సుప్రీంకోర్టులో ‘ట్వెల్త్ ఫెయిల్’ ప్రదర్శన
ABN, Publish Date - Sep 28 , 2024 | 04:25 AM
విధు వినోద్ చోప్రా దర్శకత్వంలో తెరకెక్కిన ‘ట్వెల్త్ ఫెయిల్’ సినిమాను సుప్రీంకోర్టులో ప్రత్యేకంగా ప్రదర్శించారు.
న్యూఢిల్లీ, సెప్టెంబర్ 27: విధు వినోద్ చోప్రా దర్శకత్వంలో తెరకెక్కిన ‘ట్వెల్త్ ఫెయిల్’ సినిమాను సుప్రీంకోర్టులో ప్రత్యేకంగా ప్రదర్శించారు. సీజేఐ జస్టిస్ చంద్రచూడ్, ఇతర జడ్జిలు, మరో 600 మంది అధికారులు ఈ సినిమాను చూశారు. దేశాన్ని కొత్త శిఖరాలకు తీసుకెళ్లేందుకు తమ పిల్లల్ని ప్రోత్సహించేలా న్యాయస్థాన సిబ్బందికి సినిమా స్ఫూర్తి కలిగించి ఉంటుందని జస్టిస్ చంద్రచూడ్ ఈ సందర్భంగా అభిప్రాయపడ్డారు. సినిమా చూస్తుండగా తన కళ్లు చెమర్చాయన్నారు. కాగా, సుప్రీంకోర్టు కీలక తీర్పుల సారాంశాలతో కొత్త వెబ్ పేజీ ఆవిష్కృతమైంది. ‘ల్యాండ్ మార్క్ జడ్జిమెంట్ సమ్మరీస్’ పేరుతో సుప్రీంకోర్టే ఈపేజీని నిర్వహిస్తోంది.
Updated Date - Sep 28 , 2024 | 04:25 AM