ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

వృద్ధుల సంరక్షణకు పాలసీ

ABN, Publish Date - Nov 17 , 2024 | 03:09 AM

వృద్ధుల కోసం కేంద్ర ప్రభుత్వం కొత్త విధానాన్ని తీసుకురానుందని కేంద్ర సామాజిక న్యాయం, సాధికారత మంత్రిత్వ శాఖ కార్యదర్శి అమిత్‌ యాదవ్‌ వెల్లడించారు.

  • వేగంగా కసరత్తు.. 25 ఏళ్లలో తొలిసారి.. వచ్చే పాతికేళ్లపాటు మార్గదర్శనం

  • ‘తల్లిదండ్రులు, వృద్ధుల సంరక్షణ, సంక్షేమ చట్టానికి’ సవరణలు.. కేంద్ర కార్యదర్శి వెల్లడి

న్యూఢిల్లీ, నవంబరు 16: వృద్ధుల కోసం కేంద్ర ప్రభుత్వం కొత్త విధానాన్ని తీసుకురానుందని కేంద్ర సామాజిక న్యాయం, సాధికారత మంత్రిత్వ శాఖ కార్యదర్శి అమిత్‌ యాదవ్‌ వెల్లడించారు. గత 25 ఏళ్లలో ఇటువంటి పాలసీని రూపొందించడం ఇదే తొలిసారన్నారు. దీంట్లో భాగంగా ‘తల్లిదండ్రులు, వృద్ధుల సంరక్షణ, సంక్షేమ చట్టానికి’ సవరణలు చేస్తామని, ప్రస్తుత కాలంలో వృద్ధుల అవసరాలకు అనుగుణంగా ఈ కొత్త విధానం ఉంటుందని అమిత్‌ యాదవ్‌ వివరించారు. ‘మా మంత్రిత్వ శాఖ ప్రస్తుతం రెండు అంశాలపై పని చేస్తోంది. వాటిలో మొదటిది.. కొత్త విధానం రూపకల్పన. 1999లో అప్పటి ప్రభుత్వం వృద్ధుల సంక్షేమం కోసం ఒక పాలసీని తీసుకొచ్చింది. ఆ తర్వాత మళ్లీ ఇన్నాళ్లకు విస్తృత సంప్రదింపులతో కొత్త విధానాన్ని తీసుకొచ్చే కసరత్తు ప్రారంభించాం. ఇది రాబోయే 25 ఏళ్లకు మార్గదర్శనం చేస్తుంది. ఇక రెండో అంశం.. ‘తల్లిదండ్రులు, వృద్ధుల సంరక్షణ, సంక్షేమ చట్టం-2007’కు సవరణలు. కాలంలోపాటు వచ్చిన మార్పులు, సవాళ్లకు పరిష్కారం చూపేలా, సీనియర్‌ సిటిజన్లకు భవిష్యత్‌ భారతదేశం సౌకర్యవంతంగా ఉండేలా కొత్త పాలసీని రూపొందిస్తాం’ అని తెలిపారు. దేశంలో ప్రస్తుతం 15.67 కోట్లుగా ఉన్న వృద్ధుల సంఖ్య.. 2050 నాటికి 34.6 కోట్లకు పెరుగుతుందన్న అంచనాలున్నాయి.


ఈ నేపథ్యంలో, వృద్ధుల సంక్షేమానికి సమగ్రమైన సంస్కరణలు అవసరమనే వాదనలు బలంగా ముందుకొస్తున్నాయి. అస్లీ (అసోసియేషన్‌ ఆఫ్‌ సీనియర్‌ లివింగ్‌ ఇండియా) అనే స్వచ్ఛందసంస్థ.. వృద్ధుల సంరక్షణకు ప్రపంచ దేశాల్లో పాటిస్తున్న అత్యుత్తమ విధానాలపై అధ్యయనం చేయటానికి వీలుగా ఒక టాస్క్‌ఫోర్స్‌ను ఏర్పాటు చేయాలని ప్రభుత్వాన్ని కోరింది. వృద్ధుల అవసరాలకు అనుగుణంగా అపార్ట్‌మెంట్లను, కాలనీలను నిర్మించే స్థిరాస్తి సంస్థలకు అనుమతుల జారీ విషయంలో సింగిల్‌ నోడల్‌ ఏజెన్సీని ప్రభుత్వం ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేసింది. సీనియర్‌ సిటిజన్ల కోసం హౌసింగ్‌ ప్రాజెక్టులు నిర్మించే డెవలపర్లు ప్రస్తుతం 18 శాతం జీఎస్టీ చెల్లిస్తున్నారని, దీనిని తగ్గించాలని ఆశియానా హౌసింగ్‌ ఎండీ అంకుర్‌ గుప్తా పేర్కొన్నారు.

Updated Date - Nov 17 , 2024 | 03:11 AM