ఆ థంబ్‌నెయిల్స్‌పై ఇక నిషేధం
ABN, Publish Date - Dec 23 , 2024 | 03:32 AM
మన దేశంలో కోట్లాది మందికి యూట్యూబ్ ఆదాయ మార్గంగా మారింది.
యూట్యూబ్‌లో అలాంటి వీడియోల తొలగింపు
న్యూఢిల్లీ, డిసెంబరు 22: మన దేశంలో కోట్లాది మందికి యూట్యూబ్ ఆదాయ మార్గంగా మారింది. అలాంటి యూట్యూట్‌లో కొందరు కంటెంట్ క్రియేటర్లు వారి వార్తలు, వీడియోలకు వీక్షణలు(వ్యూస్), వినియోగదారులు (సబ్‌స్ర్కైబర్ల) కోసం ‘క్లిక్ బెయిట్ థంబ్‌నెయిల్స్’ లాంటి అడ్డదారులు తొక్కుతున్నారు. అంటే వీడియోలో లేని అంశాన్ని దాని థంబ్‌నెయిల్‌లో రాయడం/శీర్షిక పెట్టడం లేదా థంబ్‌నెయిల్‌లో తప్పుడు ఫొటోలు పెట్టడం చేస్తున్నారు. ఇలా తప్పుదోవ పట్టించే థంబ్‌నెయిల్స్‌పై చాలా మంది వినియోగదారులు యూట్యూబ్ సంస్థకు ఫిర్యాదు చేశారు. దీన్ని తీవ్రంగా పరిగణించిన యూట్యూబ్ యజమాన్యం.. కఠిన చర్యలు చేపట్టింది. వీక్షకులను తప్పుదోవ పట్టించేలా ఉండే ఇలాంటి థంబ్‌నెయిల్స్‌పై నిషేధం విధించింది. వీటిని నిర్ధారించేందుకు కొన్ని నిబంధనలు పెట్టింది. ముఖ్యంగా బ్రేకింగ్ న్యూస్, ట్రెండింగ్ అంశాలకు సంబంధించిన వీడియోలపై దృష్టి సారించింది. ఈ విభాగాల్లో వీడియోలు పెట్టే కంటెంట్ క్రియేటర్లు లేదా చానెళ్లకు యూట్యూబ్ కొత్త విధానాన్ని అమలు చేయనుంది. తప్పుడు సమాచారం ఇచ్చే చానెళ్లకు తొలి హెచ్చరికగా వీడియోలు మాత్రమే తొలగిస్తారు. పదేపదే అలాంటి థంబ్‌నెయిల్స్ పెడితే జరిమానా విధిస్తారు. ఇలాంటి థంబ్‌నెయిల్స్‌ను గుర్తించేందుకు ‘క్రియేటివ్ ఆర్టిస్ట్స్ ఏజెన్సీ (సీఏఏ)’ సంస్థతో కలిసి పనిచేస్తున్నట్లు వెల్లడించింది.
Updated Date - Dec 23 , 2024 | 03:33 AM