ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Manish Sisodiya: మనీష్ సిసోడియాకు భారీ ఊరట..

ABN, Publish Date - Aug 09 , 2024 | 11:02 AM

నేడు సుప్రీంకోర్టులో ఢిల్లీ మాజీ డిప్యూటీ సీఎం, ఆప్ నేత మనీష్ సిసోడియా బెయిల్ పిటిషన్‌పై తీర్పు వెలువడింది. సిసోడియాకు సుప్రీంకోర్టులో భారీ ఊరట లభించింది. సుదీర్ఘ నిరీక్షణ అనంతరం ఆయనకు షరతులతో కూడిన బెయిల్‌ను సుప్రీం మంజూరు చేసింది.

ఢిల్లీ: నేడు సుప్రీంకోర్టులో ఢిల్లీ మాజీ డిప్యూటీ సీఎం, ఆప్ నేత మనీష్ సిసోడియా బెయిల్ పిటిషన్‌పై తీర్పు వెలువడింది. సిసోడియాకు సుప్రీంకోర్టులో భారీ ఊరట లభించింది. సుదీర్ఘ నిరీక్షణ అనంతరం ఆయనకు షరతులతో కూడిన బెయిల్‌ను సుప్రీం మంజూరు చేసింది. ఎక్సైజ్ పాలసీ కేసులో 17 నెలల తర్వాత ఆయనకు బెయిల్ మంజూరు చేస్తూ జస్టిస్ బీఆర్ గవాయ్ ధర్మాసనం తుది తీర్పును వెలువరించింది. ప్రతి సోమవారం దర్యాప్తు సంస్థ ముందు హాజరుకావాలని సిసోడియాను సుప్రీం ఆదేశించింది. సీబీఐ, ఈడీ కేసులను విడివిడిగా సుప్రీం విచారించింది. విచారణ పూర్తైన అనంతరం కొద్ది రోజుల క్రితం తీర్పును రిజర్వ్ చేసి నేడు వెలువరించింది. ఈ క్రమంలోనే 17 నెలల తర్వాత మనీష్ సిసోడియా బయటకు రానున్నారు.


కొద్ది రోజుల క్రితం ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌కు ఢిల్లీ మద్యం విధానం కేసులో బెయిల్ లభించింది. ఇప్పుడు ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియాకు సైతం బెయిల్ మంజూరు కావడంతో ఆప్ నేతలు ఊపిరి పీల్చుకున్నారు. అవినీతి, మనీలాండరింగ్ కేసుల్లో సిసోడియాకు బెయిల్ సుప్రీం బెయిల్ ఇచ్చింది. ఏ నిందితుడిని కాలపరిమితి లేకుండా జైలులో ఉంచలేరని ధర్మాసనం వ్యాఖ్యానించింది. కేసు విచారణలో పురోగతి లేకపోతే... ఒక పరిమితి దాటిన తర్వాత జైలులో ఉంచలేరని పేర్కొంది. అలా కాదు అని... జైలులో ఉంచాలి అనుకుంటే ఆ వ్యక్తి హక్కులు హరించడమేనని సుప్రీంకోర్టు అభిప్రాయ పడింది. బెయిల్‌కి అప్లికేషన్ పెట్టుకోవడం, బెయిల్ పొందడం వారి హక్కు అని ధర్మాసనం పేర్కొంది.


సిసోదియాకు బెయిల్ ఇవ్వొద్దు అని దర్యాప్తు సంస్థలు చేసిన వాదనలు అన్నింటినీ ధర్మాసనం తోసిపుచ్చింది. విచారణ ఆలస్యం కావడానికి సిసోడియా కూడా కారణమన్న ట్రయల్ కోర్టు ఆదేశాలను సైతం పక్కనబెట్టింది. ఈ విషయంలో ఢిల్లీ హైకోర్టు చేసిన ప్రతికూల వ్యాఖ్యలను కూడా సర్వోన్నత న్యాయస్థానం కొట్టివేసింది. బెయిల్ అనేది నియమమని.. జైలు మినహాయింపు అని ట్రయల్ కోర్టులు, హైకోర్టులు గ్రహించాల్సిన సమయం ఆసన్నమైందని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. ట్రయల్ వేగంగా జరిగేందుకు సిసోడియా సహరించాలని ఆదేశాల్లో స్పష్టం చేసింది. సిసోడియా బెయిల్‌ను ఈడీ, సీబీఐ వ్యతిరేకించాయి. సిసోడియా విచారణకు సహకరించడం లేదని, జాప్యం చేస్తున్నారని, అనవసరపు పత్రాలను తనిఖీ చేయాలని కోరుతున్నారని సుప్రీంకోర్టుకు అడిషనల్ సొలిసిటర్ జనరల్ (ఏఎస్‌జీ) ఎస్వీ రాజు తెలిపారు. సిసోడియాకు బెయిల్ ఇస్తే సాక్ష్యాలను, సాక్షులను ప్రభావితం చేసే అవకాశం ఉందని బెయిల్ ఇవ్వొద్దని సుప్రీంకోర్టును దర్యాప్తు సంస్థలు కోరాయి. గతేడాది అక్టోబర్ నుంచి తనపై ఉన్న కేసుల్లో ఎలాంటి పురోగతి లేదని కాబట్టి తనకు బెయిల్ మంజూరు చేయాలని సుప్రీంకోర్టును సిసోడియా కోరారు. మొత్తానికి ఆయనకు షరతులతో కూడిన బెయిల్ మంజూరైంది.

Updated Date - Aug 09 , 2024 | 11:11 AM

Advertising
Advertising
<