Viral News: 40 రోజుల్లో ఏడోసారి పాము కాటు.. సర్పాలు నిజంగా పగబడతాయా?
ABN, Publish Date - Jul 13 , 2024 | 09:57 AM
పాముల పగబడతాయా. ఇదో పెద్ద ప్రశ్న. ఉత్తరప్రదేశ్‌లో జరిగిన ఓ సంఘటన ఈ చర్చను మరోసారి తెరపైకి తెచ్చింది. యూపీకి చెందిన వికాస్ దూబే అనే 24 ఏళ్ల యువకుడు ఇటీవలే 35 రోజుల్లో 6 సార్లు పాముకాటుకు గురయ్యాడు. అయితే గురువారం మరోసారి పాము అతన్ని కాటు వేసింది.
ఫతేపూర్ (ఉత్తరప్రదేశ్): పాముల పగబడతాయా. ఇదో పెద్ద ప్రశ్న. ఉత్తరప్రదేశ్‌లో జరిగిన ఓ సంఘటన ఈ చర్చను మరోసారి తెరపైకి తెచ్చింది. యూపీకి చెందిన వికాస్ దూబే అనే 24 ఏళ్ల యువకుడు ఇటీవలే 35 రోజుల్లో 6 సార్లు పాముకాటుకు గురయ్యాడు. అయితే గురువారం మరోసారి పాము అతన్ని కాటు వేసింది. ఎక్కడికి వెళ్లినా పాము వెంటాడుతుండటంతో బాధితుడి కుటుంబీకులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
అయితే పాము తనను 9 సార్లు కాటేస్తానని చెప్పిందని వికాస్ చెప్పడం షాక్‌కి గురి చేస్తోంది. ఆఖరు కాటుకు తాను చనిపోతానని పాము తనతో అన్నట్లు బాధితుడు చెబుతుండటం చర్చనీయాంశం అవుతోంది. ఇలా 7సార్లు పాము కాటుకు గురైన వికాస్ ధూబే ప్రస్తుతం ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు.
తనకు ఆర్థిక సాయం చేయాలని అధికారులను కోరుతున్నాడు. ఈ ఘటనపై చీఫ్ మెడికల్ ఆఫీసర్ రాజీవ్ నయన్ గిరి మాట్లాడుతూ.. ఒకే వ్యక్తిని 7సార్లు పాము కాటేయడం ఆశ్చర్యానికి గురి చేస్తోందని అన్నారు. ఈ ఘటనపై విచారణకు ముగ్గురు వైద్యులతో కూడిన బృందాన్ని సిద్ధం చేసినట్లు తెలిపారు.
పాము కాటేసిన ప్రతిసారి ఒక్కరోజులో రోగి కోలుకుంటుండటం తనకు ఆశ్చర్యాన్ని కలగజేస్తోందని పేర్కొన్నారు. అయితే పాములు పగబడతాయనడానికి శాస్త్రీయ ఆధారం లేదు. మనుషులకు భయపడే అవి కాటేయడానికి వస్తాయి. బాధితుడు వేరే ఊరికి వెళ్లినా పాము కరిచిందని వైద్యులు తెలిపారు. ఎందుకు వికాస్ దూబేని పాములు టార్గెట్ చేశాయోననేది వైద్యులకు అర్థం కావట్లేదు.
For Latest News and National News click here
Updated Date - Jul 13 , 2024 | 01:37 PM