ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

చకచకా నడకతో.. బీపీ, షుగర్‌కు చెక్‌!

ABN, Publish Date - Dec 23 , 2024 | 03:40 AM

మీకు వేగంగా నడిచే అలవాటుందా? పెద్ద పెద్ద అంగలు వేస్తూ మీ పక్కనున్నవారి కన్నా స్పీడుగా దూసుకుపోతారా? అయితే మీకో శుభవార్త. అలా వేగంగా నడిచేవారు మధుమేహం, అధిక రక్తపోటు, హృద్రోగాల బారిన పడే ముప్పు తక్కువని తాజా అధ్యయనంలో వెల్లడైంది.

జపాన్‌ పరిశోధకుల తాజా అధ్యయనంలో వెల్లడి

న్యూఢిల్లీ, డిసెంబరు 22: మీకు వేగంగా నడిచే అలవాటుందా? పెద్ద పెద్ద అంగలు వేస్తూ మీ పక్కనున్నవారి కన్నా స్పీడుగా దూసుకుపోతారా? అయితే మీకో శుభవార్త. అలా వేగంగా నడిచేవారు మధుమేహం, అధిక రక్తపోటు, హృద్రోగాల బారిన పడే ముప్పు తక్కువని తాజా అధ్యయనంలో వెల్లడైంది. జపాన్‌కు చెందిన దోషీషా యూనివర్సిటీకి చెందిన పరిశోధకులు.. స్థూలకాయం, నడుము చుట్టుకొలత ఎక్కువగా ఉన్న 25 వేల మందిపై ఈ అధ్యయనం చేశారు. ఆ పాతికవేల మందిలో.. తమను తాము ‘వేగంగా నడిచేవారు’గా అభివర్ణించుకున్న వారికి మధుమేహం వచ్చే ముప్పు 30 శాతం తక్కువగా ఉన్నట్టు వెలడైంది. అలాగే రక్తపోటు, డిస్‌లిపిడెమియా (రక్తంలో కొవ్వు స్థాయులు అసాధారణంగా ఉండడం) ముప్పు కూడా తక్కువేనని తేలింది. కాబట్టి.. ఊబకాయంతో బాధపడేవారు కూడా వేగంగా నడవగలిగితే వారికి ఆ వ్యాధులు వచ్చే ముప్పు తగ్గుతుందని పేర్కొన్నారు.

Updated Date - Dec 23 , 2024 | 03:40 AM