ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Delhi's Ram Manohar Lohia: ఆసుపత్రిలో అవినీతి.. 9 మంది అరెస్ట్

ABN, Publish Date - May 08 , 2024 | 07:12 PM

ఢిల్లీలోని రామ్‌మనోహర్ లోహియా ఆసుపత్రిలో చోటు చేసుకున్న అవినీతి రాకెట్‌ను సీబీఐ ఛేదించింది. ఆసుపత్రిలో అవినీతికి పాల్పడుతున్న 9 మంది సిబ్బందిని సీబీఐ బుధవారం అరెస్ట్ చేసింది. వారిలో ఇద్దరు వైద్యులతోపాటు సీనియర్ ల్యాబ్ ఇన్‌చార్జ్ ఉన్నారు.

న్యూడిల్లీ, మే 08: ఢిల్లీలోని రామ్‌మనోహర్ లోహియా ఆసుపత్రిలో చోటు చేసుకున్న అవినీతి రాకెట్‌ను సీబీఐ ఛేదించింది. ఆసుపత్రిలో అవినీతికి పాల్పడుతున్న 9 మంది సిబ్బందిని సీబీఐ బుధవారం అరెస్ట్ చేసింది. వారిలో ఇద్దరు వైద్యులతోపాటు సీనియర్ ల్యాబ్ ఇన్‌చార్జ్ ఉన్నారు. ఆసుపత్రికి వచ్చే రోగుల నుంచే కాకుండా.. మెడికల్ రిప్రజెంటేటివ్స్ వద్ద నుంచి వీరు భారీగా లంచాలు డిమాండ్ చేస్తున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తాయి.

Narendra Modi: రాష్ట్రపతిగా ముర్మును ఎందుకు వ్యతిరేకించారో తర్వాత అర్థమైంది

దీనిపై విచారణ జరిపిన సీబీఐ వారిని అరెస్ట్ చేసింది. వారిలో.. కార్డియాలజీ విభాగంలో అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ పర్వత గౌడతోపాటు కార్డియాలజీ విభాగంలోని ప్రొఫెసర్ డాక్టర్ అజయ్ రాజ్‌లను సీబీఐ అరెస్ట్ చేసింది. అలాగే సీనియర్ ల్యాబ్ ఇన్‌చార్జీ రజనీష్ కుమార్‌ సైతం అరెస్ట్ అయిన వారిలో ఉన్నారు. రామ్‌ మనోహర్ లోహియా ఆసుపత్రిలో సిబ్బంది లంచాలను డిమాండ్ చేస్తున్నారంటూ ఆరోపణలు వెల్లువెత్తాయి.

LokSabha Elelctions: రాయ్‌బరేలీలో కొత్త శకం ఆరంభం: ప్రియాంక


ఆ క్రమంలో సీబీఐ దర్యాప్తు చేపట్టింది. అందులోభాగంగా.. గుండెకు వేసే స్టంట్స్‌తోపాటు వైద్యానికి అవసరమైన పరికరాలు, గుండెకు వేసే స్టంట్స్‌లో నిర్దిష్ట బ్రాండులే కావాలని డిమాండ్ చేయడం.. ల్యాబ్స్‌లో వైద్య పరికరాలు, ఇక ఆసుపత్రిలో చేరిన రోగుల నుంచి లంచాల రూపంలో నగదు వసుల్ చేయడం.. అలాగే నకిలీ వైద్య దృవపత్రాలను జారీ చేస్తున్నట్లు సీబీఐ గుర్తించింది. అందులో ప్రమేయమున్న 9 మంది సిబ్బందిని సీబీఐ అరెస్ట్ చేసింది.

Read Latest National News and Telugu News

Updated Date - May 08 , 2024 | 07:13 PM

Advertising
Advertising