ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Delhi Police: హస్తినలో.. పట్టపగలే ఖాకీలు ఇలా..?

ABN, Publish Date - Aug 18 , 2024 | 04:59 PM

రైతులు, వాహనదారులు పోలీసులకు పట్టుబడుతూనే ఉంటారు. ఏదో ఒక కారణంతో డబ్బులు ముక్కుపిండి మరి వసూల్ చేస్తుంటారు. కొందరే నీతి, నిజాయితీగా ఉంటారు. ఢిల్లీలో ఓ ట్రాఫిక్ పోలీస్ లంచం తీసుకున్నాడు.

Delhi Cops

ఢిల్లీ: దేశం వెనకబడి పోవడానికి ప్రధాన కారణం లంచం. లంచం ఇవ్వడమే కాదు.. తీసుకోవడం కూడా నేరమే. రైతులు, వాహనదారులు పోలీసులకు పట్టుబడుతూనే ఉంటారు. ఏదో ఒక కారణంతో డబ్బులు ముక్కుపిండి మరి వసూల్ చేస్తుంటారు. కొందరే నీతి, నిజాయితీగా ఉంటారు. ఢిల్లీలో (Delhi) ఓ ట్రాఫిక్ పోలీస్ లంచం తీసుకున్నాడు. ఒకతనితో వాగ్వివాదానికి దిగి మరి డబ్బులు తీసుకున్నాడు.


డబ్బులు తీసుకొని

థ్రిల్ లౌరీ సర్కిల్ వద్ద గల ఘజిపూర్ చెక్ పోస్ట్ వద్ద ఈ ఘటన జరిగింది. ట్రాఫిక్ పోలీసు ఒకతడిని ఆపాడు. వాహనానికి సంబంధించి ఏదో సమస్య ఉంది. దానిపై చిన్న డిస్కషన్ జరిగింది. తర్వాత డబ్బులను టేబుల్ మీద పెట్టి, పోలీసుకు చూపిస్తూ సదరు వ్యక్తి వెళ్లిపోయాడు. ఆ తర్వాత టేబుల్ వద్ద ట్రాఫిక్ పోలీసు కూర్చొన్నాడు. అతనితో మరో ఇద్దరు కూడా కూర్చున్నారు. తన వద్ద ఉన్న డబ్బులను ఒకొక్కరి పంచాడు. డబ్బులు తీసుకుంటున్న ఇద్దరు నవ్వడం మనం వీడియోలో చూడొచ్చు.


ముగ్గురు సస్పెండ్

ఆ వీడియో సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఇంకేముంది తెగ వైరల్ అయ్యింది. పోలీసులు డబ్బులు తీసుకున్న అంశంపై ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనా స్పందించారు. ‘లంచం తీసుకున్న వారిలో ఇద్దరు ఏఎస్సై, ఒకరు హెడ్ కానిస్టేబుల్ ఉన్నారు. ముగ్గురిని విధుల నుంచి తప్పించాం. ఘటనపై ప్రాథమిక విచారణ జరిపి చర్యలు తీసుకున్నాం. ఆ ముగ్గురిపై శాఖపరమైన విచారణ జరిపిస్తాం అని’ లెప్టినెంట్ గవర్నర్ స్పష్టం చేశారు.


For
Latest News and National News click here

Updated Date - Aug 18 , 2024 | 04:59 PM

Advertising
Advertising
<