ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Ram Chander: కలలో కనిపించి మందలించిన సీఎం

ABN, Publish Date - Aug 30 , 2024 | 08:52 AM

ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ తన కలలో కనిపించి.. రామ్ చందర్ వెళ్లి పార్టీ నేతలు మనీశ్ సిసోడియా, గోపాల్ రాయ్, సందీప్ పాఠక్‌లతోపాటు ఇతర నేతలను కలువు. అలాగే మీ ప్రాంతంలోని పార్టీ కార్యకర్తలను కలువు. వారితో కలిసి పని చేయాలని తనను మందలించారన్నారు.

న్యూడిల్లీ, ఆగస్ట్ 30: ఆమ్ ఆద్మీ పార్టీకి రాజీనామా చేసి బీజేపీలో చేరిన కొద్ది రోజులకే కౌన్సిలర్ రామ్ చందర్ మనస్సు మార్చుకున్నారు. ఆయన మళ్లీ ఆప్‌లో తిరిగి చేరారు. మనీశ్ సిసోడియాతోపాటు ఆ పార్టీ కీలక నేతల సమక్షంలో ఆయన పార్టీలో చేరారు. అనంతరం రామ్ చందర్ మాట్లాడుతూ.. ఆమ్ ఆద్మీ పార్టీలో తాను చిన్న సైనికుడినని స్పష్టం చేశారు. ఆప్ వదిలి మరో పార్టీలో చేరడం తాను తీసుకున్న తప్పు నిర్ణయమని ఆయన పేర్కొన్నారు.

Also Read: Manipur: ఎమ్మెల్యే ఫామ్ హౌస్‌లో రైఫిళ్లు చోరీ.. ఐదుగురు అరెస్ట్


నిన్న రాత్రి ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ తన కలలో కనిపించి.. రామ్ చందర్ వెళ్లి పార్టీ నేతలు మనీశ్ సిసోడియా, గోపాల్ రాయ్, సందీప్ పాఠక్‌లతోపాటు ఇతర నేతలను కలువు. అలాగే మీ ప్రాంతంలోని పార్టీ కార్యకర్తలను కలువు. వారితో కలిసి పని చేయాలని తనను మందలించారన్నారు. దీంతో తన నిర్ణయం మార్చుకున్నానని తెలిపారు. సీఎం కేజ్రీవాల్ మాటలను ఎప్పటికి మారువనని ఈ సందర్బంగా ఆయన చెప్పారు.

Also Read: Sri Lanka: దేశాధ్యక్షుడు ఎన్నికల వేళ.. కొలంబోకు అజిత్ దోవల్


అలాగే ఈ పార్టీలోనే తాను జీవిత కాలం కొనసాగుతానని ఈ సందర్భంగా రామ్ చందర్ ప్రమాణం చేశారు. రామచందర్ గతంలో.. బావన అసెంబ్లీ స్థానం నుంచి గెలుపొందారు. ఆయన ప్రస్తుతం వార్డ్ 28 నుంచి కౌన్సిలర్‌గా గెలుపొందారు రామ్ చందర్ తిరిగి పార్టీలో చేరడంపై ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియా తన ఎక్స్ ఖాతా వేదికగా స్పందించారు. పాత మిత్రుడు, ఆమ్ ఆద్మీ పార్టీ సహచరుడు రామ్ చందర్ ఈ రోజు తనను కలిశాడు. అతడు తిరిగి పార్టీలో చేరడం సంతోషంగా ఉందన్నారు.


ఇంకోవైపు ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు వచ్చే ఏడాది జరగనున్నాయి. అలాంటి వేళ.. బీజేపీ, ఆమ్ ఆద్మీ పార్టీకి చెందిన పలువురు కీలక నేతలు భారీగా పార్టీ మారేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఆ క్రమంలో గురువారం కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయం రాజీవ్ భవన్‌లో ఆ పార్టీ ఢిల్లీ అధ్యక్షుడు దేవేంద్ర యాదవ్ సమక్షంలో ఆ యా పార్టీల నేతలు అధిక సంఖ్యలో చేరారు.

ఈ సందర్భంగా దేవేంద్ర యాదవ్ మాట్లాడుతూ.. పార్టీ అధినేత మల్లికార్జున్ ఖర్గే, అగ్రనేత రాహుల్ గాంధీ దృఢమైన నాయకత్వంతోపాటు పార్టీ తీసుకుంటున్న ప్రగతిశీల విధానాలకు వీరంతా ఆకర్షితులవుతున్నారని తెలిపారు.

Read More National News and Latest Telugu News

Updated Date - Aug 30 , 2024 | 09:02 AM

Advertising
Advertising