ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Wolf Attack: 12 రోజుల తర్వాత జనాల సమక్షంలో మళ్లీ తోడేలు దాడి.. ఇద్దరికి గాయాలు

ABN, Publish Date - Sep 27 , 2024 | 01:08 PM

నరమాంస భక్షక తోడేలు మరోసారి దాడి చేసింది. ఈ ఘటనలో అమాయక చిన్నారితో సహా ఇద్దరికి గాయాలయ్యాయి. ఈ ఘటన యూపీలోని హార్ది పోలీస్ స్టేషన్‌ పరిధిలో గురువారం అర్ధరాత్రి చోటుచేసుకుంది. ఆ వివరాలేంటో ఇక్కడ చుద్దాం.

wolf attack Bahraich

ఉత్తర్ ప్రదేశ్‌(Uttar Pradesh)లోని బహ్రైచ్‌లో 12 రోజుల తర్వాత గురువారం రాత్రి మళ్లీ నరమాంస భక్షక తోడేలు ఎటాక్(wolf attack) చేసింది. హార్ది పోలీస్ స్టేషన్‌లోని రెండు వేర్వేరు ప్రదేశాలలో తోడేలు దాడి చేయగా, ఓ అమాయక చిన్నారితో సహా ఇద్దరు గాయపడ్డారు. సమాచారం అందుకున్న అధికారులు సంఘటనా స్థలానికి చేరుకుని క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆస్పత్రిలో చేర్చారు. ప్రథమ చికిత్స అనంతరం వైద్యులు క్షతగాత్రులను మెడికల్ కాలేజీకి రిఫర్ చేశారు. ఈ సంఘటనల నేపథ్యంలో అటవీశాఖ అధికారులు సంఘటనా స్థలానికి చేరుకుని సమాచారం సేకరిస్తున్నారు.


బాలికను

హార్ది పోలీస్ స్టేషన్‌లోని లోధన్‌పూర్వాలో తీరత్ ఐదేళ్ల కుమార్తె మమత తన అక్క ఫూలాతో కలిసి రాత్రి షెడ్డు కింద పడుకుంది. తండ్రి తీరత్ కొంచెం దూరంలో పడుకుని ఉన్నాడు. ఆ క్రమంలో అర్థరాత్రి రెండు గంటల ప్రాంతంలో తోడేలు నిశ్శబ్దంగా వచ్చి మమతను తన దవడకు పట్టుకుని పారిపోయిందని స్థానికులు అన్నారు. బాలిక కేకలు వేయడంతో కుటుంబ సభ్యులు భయాందోళన చెంది తోడేలును వెంబడించారు. ఆ క్రమంలో తోడేలు బాలికను వారి ఇంటికి 50 మీటర్ల దూరంలో వదిలి వెళ్లిందని గాయపడిన మమత మామ రతన్ తెలిపారు.


4 కిలోమీటర్ల దూరంలో

ఓ గంట తర్వాత నాలుగు కిలోమీటర్ల దూరంలో ఉన్న ఘుమాని గ్రామంపై కూడా తోడేలు దాడి చేసింది. ఇక్కడ తల్లితో కలిసి మామ ఇంటికి వచ్చిన రాంవాపూర్‌కు చెందిన రమేష్‌ ఆరు నెలల కుమారుడిపై దాడి చేసి గాయపరిచింది. వెంటనే గమనించి అప్రమత్తమైన కుటుంబ సభ్యులు చిన్నారిని చికిత్స నిమిత్తం సీహెచ్‌సీకి తరలించారు. ప్రథమ చికిత్స అనంతరం వైద్యులు క్షతగాత్రులను వైద్య కళాశాలకు తరలించారు. అంతకుముందు సెప్టెంబరు 16న సీసయ్య చురమణిలో నివాసముంటున్న రామ్‌కిషన్‌కు చెందిన మేకపై తోడేలు దాడి చేసి స్థానికుల సమక్షంలోనే తీసుకెళ్లిందని వెల్లడించారు.


12 రోజుల తర్వాత దాడి

గత 12 రోజులుగా మనుషులపై తోడేళ్ల దాడులు జరగలేదు. దీంతో గ్రామస్తులకు కొంత ఊరట లభించింది. కానీ తాజా దాడులతో గ్రామస్తులు మరోసారి భయాందోళనకు గురవుతున్నారు. ఈ అంశంపై జంతువుల దాడిగా కనిపిస్తోందని సీహెచ్‌సీ సూపరింటెండెంట్‌ డాక్టర్‌ ఆశిష్‌ వర్మ తెలిపారు. ఘటనా స్థలంలో కనిపించిన గోరు గుర్తులు తోడేళ్లవి కావని డీఎఫ్‌వో అజిత్ ప్రతాప్ సింగ్ అన్నారు. నక్క లేదా కుక్క దాడి చేసి ఉంటుందని చెబుతున్నారు. ఈ అంశంపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. ఇక తోడేళ్ల దాడిలో ఇప్పటివరకు 10 మంది మరణించగా, 41 మంది గాయపడ్డారు.


ఇవి కూడా చదవండి:

IMD: ఐఎండీ రెయిన్ అలర్ట్.. ఈ రాష్ట్రాలకు భారీ వర్ష సూచన


Personal Finance: ఈ పోస్ట్ ఆఫీస్ స్కీంలో రూ.10 లక్షలు పెడితే.. మీకు వడ్డీనే రూ. 20 లక్షలొస్తుంది తెలుసా..


Bank Holidays: అక్టోబర్‌లో బ్యాంకు సెలవులు ఎన్నిరోజులంటే.. పనిచేసేది మాత్రం..

Online Shopping Tips: పండుగల సీజన్‌లో ఆన్‌లైన్‌ షాపింగ్ చేస్తున్నారా.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి

Read More National News and Latest Telugu News

Updated Date - Sep 27 , 2024 | 01:10 PM