ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Delhi: ‘కొవిషీల్డ్‌’పై విచారణకు సుప్రీంకోర్టు అంగీకారం

ABN, Publish Date - May 07 , 2024 | 04:00 AM

కరోనా వ్యాక్సిన్‌ ‘కోవిషీల్డ్‌’ను వినియోగించడం ద్వారా కలిగిన సైడ్‌ ఎఫెక్డ్స్‌ విషయమై దాఖలైన పిటిషన్‌ను విచారించేందుకు సుప్రీం కోర్టు అంగీకరించింది.

న్యూఢిల్లీ, మే 6 (ఆంధ్రజ్యోతి): కరోనా వ్యాక్సిన్‌ ‘కోవిషీల్డ్‌’ను వినియోగించడం ద్వారా కలిగిన సైడ్‌ ఎఫెక్డ్స్‌ విషయమై దాఖలైన పిటిషన్‌ను విచారించేందుకు సుప్రీం కోర్టు అంగీకరించింది. అయితే దీనిని సత్వరమే చేపట్టాలన్న వినతిని మాత్రం తిరస్కరించింది. బ్రిటిష్‌ ఫార్మా దిగ్గజం ఆస్ర్టాజెనెకా, ఆక్స్‌ఫర్డ్‌ వర్సిటీ సంయుక్తంగా అభివృద్థి చేసిన కోవిడ్‌-19 వ్యాక్సిన్‌ను సీరమ్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఇండియాలో కోవిషీల్డ్‌ పేరుతో తయారు చేసి విక్రయించింది.


తమ వ్యాక్సిన్‌ తీసుకున్న వారిలో అరుదైన సందర్భాల్లో రక్తం గడ్డకట్టడం, ప్లేట్‌లెట్ల సంఖ్య పడిపోవడం జరుగుతుందని ఆస్ర్టాజెనెకా ఇటీవల అంగీకరించింది. ఈ నేపథ్యంలో భారత్‌లోనూ ఈ వ్యాక్సిన్‌ తీసుకున్న వారు కొంతమంది అకస్మాత్తుగా కుప్పకూలిపోవడం, గుండెపోటుతో మరణించిన సంఘటనలపై దర్యాప్తు చేయాలని కోరుతూ పిటిషన్‌ దాఖలయింది. కోవిషీల్డ్‌ ప్రభావంపై వైద్య నిపుణుల బృందాన్ని ఏర్పాటు చేయాలని కోరుతూ న్యాయవాది విశాల్‌ తివారీ ఈ నెల ఒకటో తేదీన పిటిషన్‌ దాఖలు చేశారు. మృతుల కుటుంబాలకు పరిహారం ఇప్పించాలన్నారు.

Updated Date - May 07 , 2024 | 04:00 AM

Advertising
Advertising