Union Cabinet Decesion: 2028 వరకూ ఉచిత బియ్యం... కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయం
ABN, Publish Date - Oct 09 , 2024 | 06:46 PM
దేశవ్యాప్తంగా ఆహార భద్రతలో భాగంగా ఉచితంగా బియ్యం/ఆహార ధాన్యాలను అందించేందుకు ఉద్దేశించిన పీఎం గరీబ్ కల్యాణ్ అన్న యోజనను మరో నాలుగేళ్ళు పొడిగిస్తూ కేంద్ర క్యాబినెట్ కీలక నిర్ణయం తీసుకుంది.
న్యూఢిల్లీ: దసరా పండుగ సీజన్‌లో నరేంద్ర మోదీ (Narendra Modi) సారథ్యంలోని కేంద్రం శుభవార్త చెప్పింది. 2028 డిసెంబర్ వరకూ ఉచిత బియ్యం పంపిణీ పథకాలకు కేంద్ర క్యాబినెట్ ఆమోదం తెలిపింది. దేశవ్యాప్తంగా ఆహార భద్రతలో భాగంగా ఉచితంగా బియ్యం/ఆహార ధాన్యాలను అందించేందుకు ఉద్దేశించిన పీఎం గరీబ్ కల్యాణ్ అన్న యోజన (PMGKAY)ను మరో నాలుగేళ్ళు పొడిగిస్తున్నామని, ఇందువల్ల ప్రభుత్వానికి రూ.17,082 కోట్ల ఖర్చు అవుతుందని తెలిపింది. ఈ మొత్తం కేంద్రమే భరిస్తుందని కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ బుధవారంనాడు మీడియాతో మాట్లాడుతూ చెప్పారు.
PM Modi: దేశాన్ని కులాల వారీగా కాంగ్రెస్ విభజిస్తోంది.. ప్రధాని మోదీ ఘాటు వ్యాఖ్యలు..
ఫోర్టిఫైడ్ రైస్ నాణ్యతను పరీక్షించేందుకు 27 ఎన్‌ఏబీఎల్ ల్యాబ్స్‌ను వినియోగిస్తామని, విటమిన్ మినరల్ ప్రీమిక్స్ టెస్టింగ్ కోసం 11 ఎన్‌ఏబీఎల్ ల్యాబ్‌లు అందుబాటులోకి తెస్తామని చెప్పారు. ఇందుకు అవసరమైన సప్లై చైన్ డపలప్‌మెంట్ కోసం రూ.11,000 కోట్లు ఇన్వెస్ట్ చేస్తామని మంత్రి తెలిపారు. కాగా, గుజరాత్‌లోని లోథాల్‌లో నేషనల్ హెరిటేజ్ కాంప్లెక్స్ అభివృద్ధికి కూడా కేబినెట్ గ్రీన్‌సిగ్నల్ ఇచ్చినట్టు చెప్పారు. ఇందువల్ల 22,000 ఉద్యోగాల సృష్టి జరిగుతుందన్నారు. వివిధ దశల్లో ఈ ఎన్ఎంహెచ్‌సీని అభివృద్ధి చేస్తామని చెప్పారు. రాజస్థాన్, పంజాబ్ సరిహద్దు ప్రాంతాల్లో 2,280 కిలోమీటర్ల మేర రోడ్ల నిర్మాణానికి సైతం కేంద్ర క్యాబినెట్ ఆమోదం తెలిపినట్టు అశ్విని వైష్ణవ్ తెలిపారు. ఇందుకు రూ.4,406 కోట్ల ఖర్చవుతుందని చెప్పారు.
For More National News and Telugu News..
ఇది కూడా చదవండి..
Exit Polls Fail: సర్వే సంస్థల అంచనాలు బోల్తా.. ప్రజల నాడి పసిగట్టడంతో విఫలం..
Haryana: బీజేపీకి పెరిగిన బలం.. సావిత్రి జిందాల్ సహా ఇద్దరు ఇండిపెండెంట్లు మద్దతు
Updated Date - Oct 09 , 2024 | 07:25 PM