Union Minister: భద్రావతి స్టీల్ ప్లాంట్‌కు రూ.15వేల కోట్లు..
ABN, Publish Date - Sep 06 , 2024 | 01:43 PM
శివమొగ్గ జిల్లా భద్రావతిలోని విశ్వేశ్వరయ్య ఐరన్ అండ్ స్టీల్ ఫ్యాక్టరీ (వీఐఎస్ఎల్) పునరుజ్జీవనానికి 15వేల కోట్ల రూపాయలు అవసరమని కేంద్ర భారీ పరిశ్రమలశాఖ మంత్రి కుమారస్వామి(Minister Kumaraswamy) తెలిపారు.
- పునఃప్రారంభంతో వేలాది మందికి ఉపాధి
- కేంద్ర భారీ పరిశ్రమలశాఖ మంత్రి కుమారస్వామి
బెంగళూరు: శివమొగ్గ జిల్లా భద్రావతిలోని విశ్వేశ్వరయ్య ఐరన్ అండ్ స్టీల్ ఫ్యాక్టరీ (వీఐఎస్ఎల్) పునరుజ్జీవనానికి 15వేల కోట్ల రూపాయలు అవసరమని కేంద్ర భారీ పరిశ్రమలశాఖ మంత్రి కుమారస్వామి(Minister Kumaraswamy) తెలిపారు. గురువారం శివమొగ్గలో కేంద్రమంత్రి మీడియాతో మాట్లాడుతూ... కార్మికుల సంక్షేమం దృష్ట్యా విశ్వేశ్వరయ్య పేరు కాపాడేందుకు ఫ్యాక్టరీని పునఃప్రారంభించేందుకు ప్రామాణికంగా ప్రయత్నిస్తానన్నారు. గతంలో ఈ పరిశ్రమను మూసివేయాలన్న తీర్మానం జరిగిందన్నారు. ఇది వేలాది కుటుంబాలకు జీవనం ఇచ్చిన సంస్థ అన్నారు. దాన్ని కాపాడేందుకు ఎంతగా పోరాటం చేశాననేది తనకు తెలుసునన్నారు.
ఇదికూడా చదవండి: Chennai: ఊటీలో రెండో సీజన్ ప్రారంభం..
పరిశ్రమకు పూర్వవైభవం తీసుకొస్తానన్నారు. ఆర్థికంగా వెనుకబడిన కంపెనీలను ప్రైవేట్ సంస్థలకు అప్పగించాలనే తీర్మానం జరిగిందన్నారు. పెట్టుబడులు సాధించాలనే నిర్ణయం తీసుకున్నామన్నారు. అయితే వీఐఎస్ఎల్ మనుగడకోసం ప్రయత్నాలు చేస్తానన్నారు. విశాఖపట్నం(Visakhapatnam)లోని జాతీయ ఇస్పాత్ లిమిటెడ్ పరిశ్రమకు, వీఐఎ్‌సఎల్ భిన్నం కాదన్నారు. లాభాల్లో ఉన్న ఆ పరిశ్రమ ప్రస్తుతం నష్టాల్లో ఉందన్నారు.
ఆ పరిశ్రమ ప్రారంభం కావాలంటే రూ.35వేల కోట్లు కావాలని, వీఐఎస్ఎల్ మనుగడకు రూ.15వేల కోట్లు అవసరమన్నారు. భారీ పరిశ్రమలశాఖకు అనుకున్నంత స్థాయిలో గ్రాంట్లు కేటాయించే పరిస్థితి లేదన్నారు. ప్రాజెక్టులు ఏవైనా కేబినెట్‌లో చర్చించి ఆర్థికశాఖకు సిఫారసు చేయాల్సి ఉంటుందన్నారు. పూర్తిగా పరిశ్రమను నిర్మించాల్సి ఉందన్నారు. రాష్ట్రంలో సీఎం మార్పుపై ప్రస్తావిస్తూ కాంగ్రెస్‌లో ఇదేం కొత్త కాదని, రేసులోనూ ఎక్కువ పేర్లు వినిపిస్తున్నాయన్నారు.
గత ప్రభుత్వంపై 40శాతం కమీషన్ ఆరోపణలు చేశారని ఇప్పుడు అంతకంటే ఎక్కువే సాగుతోందని, కాంగ్రెస్ వారే ఆరోపిస్తున్నారన్నారు. ఎమ్మెల్యే శారదాపూర్యానాయక్, మాజీ ఎమ్మెల్యే కేబీ ప్రసన్నకుమార్, జేడీఎస్ జిల్లా అధ్యక్షుడు కడిదాళ్ గోపాల్‌తోపాటు పలువురు ఉన్నారు.
ఇదికూడా చదవండి: Cyber criminals: నగరంలో.. ఆగని సైబర్ మోసాలు..
ఇదికూడా చదవండి: Hyderabad: బెంగళూరు టు బాయ్స్ హాస్టల్..
ఇదికూడా చదవండి: Hyderabad: కారుతో ఢీకొట్టి.. కళ్లల్లో కారం చల్లి...
Read Latest Telangana News and National News
Updated Date - Sep 06 , 2024 | 01:43 PM