ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Minister Bhupender Yadav :దేశంలో 1,04,561 రకాల జంతుజాతులు

ABN, Publish Date - Jul 01 , 2024 | 05:41 AM

జువాలాజికల్‌ సర్వే ఆఫ్‌ ఇండియా స్థాపించి 109 ఏళ్లు పూర్తయిన సందర్భంగా దేశంలోని సమగ్ర జంతుజాలం పట్టికను రూపొందించినట్లు కేంద్ర పర్యావరణ మంత్రి భూపేందర్‌ యాదవ్‌ తెలిపారు.

  • భారతదేశ సమగ్ర జంతుజాలం పట్టిక విడుదల

  • ప్రపంచంలోనే తొలిసారన్న కేంద్ర పర్యావరణ మంత్రి

న్యూఢిల్లీ, జూన్‌ 30: జువాలాజికల్‌ సర్వే ఆఫ్‌ ఇండియా స్థాపించి 109 ఏళ్లు పూర్తయిన సందర్భంగా దేశంలోని సమగ్ర జంతుజాలం పట్టికను రూపొందించినట్లు కేంద్ర పర్యావరణ మంత్రి భూపేందర్‌ యాదవ్‌ తెలిపారు. వర్గీకరణ శాస్త్రవేత్తలకు, పరిశోధకులకు, విద్యావేత్తలకు ఎంతో ఉపయోగకరమైన ఈ పట్టికను రూపొందించడం ప్రపంచంలోనే తొలిసారి అని ఆయన చెప్పారు.

ఆదివారం కోల్‌కతాలో ‘భారతదేశ జంతుజాల చెక్‌లిస్టు పోర్టల్‌’ను ఆయన ప్రారంభించారు. అనంతరం మాట్లాడుతూ, దేశంలో మొత్తం 1లక్షా 4వేల 561 రకాల జంతుజాతులు ఉన్నట్లు గుర్తించామని ఆయన తెలిపారు. స్థానికంగా కనబడే జంతుజాలంతోపాటు, అంతరించిపోయే, షెడ్యూల్డ్‌ జాతుల పట్టికను ఈ జాబితాలో చేర్చినట్లు చెప్పారు. జీవవైవిధ్య పరిరక్షణలో భారతదేశం ముందంజలో ఉందని అన్నారు. ప్రధానిగా మూడోసారి బాధ్యతలు చేపట్టిన తర్వాత మోదీ ప్రారంభించిన ‘ఏక్‌ పేడ్‌ మా కే నామ్‌’ (అమ్మ పేరుతో ఒక మొక్క) కార్యక్రమంతో పాటు పులులు, చీతాల సంరక్షణకు తీసుకుంటున్న చర్యలు భారతదేశం జీవవైవిధ్య పరిరక్షణకు ఎంత చిత్తశుద్ధిగా వ్యవహరిస్తోందో తెలిపేందుకు ఉదాహరణలని భూపేందర్‌ యాదవ్‌ పేర్కొన్నారు.

Updated Date - Jul 01 , 2024 | 05:42 AM

Advertising
Advertising