ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

AAP MP: సంజయ్ సింగ్‌పై కోర్టు సీరియస్.. అరెస్ట్ చేయాలంటూ ఆదేశాలు

ABN, Publish Date - Aug 20 , 2024 | 09:26 PM

ఆమ్ ఆద్మీ పార్టీ రాజ్యసభ సభ్యుడు సంజయ్ సింగ్‌ను అరెస్ట్ చేయాలని సుల్తాన్‌పూర్ కోర్టు మంగళవారం ఉత్తరప్రదేశ్‌ పోలీసులను ఆదేశించింది. ఆగస్ట్ 28వ తేదీ జరిగే విచారణకు ఆయన్ని హాజరు పరచాలని పోలీసులకు కోర్టు సూచించింది. ఉత్తరప్రదేశ్‌లోని సుల్తాన్‌పూర్ కోర్టులో దాదాపు 23 ఏళ్ల క్రితం నాటి కేసు విచారణలో వాయిదాల పర్వం కొనసాగుతుంది.

లఖ్‌నవూ, ఆగస్ట్ 20: ఆమ్ ఆద్మీ పార్టీ రాజ్యసభ సభ్యుడు సంజయ్ సింగ్‌ను అరెస్ట్ చేయాలని సుల్తాన్‌పూర్ కోర్టు మంగళవారం ఉత్తరప్రదేశ్‌ పోలీసులను ఆదేశించింది. ఆగస్ట్ 28వ తేదీ జరిగే విచారణకు ఆయన్ని హాజరు పరచాలని పోలీసులకు కోర్టు సూచించింది. ఉత్తరప్రదేశ్‌లోని సుల్తాన్‌పూర్ కోర్టులో దాదాపు 23 ఏళ్ల క్రితం నాటి కేసు విచారణలో వాయిదాల పర్వం కొనసాగుతుంది.

Also Read: Jammu and Kashmir Elections: తొలి విడత ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదల


ఈ వాయిదాలకు ఆప్ ఎంపీ సంజయ్ సింగ్ హాజరు కాకపోవడంపై సుల్తాన్‌పూర్ కోర్టు మంగళవారం తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. హాజరు కాకపోవడానికి గల కారణాలేమిటని ఆయన తరపు న్యాయవాదిని సూటిగా ప్రశ్నించింది. దీంతో సంజయ్ సింగ్ వ్యవహారంపై కోర్టు మండిపడింది. ఎంపీ సంజయ్ సింగ్‌తోపాటు మిగిలిన వారిని వెంటనే అరెస్ట్ చేయాలని ఉత్తరప్రదేశ్ పోలీసులు ఆదేశించింది. ఈ కేసును ఆగస్ట్ 28వ తేదీకి వాయిదా వేసింది. దాంతో ఆ వాయిదాకు సంజయ్ సింగ్‌తోపాటు వారిని కోర్టులో హాజరుపరచాలని పోలీసులకు కోర్టు సూచించింది.

Also Read: Kolkata: మీడియాని చూసి పరిగెత్తిన పోలీస్ అధికారి.. ఎందుకంటే..


ఈ నెల ఆగస్ట్ 13వ తేదీన ఈ కేసు విచారణకు సంజయ్ సింగ్‌తోపాటు సమాజావాదీ పార్టీ నేతలు అనుప్ సందా మరో నలుగురు హాజరు కాలేదు. దీంతో వారిపై కోర్టు నాన్ బెయిల్‌బుల్ వారెంట్ చేసింది. అనంతరం ఈ కేసును మంగళవారానికి వాయిదా వేసింది. ఈ రోజు సైతం వారు కోర్టుకు డుమ్మా కొట్టడంతో.. వీరి వ్యవహారంపై న్యాయమూర్తి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ క్రమంలో వారిని అరెస్ట్ చేసి .. కోర్టులో హాజరుపరచాలని పోలీసులను ఆదేశించారు.

Also Read: Jammu Kashmir assembly polls: జమ్మూ కశ్మీర్‌కు ఖర్గే, రాహుల్


మరోవైపు సంజయ్ సింగ్ తరఫు న్యాయవాది దీనిపై స్పందించారు. ఈ కేసులో బెయిల్ పిటిషన్‌పై ఆగస్ట్ 22న అలహాబాద్ హైకోర్టులోని లక్నో బెంచ్ ముందు విచారణకు రానుందని గుర్తు చేశారు. అలాగే స్పెషల్ మెజిస్ట్రేట్ ఆధ్వర్యంలోని ఎంపీ, ఎమ్మెల్యే కోర్టులో తదుపరి విచారణ తేదీని తర్వాత నిర్ణయిస్తామని తెలిపారన్నారు.

Also Read: Uttar Pradesh: మొరాదాబాద్‌ దారుణం.. నర్స్‌పై లైంగిక దాడి.. ఆసుపత్రి సీజ్


అసలు కేసు ఏమిటి?

2001, జూన్ 19వ తేదీన నగరంలోని సబ్జీ మండి ప్రాంత సమీపంలోని వంతెన వద్ద సమాజవాదీ పార్టీ మాజీ ఎమ్మెల్యే అనూప్ సందా సారథ్యంలో విద్యుత్ సరఫరాలో తీవ్ర అంతరాయానికి వ్యతిరేకంగా నిరసన చేపట్టారు. ఈ నిరసనలో సంజయ్ సింగ్‌తోపాటు మాజీ కౌన్సిలర్లు పాల్గొన్నారు. వీరిపై కొత్వాలి నగర్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదయింది. ఈ కేసు విచారణలో భాగంగా గతేడాది జనవరిలో ఈ నిరసనలో పాల్గొన్న ఆరుగురిని స్పెషల్ మేజిస్ట్రేట్ దోషులుగా నిర్ధారించారు.

Also Read: Karnataka: సీఎం సీటు కోసం డీకే శివకుమార్ తాపత్రయమా..?


దీంతో వారికి మూడు నెలల జైలు శిక్ష విధించారు. దాంతో వారిని.. ఎంపీ, ఎమ్మెల్యే కోర్టుకు హాజరుకావాలని ఆదేశించారు. కానీ ఈ ఆదేశాలను సంజయ్ సింగ్‌తోపాటు మిగిలిన అయిదుగురు పట్టించుకోలేదు. ఈ నేపథ్యంలో సుల్తాన్‌పూర్ కోర్టు ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. వారిని అరెస్ట్ చేయాలని పోలీసులను ఆదేశించింది.

Also Read: Spurious Liquor: కల్తీ మద్యం తాగి.. 14 మందికి తీవ్ర అస్వస్థత

For Latest News and National News click here

Updated Date - Aug 20 , 2024 | 09:27 PM

Advertising
Advertising
<