను సీఐఎ్‌సఎ్‌ఫకు అప్పగించాలని ప్రభుత్వం నిర్ణయించింది.
Updated Date - May 20 , 2024 | 04:51 AM