ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

National : హెచ్‌ఐవీ టీకా.. ట్రయల్‌ సక్సెస్‌!

ABN, Publish Date - May 22 , 2024 | 04:08 AM

హెచ్‌ఐవీ.. హ్యూమన్‌ ఇమ్యూనో డెఫిషియన్సీ వైరస్‌! 1980ల నుంచి మానవాళికి సవాలుగా మారిన ఈ మహమ్మారి పని పట్టే టీకాను తయారు చేశామని డ్యూక్‌ హ్యూమన్‌ వ్యాక్సిన్‌ ఇన్‌స్టిట్యూట్‌ (అమెరికా) శాస్త్రజ్ఞులు ప్రకటించారు.

ప్రయోగాత్మక వ్యాక్సిన్‌తో యాంటీబాడీలు

డ్యూక్‌ యూనివర్సిటీ శాస్త్రజ్ఞుల ఘనత

మరిన్ని పరిశోధనలు చేయాలని వెల్లడి

40 ఏళ్లుగా సవాల్‌గా మారిన మహమ్మారి

హెచ్‌ఐవీ టీకా.. ట్రయల్‌ సక్సెస్‌!

ప్రయోగాత్మక వ్యాక్సిన్‌తో మనుషుల్లో యాంటీబాడీలు.. ‘డ్యూక్‌ హ్యూమన్‌

వ్యాక్సిన్‌’ శాస్త్రజ్ఞుల ఘనత

హెచ్‌ఐవీ.. హ్యూమన్‌ ఇమ్యూనో డెఫిషియన్సీ వైరస్‌! 1980ల నుంచి మానవాళికి సవాలుగా మారిన ఈ మహమ్మారి పని పట్టే టీకాను తయారు చేశామని డ్యూక్‌ హ్యూమన్‌ వ్యాక్సిన్‌ ఇన్‌స్టిట్యూట్‌ (అమెరికా) శాస్త్రజ్ఞులు ప్రకటించారు. తాము అభివృద్ధి చేసిన హెచ్‌ఐవీ టీకా.. ట్రయల్‌లో పాల్గొన్నవారిలో విజయవంతంగా సమర్థమైన యాంటీబాడీలు ఉత్పత్తి అయ్యేలా చేసిందని వెల్లడించారు. మూడేళ్ల క్రితం ప్రపంచాన్ని వణికించిన కరోనాకు కొన్ని నెలల వ్యవధిలోనే టీకాను తయారుచేయగలిగిన శాస్త్రజ్ఞులకు.. హెచ్‌ఐవీకి టీకా అభివృద్ధి చేయడానికి ఇంత కాలం ఎందుకు పట్టింది? అంటే.. దానికి కారణం ఆ వైర్‌సకున్న ఒక ప్రత్యేకత.

సాధారణంగా ఏదైనా వైరస్‌ మన శరీరంలోకి ప్రవేశించాక రోగనిరోధక శక్తి అప్రమత్తమై దాన్ని నిర్వీర్యం చేసే యాంటీబాడీలను రూపొందిస్తుంది. కానీ, హ్యూమన్‌ ఇమ్యూనో వైరస్‌.. పోలీసుల కన్నా వేగంగా పరిగెత్తే దొంగలాగా.. మన రోగనిరోధక వ్యవస్థ దానికి యాంటీబాడీలను తయారుచేసేలోపే ఉత్పరివర్తనం చెందుతూ (మ్యుటేషన్‌) తన రూపును మార్చేసుకుంటుంది. అయితే.. హెచ్‌ఐవీ బారిన పడినవారిలో కేవలం 10-15 శాతం మందిలో దాన్ని నిర్వీర్యం చేయగలిగే ‘బ్రాడ్‌లీ న్యూట్రలైజింగ్‌ యాంటీబాడీస్‌ (బ్నాబ్స్‌)’ ఉత్పత్తి అవుతాయి.


హెచ్‌ఐవీ(HIV) ఎన్ని రూపాలు మార్చుకున్నా వాటి పని పట్టే యాంటీబాడీలు ఇవి. హెచ్‌ఐవీ సోకనివారిలో కూడా టీకా ద్వారా యాంటీబాడీలను ఉత్పత్తి చేయడమే లక్ష్యంగా పరిశోధకులు 1985 నుంచి కృషి చేస్తున్నారు. ఈ టీకా తయారీలో భాగంగా వారు హెచ్‌ఐవీ పైభాగం(ఔటర్‌ కోట్‌/ఎన్వల్‌ప)లోని ‘మెంబ్రేన్‌ ప్రాక్సిమల్‌ ఎక్స్‌టర్నల్‌ రీజియన్‌’ను లక్ష్యంగా చేసుకున్నారు.

(HIV)హెచ్‌ఐవీ ఎన్నిసార్లు ఉత్పరివర్తనం చెందినా.. ఆ వైర్‌సలో అస్సలు తేడా రాదు. ఆ భాగాన్ని టార్గెట్‌ చేసి తాము రూపొందించిన ఈ వ్యాక్సిన్‌.. ప్రపంచవ్యాప్తంగా ఉన్న పలు స్ట్రెయిన్ల హ్యూమన్‌ ఇమ్యూనో వైర్‌సలను నిర్వీర్యం చేయగలదని వారు చెబుతున్నారు. హెచ్‌ఐవీలో అనేక ఉపజాతులు ఉన్నాయి. వాటిలో హెచ్‌ఐవీ-1 ప్రపంచమంతా విస్తరించగా.. హెచ్‌ఐవీ-2 రకం కేవలం పశ్చిమ ఆఫ్రికాలో మాత్రమే ఉంది. టీకా హెచ్‌ఐవీ-1లోని ఉపజాతులపై పనిచేస్తుందని రూపకర్తలు వెల్లడించారు. అయితే, దీనిపై మరిన్ని ప్రయోగాలు చేయాల్సి ఉందన్నారు.

  • ట్రయల్‌ ఇలా..

ఫేజ్‌ 1 క్లినికల్‌ ట్రయల్‌లో భాగంగా 2019లో 24 మందిని ఎంపిక చేసుకుని వారిలో నలుగురికి ప్లాసిబో (ఉత్తుత్తి మాత్రలు), మిగతావారికి టీకా నాలుగు డోసులు వేయాలని నిర్ణయించారు. కానీ, టీకా వేసుకున్నవారిలో మూడు డోసుల తర్వాత ఒకరికి అందులో ఉన్న ‘పాలీఇథిలీన్‌ గ్లైకాల్‌ కఆ తీవ్రమైన ఎలర్జీ రావడంతో ట్రయల్స్‌ను నిలిపివేశారు. 24 మందిలో ఐదుగురికి 4 డోసులూ వేయగా.. 15 మందికి 2 డోసులే వేశారు. 2 డోసుల టీకా వేయించుకున్నవారిలో న్యూట్రలైజింగ్‌ యాంటీబాడీస్‌ ఉత్పత్తి అయినట్టు పరిశోధకులు గుర్తించారు.

Updated Date - May 22 , 2024 | 04:08 AM

Advertising
Advertising