Voronezh Radar: భారత్ అమ్ములపొదిలో వోరోనెజ్ రక్షణ కవచం
ABN, Publish Date - Dec 12 , 2024 | 05:33 AM
గగనతల రక్షణలో భారత్ అమ్ములపొదిలో సరికొత్త కవచం చేరనుంది. రష్యాకు చెందిన అల్మాజ్-యాంటీ సంస్థ అభివృద్ధి చేసిన ‘వోరోనెజ్ రాడార్’ వ్యవస్థ అందుబాటులోకి వస్తే..
గగనతల రక్షణకు రష్యా సాంకేతికత
8 వేల కి.మీ దూరంలోనే.. క్షిపణులను గుర్తించే అధునాతన వ్యవస్థ
34 వేల కోట్ల డీల్ కోసం భారత్ చర్చలు
చిత్రదుర్గ వద్ద ఏర్పాటుకు సన్నాహాలు
న్యూఢిల్లీ, డిసెంబరు 11: గగనతల రక్షణలో భారత్ అమ్ములపొదిలో సరికొత్త కవచం చేరనుంది. రష్యాకు చెందిన అల్మాజ్-యాంటీ సంస్థ అభివృద్ధి చేసిన ‘వోరోనెజ్ రాడార్’ వ్యవస్థ అందుబాటులోకి వస్తే.. శత్రువులు ప్రయోగించే బాలిస్టిక్ క్షిపణులను 8 వేల కిలోమీటర్ల దూరం నుంచే గుర్తించే సామర్థ్యం మన సొంతం అవుతుంది. అంతేకాదు.. శత్రువుల నిఘా విమానాలు(స్టెల్తర్ ఫైటర్), యుద్ధ విమానాలు, అంతరిక్ష వస్తువులను సైతం వోరోనెజ్ రాడార్ వ్యవస్థ గుర్తించగలదు. ఆ వెంటనే అప్రమత్తమై.. శత్రు క్షిపణులు, నిఘా/యుద్ధ విమానాలను గాల్లోనే అడ్డుకుంటుంది.
కర్ణాటకలో ఏర్పాటు
వోరోనెజ్ వ్యవస్థను కర్ణాటకలోని చిత్రదుర్గ వద్ద ఏర్పాటు చేయాలని భారత ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకు రూ.34 వేల కోట్లతో అల్మాజ్-యాంటీతో ఒప్పందం కుదుర్చుకోనుంది. ఇప్పటికే అల్మాజ్-యాంటీ డిప్యూటీ చైర్మన్ వ్లాదిమిర్ మెడోవ్నికోవ్ నేతృత్వంలోని బృందం గత నెల ఢిల్లీ, బెంగళూరు నగరాల్లో పర్యటించింది. ఈ ప్రాజెక్టు ఏర్పాటుకు చిత్రదుర్గ సరైన ప్రదేశమని వెల్లడించింది. దీంతో.. డీల్ ఒప్పందాల కోసం డీఆర్‌డీవో అనుబంధ సంస్థ ఎలకా్ట్రనిక్స్ అండ్ రాడార్ డెవల్‌పమెంట్ ఎస్టాబ్లి్‌షమెంట్(ఈఆర్‌డీవో) చర్యలు ప్రారంభించింది. ఈ విషయంలో భారత్-రష్యా మధ్య చర్చలు తుది దశలో ఉన్నాయని ‘సండే గార్డియన్’ ఓ కథనాన్ని ప్రచురించింది. ప్రస్తుతం రష్యా రాడార్, క్షిపణి రక్షణ, గగనతల రక్షణ వ్యవస్థను అభివృద్ధి చేసే అతిపెద్ద కంపెనీల్లో అల్మాజ్-యాంటీ ఒకటి కావడం గమనార్హం..!
ఎలా పనిచేస్తుంది..?
వోరోనెజ్ వ్యవస్థ 8 వేల కిలోమీటర్ల దూరంలోనే శత్రువుల బాలిస్టిక్ క్షిపణులను గుర్తించగలదు. ఈ వ్యవస్థలోని ఒక రాడార్ శత్రు క్షిపణిని గుర్తించి, యాక్టివేట్ అయితే.. మరో రీజియన్‌లోని రాడార్ గనక అదే క్షిపణిని గుర్తిస్తే.. మొదటి రాడార్‌కు అదనపు సమాచారాన్ని అందజేస్తుంది.
యుద్ధ విమానాలు, స్టెల్తర్ ఫైటర్లు, అంతరిక్ష వస్తువులను కూడా ఈ రాడార్లు గుర్తించి, వెంటనే సమాచారాన్ని అందజేస్తాయి.
ఈ రాడార్లలోని అరే టెక్నాలజీ.. శత్రువుల టార్గెట్లను వేగంగా పసిగడతాయి.
డ్నెపర్, డారిల్ వంటి పాత తరం రాడార్ వ్యవస్థలకంటే వోరెనెజ్ వ్యవస్థ సమర్థంగా పనిచేస్తుంది. రష్యా వద్ద ఉన్న వోరోనెజ్ రాడార్ వ్యవస్థ ఆ దేశం మొత్తానికి రక్షణగా నిలుస్తోంది.
ఒప్పందం కుదిరితే.. భారత్‌కు వోరోనెజ్-ఎం రకం రాడార్లు వచ్చే అవకాశాలున్నాయి. ఈ రకం రాడార్లు సుదూర ప్రాంతాల నుంచి వచ్చే శత్రువుల క్షిపణులను గుర్తిస్తాయి. మధ్యశ్రేణి, దీర్ఘశ్రేణి బాలిస్టిక్ క్షిపణుల నుంచి రక్షణ కల్పిస్తాయి. దీంతోపాటు.. వోరోనెజ్-ఎం(వీహెచ్‌ఎ్‌ఫ బ్యాండ్) కూడా ఇవే పనులను చేస్తుంది. వోరోనెజ్-డీఎం(యూఏహెచ్‌ఎ్‌ఫ బ్యాండ్) చిన్న లక్ష్యాలను సైతం మెరుగైన రిజల్యూషన్‌తో.. అత్యంత కచ్చితంగా ట్రాక్ చేస్తాయి.
చైనా-పాక్‌ల నుంచి రక్షణ
చైనా, పాకిస్థాన్ ప్రయోగించే క్షిపణుల నుంచి ఈ వ్యవస్థ ముందస్తు హెచ్చరికలను అందించగలదు. ఇది అయానోస్పియర్ నుంచి.. తిరిగి భూమికి వచ్చే అధిక ఫ్రీక్వెన్సీ సంకేతాలను ప్రసారం చేస్తుంది. అవి దీర్ఘశ్రేణి క్షిపణులు, యుద్ధ విమానాలు, నౌకలను గుర్తించగలవు. రష్యా కూడా.. ఆసియా, ఐరోపా, ఉత్తర అమెరికా నుంచి ఎదురయ్యే ప్రమాదాలను పర్యవేక్షించడానికి వ్యూహాత్మకంగా వోరోనెజ్-ఎం రాడార్ వ్యవస్థను ఏర్పాటు చేసుకుంది. భారత వైమానిక దళానికి కూడా ఇలాంటి రాడార్ వ్యవస్థ అవసరం. సరిహద్దుల్లో చైనా పెద్ద సంఖ్యలో స్టెల్త్ ఫైటర్లు, డ్రోన్లను మోహరించింది. చైనా నుంచి పాకిస్థాన్ జే-35 స్టెల్త్ ఫైటర్లను కొనుగోలు చేసే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలోనే రష్యాతో ఒప్పందాలు కుదుర్చకోకూడదని అమెరికా చెబుతున్నా.. భారత్ వోరోనెజ్ వ్యవస్థపై దృష్టి సారించినట్లు తెలుస్తోంది.
మేకిన్ ఇండియాకు ఊతం!
కేంద్ర ప్రభుత్వం రక్షణకు సంబంధించి పూర్తిస్థాయి విదేశీ సాంకేతికతపై మొగ్గుచూపుతోంది. ఒకవేళ విదేశీ కంపెనీల నుంచి కొనుగోళ్లు జరిపినా.. సాంకేతిక బదిలీ అంశంపై దృష్టిసారిస్తోంది. ఈ క్రమంలో 50 దాకా భారత భాగస్వాములు, స్టార్టప్ లు వోరోనెజ్ వ్యవస్థలో 60ు ఉద్పాదకతను చేపడతాయని తెలుస్తోంది. ఈ ప్రాజెక్టు వల్ల ఉపాధి అవకాశాలు పెరుగుతాయని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది.
Updated Date - Dec 12 , 2024 | 05:33 AM