ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

UCC: ఉమ్మడి పౌరస్మృతి ఆమోదయోగ్యం కాదు.. ముస్లిం పర్సనల్ లా బోర్డు అభ్యంతరం

ABN, Publish Date - Aug 18 , 2024 | 10:02 AM

ఉమ్మడి, సెక్యులర్ సివిల్ కోడ్ తమకు ఆమోదయోగ్యం కాదని, షరియా చట్టం విషయంలో తాము రాజీపడే ప్రసక్తి లేదని ఆలిండియా ముస్లిం పర్సనల్ లా బోర్డు తేల్చిచెప్పింది. స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా సెక్యులర్ సివిల్ కోడ్‌కు ప్రధాన మంత్రి ఇచ్చిన పిలుపు, ఇప్పుడున్న మతపర సివిల్ కోడ్‌ను మార్చాలని చెప్పడం తీవ్ర అభ్యంతరకరమని ఒక ప్రకటనలో పేర్కొంది.

న్యూఢిల్లీ: ఉమ్మడి (uniform), సెక్యులర్ సివిల్ కోడ్ (secular civil code) తమకు ఆమోదయోగ్యం కాదని, షరియా చట్టం విషయంలో తాము రాజీపడే ప్రసక్తి లేదని ఆలిండియా ముస్లిం పర్సనల్ లా బోర్డు (AIMPL) తేల్చిచెప్పింది. స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా సెక్యులర్ సివిల్ కోడ్‌కు ప్రధాన మంత్రి ఇచ్చిన పిలుపు, ఇప్పుడున్న మతపర సివిల్ కోడ్‌ను మార్చాలని చెప్పడం తీవ్ర అభ్యంతరకరమని ఒక ప్రకటనలో పేర్కొంది.

PM Modi : లౌకిక పౌరస్మృతి


ప్రధాన మంత్రి ఎర్రకోట నుంచి చేసిన ప్రసంగంలో ''ఇప్పుడున్న సివిల్ కోడ్ మతపరమైన సివిల్ కోడ్‌‌గా ఉన్నదని మన సమాజంలోని ఒక పెద్ద సమూహం నమ్ముతోంది. ఇది నిజం కూడా. ఈ కోడ్ వివక్షాపూరితమైనది. అది మత ప్రాతిపదికన దేశాన్ని ముక్కలు చేసి, అసమానత్వాన్ని ప్రోత్సహిస్తుంది. ఇప్పుడు మనమంతా సెక్యులర్ సివిల్ కోడ్‌కు మారాలి. ఇది ఇప్పటి అవసరం కూడా'' అని అన్నారు.


'షరియా లా'తోనే...

కాగా, షరియా చట్టానికి తాము దూరమయ్యేది లేదని ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డు (ఏఐఎంపీఎల్) స్పష్టం చేసినట్టు బోర్డు ప్రతినిధి డాక్టర్ ఎస్‌క్యూఆర్ ఇలియాస్ ఒక ప్రకటనలో తెలిపారు. షరియా వంటి 'పెర్సనల్ లా'ను మతపరమైన సివిల్ కోడ్‌గా మోదీ పేర్కొనడం తమను దిగ్భ్రాంతికి గురిచేసిందన్నారు. ఇండియాలోని ముస్లింలు తమ మతపరమైన చట్టాలను పాటించే హక్కు ఉందనే విషయాన్ని షరియత్ అప్లికేషన్ యాక్ట్-1937 చాలా స్పష్టంగా చెబుతోందని తెలిపారు. రాజ్యాంగంలోని 25వ నిబంధన ప్రకారం తమ మతాన్ని పాటించే హక్కు, ప్రచారం చేసుకునే హక్కు భారత పౌరులందరికీ ఉందన్నారు. ఫ్యామిలీ చట్టాలు ముస్లింలతో సహా అందరికీ వారివారి మతాలు, పురాతన సంప్రదాయాల ఆధారంగానే ఉంటాయని చెప్పారు. రాజ్యాంగపరంగా వాడే ఉమ్మడి పౌరస్మృతి పదానికి బదులుగా సెక్యులర్ సివిల్ కోడ్ అనే పదాన్ని మోదీ వాడడాన్ని కూడా ఆయన విమర్శించారు. షరియా చట్టాన్ని లక్ష్యంగా చేసుకుని ఉద్దేశపూర్వకంగానే ప్రజలను తప్పదారి పట్టించేందుకు ప్రధాని ప్రయత్నించారని ఆరోపించారు. స్వాతంత్ర్య వీరుల త్యాగాలు, సాధించిన విజయాలు, అభ్యుదయ, శాంతికాముక భారత్‌ను గుర్తుచేసుకునే స్వాతంత్ర్య దినోత్సవం నాడు సమాజంలో మతవిద్వేషం, శతృత్వాన్ని ప్రోత్సహించడం సరికాదని డాక్టర్ ఇలియాస్ ఆ ప్రకటనలో పేర్కొన్నారు.

Read More National News and Latest Telugu News

Updated Date - Aug 18 , 2024 | 10:02 AM

Advertising
Advertising
<