ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Kerala: కేరళలో బర్డ్‌ఫ్లూ స్వైర విహారం సరిహద్దుల్లో నిఘా తీవ్రతరం

ABN, Publish Date - Apr 22 , 2024 | 12:10 PM

కేరళ రాష్ట్రంలో బర్డ్‌ఫ్లూ స్వైర విహారం చేస్తోంది. దీంతో రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. కేరళ నుంచి రాష్ట్రంలోకి ప్రవేశించే వాహనాలపై నిఘా వేశారు. ముఖ్యంగా కేరళ నుంచి కోళ్ళ దానా, కోళ్ళ ఉత్పత్తులు, కోడిమాంసం, కోడిగుడ్లు వంటివి సరఫరా కాకుండా అడ్డుకుంటున్నారు. కేరళ రాష్ట్రంలోని ఆలప్పుళా జిల్లాలోని కుట్టనాడులో బర్డ్‌ఫ్లూ కేసులు వెలుగు చూశాయి. ఈ కేసులు వచ్చిన కిలోమీటరు దూరంలోని కోళ్ళఫారాల్లో కోళ్ళతో పాటు కోళ్ళ ఉత్పత్తులను నిర్వీర్యం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది.

Bird Flu Sanctuary in Kerala

అడయార్‌ : కేరళ రాష్ట్రంలో బర్డ్‌ఫ్లూ స్వైర విహారం చేస్తోంది. దీంతో రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. కేరళ నుంచి రాష్ట్రంలోకి ప్రవేశించే వాహనాలపై నిఘా వేశారు. ముఖ్యంగా కేరళ నుంచి కోళ్ళ దానా, కోళ్ళ ఉత్పత్తులు, కోడిమాంసం, కోడిగుడ్లు వంటివి సరఫరా కాకుండా అడ్డుకుంటున్నారు. కేరళ రాష్ట్రంలోని ఆలప్పుళా జిల్లాలోని కుట్టనాడులో బర్డ్‌ఫ్లూ కేసులు వెలుగు చూశాయి. ఈ కేసులు వచ్చిన కిలోమీటరు దూరంలోని కోళ్ళఫారాల్లో కోళ్ళతో పాటు కోళ్ళ ఉత్పత్తులను నిర్వీర్యం చేస్తున్నారు.


ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. కేరళ రాష్ట్ర సరిహద్దులకు ఆనుకునివున్న గ్రామాల్లో నిఘా పెట్టారు. ఇందులో భాగంగా రెండు రాష్ట్రాల మధ్య ప్రత్యేక చెక్‌ పోస్టులు ఏర్పాటు చేసి కేరళ నుంచి రాష్ట్రంలోకి ప్రవేశించే సరకు రవాణా వాహనాలను తనిఖీ చేస్తున్నారు. కేరళ నుంచి రాష్ట్రానికి వచ్చే అన్ని రకాల కోళ్ళ ఉత్పత్తులను తిప్పి పంపుతున్నారు. రాష్ట్రంలో బర్డ్‌ఫ్లూ కేసులు ప్రబలకుండా ఉండేలా చర్యలు తీసుకుంటున్నారు. అలాగే, కూరగాయలు, ఇతర కిరాణా సరకులతో వచ్చే వాహనాలను కూడా తనిఖీ చేస్తున్నారు.


ఈ వాహనాల టైర్లకు క్లోరిన్‌ డై ఆక్సైడ్‌ అనే రసాయనాన్ని పిచికారి చేస్తున్నారు. ఇందుకోసం ఒక పశుసంవర్థక శాఖ అధికారి, ఒక అసిస్టెంట్‌, క్రిమి సంహారిణి పిచికారి చేసే ఇద్దరు సిబ్బంది సరిహద్దుల్లోని చెక్‌ పోస్టుల వద్ద 24 గంటల పాటు నిత్యం విధుల్లో ఉంటున్నారు. కేరళ నుంచి కన్నియాకుమారికి వచ్చే వాహనాలను తనిఖీ చేసేందుకు వీలుగా కుమరి జిల్లా సరిహద్దుల్లో కూడా ప్రత్యేక చెక్‌ పోస్టులను తాత్కాలికంగా ఏర్పాటు చేశారు. పడందాలుమూడు ప్రాంతంలో ఏర్పాటు చేసిన చెక్‌పోస్టులో గట్టి నిఘా పెట్టారు. ఇక్కడ మూడు బృందాలుగా పశుసంవర్థక శాఖ అధికారులు డ్యూటీ చేస్తున్నారు.


మరోవైపు రాష్ట్రంలో కోళ్ళపరిశ్రమకు పెట్టింది పేరైన నామక్కల్‌లోని కోళ్ళఫారాల్లో ముందు జాగ్రత్త చర్యలు చేపట్టారు. అన్ని కోళ్ళఫారాల వద్ద క్రిమిసంహార మందులను పిచికారి చేస్తున్నారు. ఈ ఒక్క జిల్లాలోనే దాదాపు ఆరు కోట్ల కోడిగుడ్లు ఉత్పత్తి అవుతున్నాయి. ఈ కోళ్ళఫారాలకు దాణా తీసుకొచ్చే వాహనాల టైర్లకు క్రిమి సంహార మందు పిచికారి చేసిన తర్వాతే లోనికి అనుమతిస్తున్నారు. ఇప్పటివరకు జిల్లాలో ఒక్క బర్డ్‌ఫ్లూ కేసు కూడా నమోదు కాలేదని కోళ్ళఫారం యజమానులు అభిప్రాయపడుతున్నారు.


మరిన్ని జాతీయ వార్తల కోసం

Updated Date - Apr 22 , 2024 | 01:57 PM

Advertising
Advertising