US Elections 2024: కమలా హారిస్ గెలుపు కోసం స్వగ్రామంలో ప్రత్యేక పూజలు
ABN, Publish Date - Nov 05 , 2024 | 06:27 PM
తులసేంద్రపురం గ్రామంలో హారిస్ విజయం కోరుకుంటూ టెంపుల్ సెర్మనీలో స్థానికులు ఎంతో ఉత్సాహంగా పాల్గొన్నారు. తమ గడ్డపై పుట్టిన ఆడకూతురు అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో విజయం సాధించాలని కోరుకుంటూ ఆలయం వెలుపల స్థానిక రాజనీయనేత అరుల్‌మొళి సుధాకర్ ఒక బ్యానర్ ఏర్పాటు చేశారు.
తులసేంద్రపురం: అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో (US Elections 2024) డెమొక్రటిక్ పార్టీ అభ్యర్థి కమలా హారిస్ (Kamala Harris) విజయం సాధించాలని కోరుకుంటూ ఆమె స్వగ్రామమైన తమిళనాడు(Tamilnadu)లోని తులసేంద్రపురం(Thulasendrapuram)లో ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్థానిక ప్రజలు కమలా హారిస్ గెలుపుకోసం అక్కడి అమ్మవారి ఆలయంలో పూజలు, ప్రార్థనలు చేశారు. హారిస్ తాతగారైన(తల్లికి తండ్రి) పీపీ గోపాలన్ వందేళ్ల క్రితం ఈ గ్రామంలో జన్మించారు. ఆ తర్వాత చెన్నైకి వెళ్లి ప్రభుత్వాధికారిగా రిటైరయ్యారు.
Parliament winter session: పార్లమెంట్ శీతాకాల సమావేశాల షెడ్యూల్ ఖరారు..
కాగా, తులసేంద్రపురం గ్రామంలో హ్యారిస్ విజయం కోరుకుంటూ టెంపుల్ సెర్మనీలో స్థానికులు ఎంతో ఉత్సాహంగా పాల్గొన్నారు. తమ గడ్డపై పుట్టిన ఆడకూతురు అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో విజయం సాధించాలని కోరుకుంటూ ఆలయం వెలుపల స్థానిక రాజనీయనేత అరుల్‌మొళి సుధాకర్ ఒక బ్యానర్ ఏర్పాటు చేశారు. ఆలయంలో ఉన్న ఒక ఫలకంపై విరాళాలు ఇచ్చిన వారి పేర్లలో కమలా హారిస్, ఆమె తాతగారి పేర్లు కూడా ఉండటం విశేషం. కమలా హారిస్ తమలో ఒకరని, ఆమె గెలుస్తారని, ఆమె గెలుపును ప్రకటించగానే బుధవారంనాడు ప్రత్యేక పూజలు నిర్వహించి, అన్నదానం చేస్తా్మని సుధాకర్ తెలిపారు.
నాలుగేళ్ల క్రితమే తులసేంద్రపురం అంతర్జాతీయ దృష్టిని కూడా ఆకర్షించింది. 2020లో హారిస్ డెమొక్రటిక్ పార్టీ విజయం సాధించాలని కోరుకుంటూ స్థానికులు పూజలు చేశారు. అమెరికా ఉపాధ్యక్షురాలిగా ఎన్నికైనప్పుడు కూడా బాణసంచా కాల్చి, అన్నదానం చేస్తూ సందడి చేశారు.
Also Read:
ఐదుగురు రెబల్స్‌పై ఉద్ధవ్ థాకరే వేటు
ఎన్నికల్లో పోటీపై శరద్ పవార్ సంచలన ప్రకటన
మదర్సాలపై కీలక తీర్పునిచ్చిన సుప్రీంకోర్టు..
For More National and telugu News
Updated Date - Nov 05 , 2024 | 06:31 PM