బ్యాలెట్ పేపర్‌తో మళ్లీ ఎన్నికలు
ABN, Publish Date - Nov 26 , 2024 | 03:06 AM
మహారాష్ట్ర ఎన్నికల్లో పరాజయం తర్వాత ఉద్ధవ్ ఠాక్రే శివసేన పార్టీ కొత్త డిమాండ్ తెరపైకి తెచ్చింది.
మహారాష్ట్ర ఎన్నికలపై ఉద్ధవ్ ఠాక్రే శివసేన డిమాండ్
ముంబై, నవంబరు 25: మహారాష్ట్ర ఎన్నికల్లో పరాజయం తర్వాత ఉద్ధవ్ ఠాక్రే శివసేన పార్టీ కొత్త డిమాండ్ తెరపైకి తెచ్చింది. తాజాగా జరిగిన ఎన్నికల ఫలితాలు నిలిపివేసి బ్యాలెట్ పేపర్‌తో మరోసారి ఎన్నికలు నిర్వహించాలని కోరింది. ఈ డిమాండ్‌పై ఆ పార్టీ రాజ్యసభ సభ్యుడు సంజయ్‌రౌత్ మాట్లాడుతూ.. ఎన్నికల సమయంలో ఈవీఎంలపై 450 ఫిర్యాదులు చేసినా పట్టించుకోకుండా పోలింగ్ కొనసాగించినందువల్లఆ ఎన్నికల ఫలితాలు నిలిపివేసి పేపర్ బ్యాలెట్‌తో మరోసారి నిర్వహించాలని కోరుతున్నామన్నారు. అప్పుడు తామే విజయం సాధిస్తామని ధీమా వ్యక్తం చేశారు. ఎలక్షన్ కౌంటింగ్ రోజున మొదట లెక్కించిన బ్యాలెట్లలో తాము ఆధిక్యంలో ఉన్నా కూడా ఈవీఎంల కౌంటింగ్ మొదలైన తర్వాత పరిస్థితి మారి పోయిందని ఆరోపించారు. ఎన్నికల విజయాల్లో బీజేపీ ఓ వ్యూహం ప్రకారం వెళుతోందని, పెద్ద రాష్ట్రాల్లో ఆ పార్టీ గెలుస్తూ, చిన్న రాష్ట్రాలను మాత్రం ప్రతిపక్షాలకు ఇచ్చేస్తోందని రౌత్ ఆరోపించారు.
Updated Date - Nov 26 , 2024 | 04:19 AM