Mumbai Boat Accident : ముంబై సముద్రతీరంలో పడవ ప్రమాదం
ABN, Publish Date - Dec 19 , 2024 | 05:30 AM
ముంబై సముద్రతీరంలో బుధవారం విషాద ఘటన చోటుచేసుకుంది. ‘గేట్‌వే ఆఫ్ ఇండియా’ నుంచి ప్రసిద్ది చెందిన ఎలిఫెంటా దీవులకు ప్రయాణికులతో వెళ్తున్న నీల్‌కమల్ అనే పడవను నేవీకి చెందిన బోటు
13 మంది మృతి, ప్రాణాలతో బయటపడిన 101 మంది
ప్రయాణికులతో వెళ్తున్న నీల్‌కమల్ ఫెర్రీని ఢీకొన్న నేవీ బోటు
ముంబై, డిసెంబరు 18: ముంబై సముద్రతీరంలో బుధవారం విషాద ఘటన చోటుచేసుకుంది. ‘గేట్‌వే ఆఫ్ ఇండియా’ నుంచి ప్రసిద్ది చెందిన ఎలిఫెంటా దీవులకు ప్రయాణికులతో వెళ్తున్న నీల్‌కమల్ అనే పడవను నేవీకి చెందిన బోటు ఢీకొట్టిన ఘటనలో 13 మంది దుర్మరణం చెందారు. ఈ ఘటనలో 101 మందిని కాపాడినట్టు మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడణవీస్ తెలిపారు. ప్రయాణికులతో నీల్‌కమల్ ఫెర్రీ వెళ్తున్న క్రమంలో వేగంగా వచ్చిన నేవీ స్పీడ్ బోటు ఢీకొట్టింది. దీంతో ఆ ఫెర్రీ సముద్రంలో మునిగిపోయింది. నేవీ బోటుకు ఇటీవలే కొత్త ఇంజన్‌ను బిగించారు. దాన్ని పరీక్షిస్తున్న సమయంలో అది నియంత్రణ కోల్పోయి నీల్‌కమల్ ఫెర్రీని ఢీకొట్టింది. నేవీ బోటులో ఆరుగురున్నారని, వీరిలో ఇద్దరు నేవీ సిబ్బంది, నలుగురు ఇంజన్ సరఫరా చేసిన కంపెనీకి చెందిన వారున్నారని తెలుస్తోంది.
Updated Date - Dec 19 , 2024 | 05:30 AM