Shocking: గర్భవతికి ఆపరేషన్.. కడుపులో టవల్‌ను వదిలేసిన వైద్యులు
ABN, Publish Date - Aug 11 , 2024 | 08:50 PM
ఉత్తరప్రదేశ్‌లో షాకింగ్ ఘటన వెలుగు చూసింది. గర్భవతికి ఆపరేషన్ చేసిన వైద్యులు ఆమె కడుపులో టవల్‌ను వదిలిపెట్టారు. ఇంటికొచ్చాక ఆరోగ్యం మరింత క్షీణించడంతో ఆమెను మరో ఆసుపత్రిలో చేర్పించగా జరిగిన దారుణం వెలుగులోకి వచ్చింది.
ఇంటర్నెట్ డెస్క్: ఉత్తరప్రదేశ్‌లో (Uttarpradesh) షాకింగ్ ఘటన వెలుగు చూసింది. గర్భవతికి ఆపరేషన్ చేసిన వైద్యులు ఆమె కడుపులో టవల్‌ను వదిలిపెట్టారు. ఇంటికొచ్చాక ఆరోగ్యం మరింత క్షీణించడంతో ఆమెను మరో ఆసుపత్రిలో చేర్పించగా జరిగిన దారుణం వెలుగులోకి వచ్చింది.
పూర్తి వివరాల్లోకి వెళితే, వికాస్ కుమార్ తన భార్యను డెలివరీ కోసం అలీగఢ్‌లోని జీటీ రోడ్డులోగల శివ్ మహిహా ఆసుపత్రిలో చేర్పించారు. ఆమెకు కవలలు జన్మించారు. అయితే, ఆపరేషన్ సందర్భంగా వైద్యులు తీవ్ర నిర్లక్ష్యాన్ని ప్రదర్శించారు. టవల్ ఆమె కడుపులో ఉన్న విషయాన్ని మరిచి శస్త్రచికిత్స పూర్తి చేశారు. ఆ తరువాత ఆమె కడుపులో నొప్పిగా ఉందని చెప్పినా వైద్యులు పట్టించుకోకుండా ఏవో మందులు ఇచ్చి పంపించారు (UP Doctors leave towel in woman belly during delivery ).
Kolkata Incident: కోల్‌కతా హత్యాచార ఘటన.. వెలుగులోకి షాకింగ్ వాస్తవాలు!
ఆ తరువాత ఆమె ఆరోగ్యం మరింత క్షీణించడంతో భర్త ఆమెను మరో ఆసుపత్రిలో చేర్పించగా జరిగిన దారుణం గురించి వెలుగులోకి వచ్చింది. అక్కడి వైద్యులు మహిళ కడుపులోని టవల్‌ను తొలగించి ఆమెను కాపాడారు. కాగా, ఈ శస్త్రచికిత్సకు సంబంధించిన వీడియోను భర్త వికాస్ కుమార్ వైద్య ఆరోగ్య శాఖకు ఫిర్యాదు చేశారు. ఆపరేషన్ సందర్భంగా నిర్లక్ష్యం ప్రదర్శించిన డాక్టర్లపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
ఈ ఘటనపై పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తడంతో చీఫ్ మెడికల్ ఆఫీసర్ దర్యాప్తునకు ఆదేశించారు. ఇందుకోసం ఓ ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసినట్టు తెలిపారు. ఘటనకు బాధ్యులైన వారిపై చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. `
Updated Date - Aug 11 , 2024 | 08:50 PM