ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Tomato: టమోటా @ రూ. 20... తగ్గిన ధర

ABN, Publish Date - Mar 19 , 2024 | 01:28 PM

తగ్గిన ధరలతో టమోటా(Tomato) రైతు విలవిలలాడుతున్నారు. రైతులు వేలాది రూపాయలు పెట్టుబడి పెట్టి టమోటా సాగు చేశారు. కానీ మార్కెట్లో ఒక్కసారిగా ధరలు పడిపోవడంతో పెట్టుబడులు కూడా రాక నష్టాల పాలయ్యామంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

- గిట్టుబాటు కాక అన్నదాత విలవిల

- రవాణా ఖర్చులు రాక పొలాల్లోనే వదిలేస్తున్న రైతులు

కంప్లి(బెంగళూరు): తగ్గిన ధరలతో టమోటా(Tomato) రైతు విలవిలలాడుతున్నారు. రైతులు వేలాది రూపాయలు పెట్టుబడి పెట్టి టమోటా సాగు చేశారు. కానీ మార్కెట్లో ఒక్కసారిగా ధరలు పడిపోవడంతో పెట్టుబడులు కూడా రాక నష్టాల పాలయ్యామంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మిరప, బెండ, చిక్కుడు, వంకాయ, క్యారెట్‌, బీన్స్‌ ధరలు మార్కెట్లో ఆకాశాన్ని తాకుతున్నాయి. కానీ టమోటా ధరలు మాత్రం పూర్తిగా పడిపోయాయని ఆందోళన చెందుతున్నారు. కంప్లి, కురుగోడు తాలుకాల్లో బోర్ల కింద వేల హెక్టార్లలో పంటలు వేశారు. కొళూరు, దమ్మూరు, కురుగోడు, ముష్టిగట్టి, లక్ష్మీపుర, శ్రీనివాస క్యాంపు, ఎమ్మిగనూరు, కంప్లి, తదితర భాగాల్లో అధికంగా టమోటా సాగు చేశారు. అయితే తీరా పంట చేతికొచ్చే సరికి ధరలు పడిపోవడంతో పెట్టుబడులు కూడా రావడం లేదని ఆందోళన చెందుతున్నారు. ప్రస్తుతం మార్కెట్‌లో 25 కిలోల బాక్స్‌ రూ. 60 పలుకుతోంది. కిలో ధర రెండు రూపాయలు కూడా పలకడం లేదు. కనీసం రవాణా ఖర్చులు కూడా రావడం లేదని అన్నదాత వాపోతున్నారు. కొందరు రైతులు గిట్టుబాటు కూడా కాదని పంటను పొలాల్లోనే వదిలేస్తున్నారు. ఎమ్మిగనూరు గ్రామానికి చెందిన మారెష్‌ తన రెండు ఎకరాలల్లో సాగు చేసిన టమోటా పంటను మార్కెట్‌కు తరలించారు. అయితే మార్కెట్లో ధరలు లేకపోవడంతో పెట్టుబడిలో సగం కూడా రాలేదని ఆవేదన వ్యక్తం చేశారు. నాట్లు, పిచికారి మందులు, కూలీల సొమ్ము పెరిగిపోయాయని, ప్రభుత్వాలు ఇతర కాయగూరల మాదిరిగానే టమోటాకు గిట్టుబాటు ధరలు కల్పించాలని కోరారు. అలాగే కంప్లి వ్యవసాయ కృషి కేంద్రం వద్ద రైతు కొట్టాల నాగరాజు పొలం పైనే టమోటా పంటను వదిలేసి, పశువులకు మేతగా వేశానని, ఇంత నష్టాలు ఎప్పుడూ చూడలేదని వాపోయారు. మొత్తానికి ఈ యేడాది టమోటా పంట రైతులకు నిరాశనే మిగిల్చింది.

Updated Date - Mar 19 , 2024 | 01:28 PM

Advertising
Advertising