ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Tamilnadu: కట్టుదిట్ట భద్రత నడుమ ఈవీఎం, వీవీప్యాడ్‌లు

ABN, Publish Date - Apr 22 , 2024 | 02:52 PM

తమిళనాడులో అన్ని లోక్‌సభ స్థానాలకు తొలి దశలోనే అంటే.. ఏప్రిల్ 19వ తేదీన పోలింగ్ జరిగింది. జూన్ 4వ తేదీన ఓట్ల లెక్కింపు ప్రక్రియ జరగనుంది. ఈ నేపథ్యంలో ఈవిఎమ్‌లతో పాటు వివిప్యాట్ మేషిన్లను కట్టుదిట్టమైన భద్రత మధ్య స్ట్రాంగ్ రూమ్‌లకు తరలించారు.

కృష్ణగిరి/ఈరోడ్, ఏప్రిల్ 22: తమిళనాడులో అన్ని లోక్‌సభ స్థానాలకు తొలి దశలోనే అంటే.. ఏప్రిల్ 19వ తేదీన పోలింగ్ జరిగింది. జూన్ 4వ తేదీన ఓట్ల లెక్కింపు ప్రక్రియ జరగనుంది. ఈ నేపథ్యంలో ఈవిఎమ్‌లతోపాటు వివిప్యాట్ మేషిన్లను కట్టుదిట్టమైన భద్రత మధ్య స్ట్రాంగ్ రూమ్‌లకు తరలించారు.

AP Elections : మహిళలకు ఫ్రీ బస్.. అదిరిందిగా..

అయితే కృష్ణగిరిలోని ప్రభుత్వ పాలిటెక్నిక్ కాలేజీలో ఈవిఎం, వివిప్యాట్‌లకు వివిధ రాజకీయ పార్టీల నేతలు, ఉన్నతాధికారుల సమక్షంలో జిల్లా కలెక్టర్ సీల్ వేశారు. ఇందులో ఆరు అసెంబ్లీ స్థానాలకు సంబంధించిన 4,526 బ్యాలెట్ యూనిట్స్‌, 2,251 కంట్రోల్ యూనిట్స్‌తోపాటు 2392 వివిప్యాట్స్ ఉన్నట్లు జిల్లా కలెక్టర్ తెలిపారు.

ఉద్యోగాల కోసం 54.25 లక్షల మంది నిరీక్షణ

ఈ కాలేజీ పరిసర ప్రాంతాల్లో 300 సీసీ టీవీ కెమెరాలను సైతం అమర్చినట్లు చెప్పారు. ఓ వేళ విద్యుత్ సరఫరా నిలిచినప్పుడు.. జనరేటర్లు అందుబాటులో ఉండేలా చర్యలు చేపట్టినట్లు వివరించారు. అగ్నిమాపక సిబ్బంది సైతం అందుబాటులో ఉంచామన్నారు.

Delhi liquor Case: కవిత బెయిల్‌కు అర్హురాలన్న లాయర్లు.. బెయిల్ ఇవ్వొద్దన్న సీబీఐ


అలాగే ఈ కాలేజీ చుట్టు మూడంచల భద్రత వ్యవస్థను ఏర్పాటు చేశామని డీఎస్పీ తంగిదొరై తెలిపారు. అందులోభాగంగా 24 సీఆర్పీఎఫ్ సిబ్బంది, 45 తమిళనాడు స్పెషల్ బెటాలియన్ పోలీసులు, 253 మంది ఆర్మీ రిజర్వ్‌డ్ సిబ్బందితో కాలేజీ వద్ద పహారా ఏర్పాటు చేసినట్లు చెప్పారు. ఇక ఈరోడ్‌కు సంబంధించిన ఈవిఎం, వివిప్యాడ్‌లను చితోడేలోని ప్రభుత్వ ఇంజినీరింగ్ కాలేజిలో భద్ర పరిచినట్లు ఎన్నికల రిటర్నింగ్ అధికారి రాజ్ గోపాల్ సుంకర వెల్లడించారు.

West Bengal: ఉపాధ్యాయులు భర్తీ స్కాం.. మమత ప్రభుత్వానికి గట్టి దెబ్బ

ఈ స్ట్రాంగ్ రూమ్‌లకు మూడంచెల భద్రత కల్పించినట్లు తెలిపారు. ఈ ఎన్నికల్లో 1,688 కేంద్రాల్లో పోలింగ్ నిర్వహించగా.. 70.5 శాతం మేర రికార్డు స్థాయిలో పోలింగ్ జరిగిందన్నారు. ప్రభుత్వ ఇంజినీరింగ్ కాలేజీ పరిసర ప్రాంతాల్లో కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేసినట్లు వివరించారు.

జాతీయ వార్తలు కోసం..

Updated Date - Apr 22 , 2024 | 03:14 PM

Advertising
Advertising