ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Uttar Pradesh: 40 మంది విద్యార్థులకు గాయాలు.. అయిదుగురి పరిస్థితి విషమం

ABN, Publish Date - Aug 23 , 2024 | 04:15 PM

ఉత్తరప్రదేశ్‌ బారాబంకిలోని పాఠశాల మొదటి అంతస్తు బాల్కానీ కుప్ప కూలింది. ఈ ప్రమాదంతో 40 మంది విద్యార్థులు గాయపడ్డారు. వారిలో అయిదుగురి పరిస్థితి విషమంగా ఉందని జిల్లా ఎస్పీ దినేశ్ కుమార్ వెల్లడించారు. ఈ ప్రమాదం జరిగిన వెంటనే విద్యార్థులను చికిత్స కోసం సమీపంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించామని తెలిపారు.

లఖ్‌నవూ, ఆగస్ట్ 20: ఉత్తరప్రదేశ్‌ బారాబంకిలోని పాఠశాల మొదటి అంతస్తు బాల్కానీ కుప్ప కూలింది. ఈ ప్రమాదంతో 40 మంది విద్యార్థులు గాయపడ్డారు. వారిలో అయిదుగురి పరిస్థితి విషమంగా ఉందని జిల్లా ఎస్పీ దినేశ్ కుమార్ వెల్లడించారు. ఈ ప్రమాదం జరిగిన వెంటనే విద్యార్థులను చికిత్స కోసం సమీపంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించామని తెలిపారు.

Also Read: Assam: అసోంలో దారుణం.. బంద్‌కు పిలుపునిచ్చిన విద్యార్థి సంఘాలు


అనంతరం వారికి మెరుగైన వైద్య సహాయం కోసం వైద్యుల సూచనల మేరకు జిల్లా ఆసుపత్రికి తరలించామని చెప్పారు. స్థానిక అవద్ అకాడమీ ప్రైవేట్ పాఠశాల విద్యార్థలు శుక్రవారం ఉదయం మొదటి అంతస్తు నుంచి అసెంబ్లీలో పాల్గొనేందుకు వచ్చే క్రమంలో ఈ ప్రమాదం చోటు చేసుకుందని వివరించారు. ఈ శిథిలాల కింద ఇంకా విద్యార్థులు చిక్కుకున్నారని.. వారిని వెలికి తీసేందుకు సహాయక చర్యలు కొనసాగుతున్నాయని తెలిపారు. వారికి సైతం మెడ, కాళ్లు, చేతులకు తీవ్ర గాయాలయ్యాయని చెప్పారు.

Also Read: ఉక్రెయిన్ రాజధాని కీవ్ చేరుకున్న భారత ప్రధాని నరేంద్ర మోదీ


ఈ ఏడాది దేశవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో ఈ తరహా ఘటనలు చోటు చేసుకున్నాయి. గత నెల జులైలో గుజరాత్‌లోని వడోదరాలో పాఠశాల గోడ కూలింది. ఈ ఘటనలో ఒక విద్యార్థి తీవ్రంగా గాయపడ్డారు. భోజన సమయంలో ఈ ప్రమాదం జరగింది. లేకుంటే మరింత మంది ఈ ప్రమాదంలో గాయపడి ఉండే వారని కథనాలు సైతం వెలువడ్డాయి.

అలాగే ఆంధ్రప్రదేశ్‌లో కడప శివారులోని అక్కయ్యపల్లిలోని వైసీపీ ఎమ్మెల్సీకి చెందిన ఓ పాఠశాల పైకప్పు కుప్ప కూలింది. ఈ ప్రమాదంలో ఆరుగురు విద్యార్థులు తీవ్రంగా గాయపడ్డిన విషయం తెలిసిందే.


మధ్యప్రదేశ్‌లో కుప్పకూలిన స్లాప్.. అయిదుగురు మృతి

మరోవైపు మధ్యప్రదేశ్‌ ఇండోర్ జిల్లాలో మ్హౌ తాసిల్ పరిధిలోని చోర్లా గ్రామంలో నిర్మాణంలో ఉన్న రిసార్ట్ పైకప్పు కుప్పకూలింది. ఈ ప్రమాదంలో అయిదుగురు కార్మికులు మరణించారు. గురువారం రాత్రి కార్మికులు నిద్రిస్తున్న సమయంలో ఈ ఘటన చోటు చేసుకుందని పోలీసులు వెల్లడించారు. మృతదేహాలను పోస్ట్‌మార్టం కోసం జిల్లా ఆసుపత్రికి తరిలించినట్లు ఇండోర్ గ్రామీణ ఎస్పీ హితికా వాసిల్ తెలిపారు.

మరిన్ని జాతీయ వార్తలు కోసం క్లిక్ చేయండి..

Updated Date - Aug 23 , 2024 | 04:31 PM

Advertising
Advertising
<