ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Uttarakhand: జస్ట్ 5 నెలల్లో.. భారీగా పెరిగిన హెచ్ఐవీ కేసులు

ABN, Publish Date - Oct 31 , 2024 | 08:35 PM

ఉత్తరాఖండ్‌లోని రామ్‌నగర్‌లో హెచ్ఐవీ కలకలం రేగింది. కేవలం ఐదు నెలల్లోనే 20 మందికి ఈ వ్యాది సోకింది. దీంతో స్థానికంగా కలకలం మొదలైంది. ప్రతి ఏటా 20 హెచ్ఐవీ కేసులు నమోదు అయ్యేవని.. కానీ ఐదు నెలల్లోనే ఆ కేసులు నమోదు కావడం.. తాజా పరిస్థితికి అద్దం పడుతుందని వైద్యారోగ్య శాఖ అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

నైనిటాల్, అక్టోబర్ 31: ఉత్తరాఖండ్‌లోని రామ్‌నగర్‌లో హెచ్ఐవీ కేసులు ఒక్కసారిగా ఇబ్బడి ముబ్బడి పెరిగాయి. దీంతో వైద్యారోగ్య శాఖ ఉన్నతాధికారి హరీశ్ చంద్ర పంత్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. కేవలం 5 మాసాల్లోనే 20 మందికి ఈ వ్యాధి సోకిందని తెలిపారు. గత కొన్నేళ్లుగా ఈ కేసుల సంఖ్య భారీగా పెరుగుతున్నాయని ఆయన గుర్తు చేశారు.

Also Read: Gold Rates: భారీగా పెరిగిన బంగారం ధర.. ఈ టైంలో కొనుగోలు చేయాలా? వద్దా?

Also Read: కొత్తిమీర తింటే.. ఇన్ని ప్రయోజనాలున్నాయా?

Also Read: Bengaluru: ఉచిత బస్సు పథకంపై సీఎం కీలక ప్రకటన


అయితే ఈ వ్యాధి సోకిన వారు ప్రస్తుతం పలు ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారని వివరించారు. 17 ఏళ్ల యువతి మాదక ద్రవ్యాలకు బానిసగా మారిందన్నారు. నగదు కోసం ఆమె పలువురు వ్యక్తులతో లైంగిక సంబంధం పెట్టుకుందని చెప్పారు. వారికి సైతం హెచ్‌ఐవీ సంక్రమించిందని అనుమానిస్తున్నారు. వారి నుంచి వారి భార్యలకు ఈ వ్యాధీ వ్యాపించిందని పేర్కొన్నారు.

Also Read: Diwali 2024: నరకాసురుడు ఎవరు ? దీపావళి రోజు అతని దిష్టిబొమ్మను ఎందుకు దహనం చేస్తారంటే..?

Also Read: CM Chandrababu: సరిగ్గా ఏడాది.. అంతలో ఎంత తేడా?


సాధారణంగా నైనిటాల్‌లో ఏడాదికి 20 ఏయిడ్స్ కేసులు నమోదవుతాయి. కానీ ఈ ఏడాది కేవలం ఐదు నెలల్లోనే 20 కేసులు నమోదు కావడంతో వైద్యారోగ్య శాఖ అధికారులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దీంతో ఏయిడ్స్‌పై స్థానికంగా ప్రజల్లో అవగాహన కల్పించేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఈ వ్యాధీ పట్ల ప్రజల్లో చైతన్యం కలిగించేందుకు పలు కార్యక్రమాలకు రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. అలాగే అక్రమ మార్గంలో సరఫరా అవుతున్న డ్రగ్స్ కట్టడి చేసేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. అందుకోసం ఎక్కడికక్కడ తనిఖీలు నిర్వహిస్తుంది. మరోవైపు ఈ వ్యవహారంపై సమగ్ర విచారణకు ప్రభుత్వం ఆదేశించింది.

Also Read: ఆలూ చిప్స్‌.. ఆరోగ్యానికి లాభమా? నష్టమా?

Also Read: viral video: దీపావళి పండగ వేళ మామ్మా మజాకా

For National News And Telugu News

Updated Date - Oct 31 , 2024 | 08:35 PM