Share News

Donald Trump: ఆఫీసర్.. ఆఫీసర్ అన్నా పట్టించుకోలేదా?

ABN , Publish Date - Jul 15 , 2024 | 06:35 PM

అమెరికా మాజీ అధ్యక్షుడు, రిపబ్లిక్ పార్టీ అభ్యర్థి డోనాల్డ్ ట్రంప్‌పై హత్యాయత్నం జరగడం.. ఆయన తృటీలో ప్రాణాలతో బయట పడడం చకచకా జరిగిపోయాయి.

 Donald Trump: ఆఫీసర్.. ఆఫీసర్ అన్నా పట్టించుకోలేదా?

న్యూయార్క్, జులై 15: అమెరికా మాజీ అధ్యక్షుడు, రిపబ్లిక్ పార్టీ అభ్యర్థి డోనాల్డ్ ట్రంప్‌పై హత్యాయత్నం జరగడం.. ఆయన తృటీలో ప్రాణాలతో బయట పడడం చకచకా జరిగిపోయాయి. అయితే కాల్పులు జరిపిన వ్యక్తి ట్రంప్ సభకు సమీపంలోనే ఉండడం. పుట్‌బాల్ ఆట స్థలంలోని రేకుల షెడ్‌ పైభాగానికి అతడు ఎక్కి మరీ ఆ దేశ మాజీ అధ్యక్షుడు ప్రాణాలకు లక్ష్యంగా తుపాకీ గురి పెట్టి ఉన్నాడని పలువురు ప్రత్యక్ష సాక్షులు భద్రతా అధికారులకు సమాచారం ఇచ్చినా.. వారు ఆ దిశగా అడుగులు ఎందుకు వేయలేక పోయారనే ఓ ప్రశ్న అయితే ప్రస్తుతం ఉత్పన్నమవుతుంది. ట్రంప్ ర్యాలీ సందర్భంగా ఆయన మద్దతుదారులు.. ఆ సమీపంలోని పుట్‌బాల్ ఆట స్థలం వద్ద ఉండి ఓ వీడియో తీశారు. ఆ వీడియను సిటిజన్ జర్నలిస్ట్.. గ్రాంట్ గాడ్ విన్ పోస్ట్ చేసింది.

Also Read: Bihar: రష్యా సైన్యానికి హజీపూర్ బూట్లు.. పెరుగుతున్న డిమాండ్


అందులో ట్రంప్‌ను తుపాకీతో కాల్చేందుకు 20 ఏళ్ల ఓ వ్యక్తి.. రూఫ్‌పై పొడుకొని అటు ఇటు కదులుతున్నారు. ఈ విషయాన్ని స్థానికులు చూసి.. ఆఫీసర్, ఆఫీసర్.. అంటూ ఒకతను సమీపంలోని భద్రతాధికారిని పిలిచాడు. ఇంతలో మరొకతను మాట్లాడుతూ.. రూఫ్‌పై ఎవరో ఒకరున్నారన్నాడు. ట్రంప్‌ లక్ష్యంగా తుపాకీ గురి పెట్టిన వ్యక్తిని చూస్తూన్నారని పేర్కొన్నారు. ట్రంప్ సభకు సుమారు 400 అడుగుల దూరంలో.. 150 మీటర్ల సమీపంలోనే అతడు షెడ్ రూఫ్ ఎక్కాడు. ఈ వీడియో ఇన్‌స్టాగ్రామ్‌లో వైరల్ అవుతుంది. ట్రంప్ సభ వేళ.. సీక్రెట్ సర్వీస్, లా ఎన్స్‌ఫోర్స్‌మెంట్ సరిగ్గా వ్యవహరించలేదనే అభిప్రాయం అయితే సర్వత్రా వ్యక్తమవుతుంది.

Read Latest AP News and Telugu News

Read Latest Telangana News and National News

Read Latest Chitrajyothy News and Sports News

Updated Date - Jul 15 , 2024 | 06:40 PM