Congress: కాంగ్రెస్ ఎమ్మెల్యే కన్నుమూత.. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస
ABN, Publish Date - Feb 25 , 2024 | 04:26 PM
కర్ణాటక కాంగ్రెస్ ఎమ్మెల్యే రాజా వెంకటప్ప నాయక్ గుండెపోటుతో కన్నుమూశారు. యాదగిరి జిల్లా షోరాపూర్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందిన ఆయనకు ఈ రోజు ఉదయం గుండెపోటు వచ్చింది.
కర్ణాటక కాంగ్రెస్ ఎమ్మెల్యే రాజా వెంకటప్ప నాయక్ గుండెపోటుతో కన్నుమూశారు. యాదగిరి జిల్లా షోరాపూర్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందిన ఆయనకు ఈ రోజు ఉదయం గుండెపోటు వచ్చింది. వెంటనే అప్రమత్తమైన కుటుంబసభ్యులు బెంగళూరులోని మణిపాల్ ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. లో మరణించారు. ఎమ్మెల్యేగానే కాకుండా గిడ్డంగుల కార్పొరేషన్ అధ్యక్షుడిగా ఆయన బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. కాంగ్రెస్ నుంచే రాజకీయ ప్రస్థానం ప్రారంభించిన రాజా వెంకటప్ప నాలుగుసార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు.
15 రోజుల క్రితం రాజా వెంకటప్ప నాయక్ కు కిడ్నీలో రాయి వచ్చింది. దీంతో వైద్యులు సర్జరీ చేశారు. ఈ క్రమంలోనే ఈ రోజు ఆయనకు ఆకస్మాత్తుగా గుండెపోటు వచ్చింది. దీంతో చికిత్స కోసం ఆయనను బెంగళూరులోని మణిపాల్ ఆస్పత్రిలో చేర్పించారు. పరిస్థితి చేయిదాటి పోవడంతో కన్నుమూశారు. ఎమ్మెల్యే మృతి విషయం తెలుసుకున్న ముఖ్యమంత్రి సిద్ధా రామయ్య సంతాపం తెలిపారు. ఆయన మరణం వ్యక్తిగతంగానే కాకుండా రాజకీయాలకు తీరని లోటు అని నివాళులు అర్పించారు. వెంకటప్ప నాయక్ ఆత్మకు శాంతి కలగాలని, ఆయన కుటుంబసభ్యులకు ఈ బాధను తట్టుకునే సామర్థ్యం కలిగించాలని ప్రార్థిస్తూ ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు.
1994 లో కాంగ్రెస్ నుంచి పోటీ చేసి తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఆ తర్వాత 1999, 2013, 2023లో కాంగ్రెస్ నుంచి గెలిచి శాసనసభలో అడుగుపెట్టారు. ఆయన తండ్రి రాజా కుమార్ నాయక్ సైతం రెండుసార్లు (1957, 1978లో) కాంగ్రెస్ నుంచి ఎమ్మెల్యేగా ఉన్నారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి.
Updated Date - Feb 25 , 2024 | 04:26 PM