ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

గల్ఫ్‌లో ఘనంగా వినాయక చవితి

ABN, Publish Date - Sep 09 , 2024 | 03:45 AM

విఘ్నాలు తొలగించాలంటూ గల్ఫ్‌ దేశాల్లోని వేలాది మంది తెలుగు ప్రవాసీయులు వినాయకుడిని పూజిస్తూ వినాయక చవితి ఉత్సవాలను ఘనంగా జరుపుకొంటున్నారు.

(ఆంధ్రజ్యోతి గల్ఫ్‌ ప్రతినిధి)

విఘ్నాలు తొలగించాలంటూ గల్ఫ్‌ దేశాల్లోని వేలాది మంది తెలుగు ప్రవాసీయులు వినాయకుడిని పూజిస్తూ వినాయక చవితి ఉత్సవాలను ఘనంగా జరుపుకొంటున్నారు. భారతీయులు నివాసముంటున్న దాదాపు అన్ని అపార్ట్‌మెంట్లలో గణపతికి పూజలు చేస్తున్నారు. దుబాయిలో గతంలో ఎన్నడూ లేనివిధంగా భారీ ఎత్తున వినాయక విగ్రహాల విక్రయాలు జరిగాయి. వినాయక విగ్రహాల కొనుగోలుకు ఈ స్థాయిలో రద్దీని తాను మొదటిసారిగా చూస్తున్నానని దుబాయిలో సుదీర్ఘకాలంగా నివాసముంటున్న తెలుగు ప్రవాసీ ప్రముఖుడు బాలుసాని వివేకానంద తెలిపారు.

శని, ఆదివారాలలో దుబాయిలోని రెండు దేవాలయాల్లోనూ గణపతి పూజలకు భారీగా భారతీయ ప్రవాసీలు హాజరయ్యారు. దుబాయి, మస్కట్‌, మనమాలలోని దేవాలయాలతో పాటు.. ఆజ్మాన్‌ మైత్రి ఫాంలో ప్రతిష్ఠించిన వినాయక విగ్రహాలను వేలాది మంది భక్తులు సందర్శించి పూజలు చేస్తున్నారు. సౌదీఅరేబియాలోని దమ్మాం, రియాధ్‌, జెద్ధా నగరాలతో పాటు.. తెలుగు ప్రవాసీ సంఘం సాటా ఆధ్వర్యంలో వినాయక ఉత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. దమ్మాంలో జరిగిన గణపతి ఉత్సవాల్లో లడ్డూ వేలం పాట నిర్వహించగా.. ఏపీలోని ఒంగోలుకు చెంది న ఈశ్వరరావు 3 వేల రియాళ్లకు లడ్డూను దక్కించుకున్నారు. బహ్రెయిన్‌, ఒమాన్‌, కువైట్‌లలోనూ చవితి ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు.

Updated Date - Sep 09 , 2024 | 03:45 AM

Advertising
Advertising